నేల రాలిన పారిజాతం .
కధానిక . (04)
గత వారం : నస్రీన్ బ్యూటీ పార్లర్ కి ఫేసిఅల్ కోసం వచ్చిన పారిజాతం పని ముగించుకొని బయటకి వస్తూ ఉండగా పడవ లాంటి కారుని పార్కింగ్ చేశి దిగుతున్న గెరటబాబు కంట పడుతుంది . ఇదేమీ గమనించని పారిజాతం స్నేహితురాలు షబ్నం తో కలిశి ఆటో ఎక్కి వెళుతుంది . ఒక ఆదివారం షబ్నం జగన్నాధం ఇంటికి వస్తుంది . గత వారం తరువాయి . ఇక చదవండి ...
షబ్నం మౌనం నన్ను కొంత కంగారు పెట్టిన మాట నిజమే .
అప్పుడే వంటిట్లో పనులు చక్కపెట్టుకొని ఫెళ ఫెళ లాడుతున్న గంజి పెట్టిన వంగపండు రంగు ఇస్త్రీ చీర కట్టుకొని వచ్చిన శేషమ్మ 'ఏమమ్మా ! అంతా బావున్నారా 'అంటూ షబ్నంని పలకరించింది .
'బావున్నాం ఆంటీ 'బదులుఇచ్చింది షబ్నం .
'పారిజాతం రాలేదా నీతో ' శేషమ్మ అడిగింది .
'లేదు ఆంటీ ' ముక్తసరిగా జవాబిచ్చింది షబ్నం .
'నువ్వు, అంకుల్ మాట్లాడుకుంటూ ఉండండి . నేను ఈ లోగా పేరంటానికి వెళ్లి ఇట్టే వచ్చేస్తా ' అని శేషమ్మ దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి పేరంటానికి వెళ్ళింది .
'ఏంటి తల్లీ ! ఏమైనా సమస్యా ?వచ్చిన దగ్గరనించి అదోలా ఉన్నావ్ ! ' అన్నా షబ్నంతో .
'మీకు ఓ సంగతి చెప్పాలి అంకుల్ . ఎలా మొదలెట్టాలో తెలియటంలేదు'
'సున్నితమైన సమస్యా ! పారిజాతం గురించా ' అన్నా.
అవును అన్నట్లు తన విశాలమైన కళ్ళతో చెప్పింది షబ్నం .సమస్య గంభీరమైనదే అనిపించింది నాకు షబ్నం తీరు గమనించాక .
'చెప్పమ్మా 'అన్నాను .
షబ్నం చెప్పిన వివరాలు విన్న తర్వాత నా మెదడు కొంతసేపు మొద్దుబారిపోయింది .
...
షబ్నం చెప్పిన వివరాలు విన్న తర్వాత నా మెదడు కొంతసేపు మొద్దుబారిపోయింది .
...
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాలం (Internet ) ఉపయోగించే దేశాలలో మనం చాలా ముందు ఉన్నాం అని స్టాటిస్స్టిక్స్ . అందులో సోషల్ నెట్వర్క్(Network) సైట్లలో(Site) మన యువత శాతం నమోదు చాలా ఎక్కువ . దాదాపు ఎనభై శాతం యువత రోజులో ఎక్కువ సమయం నెట్ లో ఈ సైట్లు చూస్తూ కాలం గడుపుతూ ఉన్నారని ఒక అంచనా . ఇందులో పెద్దలూ , యువత ,పిల్లలూ ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఫేసుబుక్ లో ఫోటోలు ,వ్యాఖ్యలు ,వ్యాసాలు పోస్ట్ చేసి వాటికి హితులు , సన్నిహితులు ,స్నేహితుల స్పందన ,లైకు లు చూసి పొందే ఆనందం వేరు . పారిజాతానికి ఫేసుబుక్ లో ఎకౌంటు ఉంది .
...
పర్వతాలు నస్రీన్ బ్యూటీపార్లర్ లో రిసెప్షన్ డెస్క్ అసిస్టెంట్ . మెయిన్ రిసెప్షనిస్ట్ జాస్మిన్ సెలవు పెట్టినప్పుడో లేక మేడం ఆమెను పిలిచినప్పుడో డెస్క్ పని చూసుకొనే భాద్యత పర్వతాలు ది .
పర్వతాలు పేరుకే పర్వతాలు గాని సన్నగా రివటలా ఉంటాడు .డేగ కళ్ళు . ముప్పై అయిదు ఏళ్ళు ఈ మధ్యనే నిండాయి .చదువు అంతంత మాత్రమే. పర్వతాలుకి ఓ బలహీనత ఉంది . అది మందు . ఎవరైనా ఇంత మందు పోయిస్తే పీకల దాకా తాగేసి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా దగ్గరనుండి చివరికి బ్యూటీ పార్లర్ కి రోజూ వచ్చే అమ్మాయిల వరకు అనర్గళంగా వాగేస్తాడు . మత్తు దిగేక ఏమీ గుర్తుండదు పర్వతాలుకి . ఒకసారి మందు నిషాలో పర్వతాలు పారిజాతం పట్ల అసభ్యంగా ప్రవర్తించబోతే విషయం నస్రీన్ కి తెలిసి కాస్త గట్టిగానే మందలించింది . అప్పటినుంచి పర్వతాలు గుర్రు గా ఉన్నాడు పారిజాతం మీద .
