శ్రీ వేంకటాచల వైభవం .
పంచమ భాగం-05.
జరిగిన కధ :మాఘమాసంలో వంటిమామిడి అగ్రహారంలో జరిగే శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వరస్వామి వారల కళ్యాణ ఉత్సవాలకి వచ్చిన బంధుమిత్రులకు ,వంశ కూటస్థులు యర్రమిల్లి వేంకటాచలం గారి గురించీ ,మరియు శివాలయ చరిత్ర గురించీ చెప్పటం ప్రారంభిస్తాడు చంద్రుడి గారి అబ్బాయి . పాశర్లపూడి లంకలో తమకు ఉన్న వ్యవసాయ భూమి సర్కారు వారు సేకరించడంతో ,పరిహారం క్రింద వచ్చిన సొమ్ముతో కాశీ యాత్రకని బయలుదేరుతారు వేంకటాచలం దంపతులు . దారిలో పిఠాపురం సంస్థానంలోని సముద్రతీర గ్రామంలో మజిలీ చేస్తారు . మహారాజా వారి విజ్ఞప్తి మేరకు వారి దివాణంలో తలపెట్టిన వేదసభకు ముఖ్య అతిథిగా ఆహ్వానం స్వీకరిస్తారు వేంకటాచలం గారు . ..... ఇక చదవండి .
వేదసభ ముందు రోజు సాయంకాలం వేంకటాచలం గారిని పిఠాపురం తీసుకొని వచ్చి బస ఏర్పాటు చేసారు దివాను గారు . మర్నాడు ఉదయమే వచ్చి తీసుకొని వెళ్తానని వేంకటాచలం గారి నుండి శెలవు తీసుకొని వెళ్ళిన దివాను గారికి ఆ రాత్రి నిద్ర కరువైంది . వేద పండితులు వేంకటాచలం గారు బస లో ఏమైనా అసౌకర్యానికి గురి అయ్యారేమో అన్న ఆందోళనతో ఉదయాన్నే చీకటి తెరలు తొలగిపోగానే బసకి బయలుదేరి వెళ్ళారు దివాను గారు . బస సింహద్వారం దగ్గరగా వేసి ఉంది . లోపలి గది తలుపులు తెరిచి ఉన్నాయి . ఆ గది తర్వాత ఉన్న మండువా తలుపులు తెరిచి ఉన్నాయి . మండువా తర్వాత గది తలుపులు జార్లా వేసి ఉన్నాయి . జార్లా వేసి ఉన్న తలుపులు తెరిచి లోపలికి వెళ్ళారు దివాను గారు . నుయ్యి(బావి) కనిపించింది . ముందుకు వెళ్ళిన దివాను గారికి అక్కడ అద్భుత దృశ్యం కనిపించింది . వేంకటాచలం గారు పద్మాసనంలో ఆసీనులయి ఉన్నారు . ఆయన కంచు కంఠం నుండి స్వరంతో లయబద్ధంగా వేదమంత్రాలు జాలు వారుతున్నాయి . నూతి లోని గంగ పైకి ఎగజిమ్మి వేంకటాచలం గారి శిరుస్సు మీద పడుతోంది . వేంకటాచలం గారు ఆగకుండా వేదమంత్రాలు చదువుతున్నారు . గంగ వెంకటాచలం గారికి జలాభిషేకం చేస్తోంది . ఇది చూశిన దివాను గారు భయపడిపోయారు . కలా ! నిజమా! అని కళ్ళు నులుముకొని చూశారు . అదే దృశ్యం . ఈయన సామాన్యుడు కాదు , దైవాంశ సంభూతుడు . మహారాజా వారికి ఈ విషయం చెప్పాలి అని దివాణం కేసి పరుగు తీశారు దివాను . దివాను వారి ద్వారా విషయం తెలుసుకొన్న రాజా వారు ఈ వింత తను కూడా చూడాలన్న కుతూహలంతో ఉన్న పళంగా బయలుదేరారు . రాజా వారు కాలినడకన రాచవీధిలో వెళ్ళటం చూసిన ప్రజలు "ఏదో విశేషమైనదే " అని రాజా వారి వెంట వెళ్ళారు . రాజా వారు బస చేరేసరికి స్నానం ముగించి తుండుతో శరీరం తుడుచుకుంటున్న వేంకటాచలం గారు కనిపించారు . అద్భుతం చూసే భాగ్యం రాజా వారికి కలగలేదు .
...
