నేల రాలిన పారిజాతం . (02) కధానిక. గత వారం : జగన్నాధం , షౌకత్ అలీ , విశ్వనాధం మంచి మిత్రులు .బడిపంతులుగా పదవీ విరమణ తర్వాత హైదరాబాదు నగరంలో స్థిరపడతారు జగన్నాధం దంపతులు. ఒకరోజు విశ్వనాధం కుమార్తె పారిజాతం అనుకోకుండా బజారులో జగన్నాధానికి తారసపడి పలకరిస్తుంది. సాయింత్రం జగన్నాధం ఇంటికి వస్తానని చెబుతుంది పారిజాతం . అన్నట్లుగానే సాయింత్రం వస్తుంది పారిజాతం . తనతో కూడా షౌకత్ అలీ కూతురు షబ్నంని తీసుకొని వస్తుంది . ఇక చదవండి ..... ... (గత వారం తరువాయి . )
వృత్తి రీత్యా ముగ్గురమూ ఒకే చోట ఉండటంతో నేను ,విశ్వనాధం, షౌకత్ అలీ దాదాపు ప్రతీ రోజూ కలుస్తూ ఉండేవాళ్ళం . మా కుటుంబ సభ్యులు కూడా ఒకరితో ఒకరు బాగా కలిసిపోయారు . అలా కాలం పదేళ్ళు ఆనందంగా గడిచిపోయింది రాజమండ్రి లో .
పారిజాతం , షబ్నం మా స్కూలు లోనే చిన్న తరగతులు చదువుకుంటూ ఉండేవారు . పారిజాతం చదువులో బాగా చురుకు.అలాగే ఆటల్లో కూడా.
కూతురు ఆశక్తి గమనించిన విశ్వనాధం పారిజాతానికి చదరంగం ,కరాటే విద్యలు ఆ చిన్న వయసు లోనే నేర్పించాడు. షబ్నం చదువులో మెరిక . వాళ్ళిద్దరి బాల్యం చాలా వరకు మా ఇంట్లోనే గడిచింది .
షౌకత్అలీ న్యాయమూర్తి కావాలన్న ఆశయంతో ఏవో పరీక్షలు వ్రాస్తూ ఉండేవాడు . నేనూ , విశ్వనాధం స్కూలు మేస్టారు గిరీతో సంతుష్టి .
ఒక రోజు సాయింత్రం నేను గోదావరి గట్టు చేరేసరికి అప్పటికే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు విశ్వనాధం .
కాస్సేపటికి షౌకత్అలీ వచ్చి చేరాడు మాతో . "మీకు ఆనందం కలిగించేదీ అదే సమయంలో నిరుత్సాహ పరిచే న్యూస్ చెప్పాలిరా ! " అన్నాడు అలీ వచ్చి ప్రక్కన కూర్చుంటూ .
విశ్వనాధం నా వైపు చూసాడు . నేను విశ్వనాధం కేసి చూసాను . ఇద్దరం షౌకత్ అలీ కేసి చూసాం "ఏమిటీ " అన్నట్లుగా .
"నాకు మునసబు కోర్టు జడ్జి గా సెలెక్ట్ అయినట్లు ఉత్తర్వులు వచ్చాయి . వచ్చే సోమవారం జాయిన్ అవ్వాలి శ్రీకాకుళంలో "అన్నాడు షౌకత్ అలీ. ఇద్దరమూ అభినందనలు తెలిపాము . నిజం చెప్పాలంటే షౌకత్ అలీ దూరంగా వెళ్లిపోతున్నందుకు కొంత నిరుత్సాహం కూడా కలిగింది.
షౌకత్ అలీ మమ్మల్ని వదిలి శ్రీకాకుళం వెళ్ళిన కొద్ది రోజులకే నాకు రాజమండ్రి నుండి బదలీ ఆర్డర్లు అందాయి . ఆ తర్వాత విశ్వనాధం , షౌకత్అలీ కబుర్లు తెలియలేదు . ఎవరి ఉద్యోగ భాద్యతలలో వాళ్ళం మునిగి పోయాం.
...

" ఏంటి ! అంకుల్ ! ఏమిటి ఆలోచిస్తున్నారూ ? " అన్న షబ్నం ప్రశ్నకి గతం లోంచి వర్తమానం లోకి వచ్చి పడ్డా . దారం తెగిన గాలిపటంలా .
" ఏమీ లేదమ్మా ! మనసు కాస్సేపు రాజమండ్రి రోజులు గుర్తు చేసుకోడానికి అలా విహారానికి వెళ్ళింది " అన్నా .
"అవును అంకుల్ ! మళ్లీ మళ్లీ రాని రోజులు " అన్నారు పారిజాతం , షబ్నం ఒకేసారి .
ఈలోగా శేషమ్మ లోపలినించి పలాహారం తీసుకొని వచ్చింది . వేడి వేడి చల్ల పుణుకులు , జిలాబీ .
" మీరు మాత్రం జిలాబీ ముట్టుకోకండి " అంది శేషమ్మ పలహారం ప్లేట్లు టీపాయి మీద పెడుతూ . నన్ను ఉద్దేశించి .
" ఏం ! మాస్టారుకి షుగరా ! " అంది పారిజాతం .
"అవును తల్లీ ! ఈ మధ్యనే వచ్చింది నాకు షుగరు బీమారు . జిలేబీ అంటే నాకు ప్రాణం ." అన్నా .
"ఏమి చేస్తున్నారమ్మా ! మీరిద్దరూ ! అమ్మా , నాన్న అందరూ కులాసాయేనా ! ఎక్కడ ఉన్నారు వాళ్ళు ? " అని ప్రశ్నలు సంధించింది శేషమ్మ .