...
బ్యూటీ పార్లర్ నుండి వస్తూ ఉన్న పారిజాతాన్ని చూసిన గెరటబాబు బుర్ర పాదరసంలా పనిచేసింది . పర్వతాలు మెదిలాడు అతని మదిలో . లంచ్ టైం లో పర్వతాలుని ఆఫీసులోని తన గదికి పిలిపించాడు గెరటబాబు . గదిలో మందు సరంజామా చూసిన పర్వతాలు కళ్ళు మెరిసాయి . మూడు పెగ్గుల మందు పడిన తర్వాత మాటలమీదా, శరీరం మీదా నియంత్రణ కోల్పోయాడు పర్వతాలు . ఏదేదో మాట్లాడుతున్నాడు అడ్డూ అదుపూ లేకుండా . నిషా లో ఉన్న పర్వతాలు వద్ద నుండి పారిజాతం సమాచారం పూర్తిగా సేకరించాడు గెరటబాబు. ఫేసుబుక్ లో నమోదు అయి వయసులో ఉన్న అమ్మాయిలని ఆకర్షించేలా తన ప్రొఫైల్ పెట్టుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు గెరటబాబు పారిజాతానికి . మొదట్లో రిక్వెస్ట్ కి స్పందించలేదు పారిజాతం . అదే పనిగా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్లు రావటంతో గెరటబాబు ప్రొఫైల్ చూసి ఆకర్షితురాలు అయి ఫ్రెండ్ అయ్యింది పారిజాతం ఫేసుబుక్ లో . అలా మొదలైన పరిచయం చాలా సన్నిహితంగా కలిసి మెలిసి తిరిగే స్థాయి కి చేరుకుంది అతి కొద్ది రోజులలోనే . అలాగని పారిజాతం హద్దులు ఏనాడూ దాటలేదు .
...
నెక్లెస్ రోడ్ . ఐమాక్స్ థియేటర్ .
గెరటబాబు పారిజాతం కోసం గంట ముందు నుంచి నిరీక్షిస్తున్నాడు . ఆ రోజు సినిమా ప్రోగ్రాం ప్లాన్ చేశాడు గెరటబాబు . అలాగే !అంది పారిజాతం . కాస్సేపటికి గెరటబాబు నిరీక్షణ ఫలించింది . తొందరగా అడుగులు వేస్తూ వస్తున్న పారిజాతం కనిపించింది . ఇద్దరూ థియేటర్ లోకి ప్రవేశించేసరికి సినిమా మొదలయ్యింది . విరామం తర్వాత సినిమా ప్రారంభమయ్యాక కొద్ది నిమిషాలకి చనువుగా ప్రవర్తించబోయాడు గెరటబాబు పారిజాతంతో . గెరటబాబు చేతులు ఆమె శరీరాన్ని ఎక్కడెక్కడో తాకుతున్నాయి . శరీరం మీద తేళ్ళూ ,జెర్రిలూ పాకుతున్నట్లు అనిపించింది పారిజాతానికి . విసురుగా అతని చేతులని విదల్చి సర్రున లేచి థియేటర్ వెలుపలికి వచ్చేసింది . గెరటబాబు ఇది ఊహించలేదు . అతని అహం దెబ్బతింది పారిజాతం చర్యకి . అయితే అది బయటకు కనిపించనీయకుండా పారిజాతాన్ని అనుసరించాడు గెరటబాబు . ఎన్ని క్షమాపణలు చెప్పినా పారిజాతం వినిపించుకోలేదు . ఆటో ఎక్కి రివ్వున వెళిపోయింది గెరటబాబుని గొంగళిపురుగు ని చూసినట్లు జుగుప్సగా చూస్తూ .

ఈ సంఘటన జరిగాక పారిజాతాన్ని కలుసుకోవటానికి గెరటబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . పారిజాతంకి ఫొన్ చేస్తే పలకటం లేదు .
...
విశ్వనాధం ఫోనుచేసి' తీరుబడిలేక నిన్ను ఈ మధ్యన కలవడం పడలేదు అని పారిజాతం చెప్పింది' అన్నాడు .
'అది సరే గాని పుష్కరాల సమయంలో మన సమావేశ సందర్భంగా అవిడి నుండి పాలకోవాలు ,ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజాలు పురమాయించాను . నువ్వూ ,షౌకత్అలీ తప్పకుండా రావాలి . నిరాశ పరచకు . ' అన్నాడు విశ్వనాధం చివరగా ఫోను సంభాషణ ముగిస్తూ .
నా ఆలోచనలు పారిజాతం చుట్టూ ముసురుకున్నాయి .
శేషమ్మ వచ్చి 'చాలా రాత్రి అయింది . నిద్రపోరా ఏమిటి ?'అని లైటు స్విచ్ ఆఫ్ చేసింది .