వేదసభ ప్రారంభం అయింది . ఘనాపాఠీలు , వేద పండితులూ , ఇతర ప్రాంతాలనుండి వచ్చిన ఆహ్వానితులతో సభ కిక్కిరిసిపోయింది . వేంకటాచలం గారి ఆధ్వర్యంలో ఆ నాటి సభ వైభోవపేతంగా జరిగింది . సభలో పాల్గొన్న పండితులందరూ వెంకటాచలం గారి వేద పరిజ్ఞానానికి అచ్చెరువు పొంది ముగ్ధులయ్యారు . రాజ సత్కారాలు ముగిసాయి . వేంకటాచలం గారు సభికులు అందరికీ నమస్కరించి మంగళశాసనములు చేశారు . ఇక శెలవు అన్నట్లుగా మహారాజా వారి కేశి చూశారు . రాజా వారు వేంకటాచలం గారిని ఉద్దేశించి "తమరి లాటి వేదమూర్తులు మా ప్రాంతంలో ఉంటే అంతకన్నా భాగ్యం లేదు మాకు . మా సంస్థానంలో మీకు నచ్చిన చోట శాశ్విత నివాసం ఏర్పాటు చేస్తాము . కాదనకండి . మీ విద్య అందరికీ నేర్పండి . వేదాల్ని ప్రాచుర్యం చేయండి . ఇది మా అందరి ప్రార్థన . మన్నించండి ." అన్నారు . ఆ తర్వాత రాజా వారు వేంకటాచలం గారిని స్వయంగా పల్లకీ లో మజిలీ చేశిన ప్రదేశానికి తీసుకు రావటం జరిగింది . రాజా వారు ముందుగా పల్లకీ దిగి గౌరవ మర్యాదలతో వేంకటాచలం గారిని దింపి మామిడిచెట్టు వద్దకు తీసుకొని వచ్చారు . అలా తీసుకొని వచ్చిన వేంకటాచలం గారిని తూర్పు అభిముఖంగా నిలబడి చూడమని "పంతులుగారూ! మీకు ఎంత వరకూ కనిపిస్తోంది " అన్నారు రాజా వారు . ఫలానా వరకూ కన్పిస్తోంది అన్నారు వేంకటాచలం . రాజా వారి చర్య ఏమిటో తెలియక . ఈ ప్రక్రియ తతిమ్మా దిక్కుల వైపు కూడా జరిగిన తర్వాత యిలా ప్రకటించారు రాజా వారు .
"ఈ నాలుగు దిక్కులా మీకు కన్పించిన భూమి ,పుట్రా ఈ క్షణం నుండీ మీకు ఈనాం మరియు జిరాయితీగా పూర్తి హక్కులతో అనుభవించే అధికారం కలుగ చేస్తున్నాము . దివాను గారు పట్టాలు తయారు చేశి మీకు అందిస్తారు . ఇక నుంచి మీరు మా ప్రాంతవాసి . వేదం నేర్పండి . వేదాన్ని ప్రచారం చేయండి . " వేంకటాచలం గారు ఊహించని మలుపు ఇది .
"మరి నా కాశీ ప్రయాణం " అన్నారు వేంకటాచలం .
"పల్లకీ లో నే పంపిస్తాగా " అన్నారు రాజా వారు శెలవు తీసుకుంటూ .
...
వెంకటాచలం గారు మజిలీ చేశిన ప్రాంతమే వంటిమామిడి . పాసర్లపూడి లంకలో కొద్దిపాటిగా ఉన్న భూమిని కోల్పోయిన వేంకటాచలం గారు వేల ఎకరాల భూస్వామి అయిపోయారు ఆకస్మాత్ గా .
"అంతా ఈశ్వరేచ్చ " అనుకున్నారు వేంకటాచల దంపతులు .
...
ఆలా వంటిమామిడిలో స్థిరపడిన వేంకటాచలం గారు వంటిమామిడి యర్రమిల్లి వంశ మూల పురుషులు . వేల ఎకరాల భూస్వామి . కుటీరం లాంటి విశాలమైన నివాసం నిర్మించుకొని , గృహ ధర్మమును పాటిస్తూ , నిత్య అగ్నిహోత్రం నిష్ఠగా ఆచరిస్తూ , పంచాయతనం పాటిస్తూ జీవనం సాగిస్తున్న కాలం అది .
...
"పంచాయతనం అంటే ఏమిటి ? తాతగారూ ! " అని అడిగాడు విప్పగుంట పద్మావతి కొడుకు సాయి విష్ణు చంద్రుడుగారి అబ్బాయిని .
"పంచాయతనం అంటే భగవంతుని ఆరాధించేందుకు గృహస్తు పాటించే అయిదుగురు దేవతలకు అర్చన . సంధ్యావందనం ,దేవతార్చన ,పితృ తర్పణం ,బ్రహ్మయజ్ఞం మరియు హోమం వీటిని పంచాయతనం అంటారు . ఈ విధానంలో సూర్యుడు ,పార్వతీదేవి ,విష్ణువు ,విఘ్నేశ్వరుడు ,మహేశ్వరుడు అను దేవతలను అర్చన చేస్తారు . పూర్వకాలంలో బ్రాహ్మణుల గృహాలలో యజమాని ఈ రీతిగా నిత్య దేవతార్చన చేసే సంప్రదాయం ఉండేది" అని సందేహ నివృత్తి చేశాడు చంద్రుడు గారి అబ్బాయి .