అప్పుడు వాళ్ళు చెప్తే ఈ విషయాలు తెలిశాయి . విశ్వనాధం కుటుంబం విశ్వనాధం ఉద్యోగంనుంచి రిటైర్ అయ్యాక రాజమండ్రి లోనే స్వంతంగా ఇల్లు నిర్మించుకొని సెటిల్ అయ్యారు . షౌకత్అలీ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా కోర్టు జడ్జీగా పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డాడు . అలీ భార్య నస్రీన్ ఇంటిపట్టున ఊరికే ఉండలేక బంజారా హిల్ల్స్ లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో షాపు అద్దెకు తీసుకొని బ్యూటీ పార్లర్ నడుపుతోంది. పారిజాతం , షబ్నం ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తీ చేశి గచ్చిబౌలి లో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నారు .
పారిజాతం ఆఫీసుకి దగ్గరగా ఉన్న సర్వీస్ అపార్ట్ మెంట్ లో ఉంటోంది షబ్నం తో కలిశి .
"ఏంటమ్మా ! అమ్మా , నాన్నా ఊర్లోనే ఉండగా బయట ఎందుకు ఉంటున్నావూ ! " అని అడిగింది శేషమ్మ టీ కలిపి తెస్తూ .
షబ్నం తేలికగా నవ్వేస్తూ "కాదు ఆంటీ ! ఆఫీసుకీ , మేము ఉండే చోటుకీ చాలా దూరం . ఈ ట్రాఫిక్ జాంలు , దూరాలతో ఆఫీసుకి సమయానికి చేరుకోలేక పోతున్నానని అబ్బాజాన్ ఆఫీసు దగ్గరగా పారిజాతం ఉండే చోట ఏర్పాటు చేశారు . వీక్ ఎండ్ రెండు రోజులూ అబ్బా ,అమ్మీ జాన్ తో ఉంటాను " అంది.
" నేను కూడా వీక్ ఎండ్స్ , పండగలు వచ్చినప్పుడు తప్పకుండా రాజమండ్రీ వెళ్లి అమ్మా , నాన్నని చూశి వస్తాను మేస్టారూ ! " అంది పారిజాతం .
" బావుంది . నువ్వు చిన్నతనంలో చదరంగం ,కరాటే నేర్చుకోనేదానివి కదూ! " అని అడిగిగింది శేషమ్మ పారిజాతాన్ని .
ఇంటర్ తర్వాత ఒక స్థాయికి వచ్చాక ఈ విద్యలు కొనసాగించడం కుదరలేదు అంది పారిజాతం . ఇక శెలవు తీసుకుంటాము అన్నట్లుగా లేచి నిలబడ్డారు పిల్లలు . శెలవు తీసుకొనే ముందు షౌకత్అలీ అడ్రస్ , ఫోను నెంబర్ వ్రాసి ఇచ్చింది షబ్నం . పారిజాతం కూడా విశ్వనాధం అడ్రస్ , ఫోన్ నెంబర్ వ్రాసింది నా డైరీ లో .
"తరచూ కనిపిస్తూ ఉండడమ్మా !" అంది శేషమ్మ .
"అలాగే ! వెళ్లి వస్తాం " అని ఆటో ఎక్కారు .
"ఇద్దరికి ఇద్దరూ విద్యుత్ లతల్లాగా ఉన్నారు " అంది శేషమ్మ వాళ్ళని ఆటో ఎక్కించి ఇంటిలోనికి వస్తూ .
" మరే ! నా శిష్యురాళ్ళు మరి " అన్నా కాస్త గర్వంగా.
...
ఓ రెండు రోజులు గడిచాక షౌకత్అలీ కి ఫోను చేస్తే నస్రీన్ రిసీవ్ చేసుకుంది . "నేనమ్మా ! నస్రీన్ . జగన్నాధం ." అన్నా .
"ఓహ్ ! బహుత్ దిన్ బీత్ గయే ! ఆప్ సే మిల్కర్ . కైసే హై . టహరియే మై అలీ సాబ్ కో ఫోన్ దిలాతా హూన్ " అంది నస్రీన్ .
"ఎలా ఉన్నావ్ షౌకత్ " అని ఫోనులో పలకరించాను . "ఫస్ట్ క్లాసు .నీ సంగతి చెప్పు .'అన్నాడు షౌకత్ .
షబ్నం వచ్చిన సంగతి చెప్పాను.
" బేటీ నే బతాయా ముఝె ములాకాత్ కి బారేమే "
చాన్నాళ్ళకి షౌకత్అలీ తో మాట్లాడినందుకు ఎంతో సంతోషం వేసింది .
ఒకసారి కలుద్దాం షౌకత్ అని అంటే తప్పకుండా అన్నాడు .
...
రాజమండ్రి . సాయి నగర్ . ఉదయం ఆరు గంటలు .
అప్పుడే నిద్ర లేచి కాఫీ తాగుతూ తోటంతా కలియ తిరుగున్నాడు విశ్వనాధం. క్రితం రాత్రి పెట్టిన మందుకి కష్టపడి పెంచుతున్న పూల తోట నిండా బొర్రెలు పెట్టేస్తున్న పంది కొక్కులు ఏమైనా బలిఅయ్యాయా అని . గేటు బయట పారిజాతం మొక్క విరగ పూసిన పూలతో సన్నగా వీస్తున్న గాలికి అందంగా ఊగుతోంది .
ఇంతలో " మీకే ! ఫోను " అంటూ రిమోట్ తెచ్చి ఇచ్చింది విశ్వనాధం భార్య రత్నం .
ఎవరా ! అని ఫోను అందుకొన్నాడు విశ్వనాధం.

( ఇంకా ఉంది )
No comments:
Post a Comment