...
యర్రమిల్లి వారి ఆరాధ్య దైవం పరమశివుడు . ఇలవేల్పు శ్రీ రాజరాజేశ్వరీ దేవి .
అభిమాన దైవం శ్రీ రామచంద్రుడు .
నిష్ఠ గా ఆదిత్యం ,అంబికం ,విష్ణుం ,గణనాధం ,మహేశ్వరం అను న్యాయమున పంచాయతనం , దేవతార్చన చేస్తూ కాలం గడుపుతున్న వేంకటాచలం గారికి ఒకనాడు నిద్రలో ఆందోళనకు గురి చేసే కల వచ్చింది .
మూడవ ఝాము రాత్రి . స్వప్నంలో వేంకటాచలం గారికి పరమశివుడు దర్శనం ఇచ్చి నేను ఇక్కడే స్వయంభుగా వెలిసి ఉన్నాను అని అనిపించింది . నిద్ర చెదిరిపోయింది . శరీరమంతా చెమటలు పట్టేశాయి . వంటిమీద ఉన్న ఉత్తరీయం,ధోవతి తడిసి ముద్ద అయిపోయాయి . మనసంతా అలజడి . ఆ అలజడికి మరి నిద్ర రాలేదు . ప్రక్కనే నెల మీద చాప పరచుకొని తలక్రింద చేయి పెట్టుకొని భార్య అమాయకంగా నిద్రిస్తోంది . మనసులోని అలజడి తట్టుకోవడం వేంకటాచలం గారికి సాధ్యం కాలేదు . లేచి నూతి దగ్గర స్నానం చేసి వచ్చి దర్భాసనం వేసుకొని శివస్త్రోత్రం వల్లె వేసుకున్నారు . ఈ సందడికి భార్య లేచింది . వెంకటాచలం గారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఆందోళన , అలజడి గ్రహించింది . " ఏమి జరింగింది? " అని అడిగింది భర్తని . స్త్రోత్రం ముగించాక విషయం చెప్పారు వెంకటాచలం గారు . "భగవంతుని లీలలు ఎవరికీ అర్థం కావు " అంది భార్య వేంకటాచలం గారితో . " నిస్సందేహంగా " అన్నారు వేంకటాచలం . ప్రతిరోజూ వేంకటాచలం గారికి అటువంటి కలలు వస్తూనే ఉన్నాయి . ఒకనాడు నిద్రలో " ఎక్కడని వెతకను స్వామీ మీ ఉనికిని " అని ప్రశ్నించారు వేంకటాచలం శంకరుని . ఇక్కడకు ఆమడ దూరంలో సముద్రతీరానికి దగ్గరలో తూర్పు అభిముఖంగా ఉన్నాను . అతి ఎత్తయిన ఇసుక మేటలు బ్రహ్మజెముడు పొదల క్రింద ఉన్నాను అన్న సూచన లభించింది వెంకటాచలం గారికి శంకరుని వద్దనుండి .
ఉదయాన్నే దేవతార్చన ముగించుకొని స్వామి అన్వేషణకై బయలు దేరారు వేంకటాచలం గారు. తూర్పుగా కొంత దూరం వెళ్ళగా కలలో స్వామి సూచించిన ప్రదేశం కనపడింది . చుట్టూ పరికించి చూశారు వేంకటాచలం. పశువుల కాపరులు గొర్రెలు , మేకలు మేపుకుంటున్నారు . వేంకటాచలం గారిని చూశి "దండాలు దివాణం . ఎందుకు ఇలా వచ్చారు దివాణం " అన్నారు . వేంకటాచలం గారు విషయం చెప్పగా "అవును బాబయ్యా ! ఈ ప్రదేశంలో ఏదో విశేషం ఉంది. గొర్రెలు ,మేకలు ,పశువులు ఇక్కడికి రాగానే మేత మేయక నిలిచి పోతాయి . ఆకాశం వేపు చూస్తాయి . ఇక్కడకు వచ్చేసరికి మాకు కూడా వింత అనుభూతి కలుగుతుంది . నేల నుండి వింత శబ్దాలు వస్తాయి దివాణం " అన్నారు పశువుల కాపరులు . అది విన్న వేంకటాచలం గారు పరమశివుడు సూచించిన ప్రదేశం ఇదే అన్న నిర్ధారణకు వచ్చి ప్రజల సాయంతో బ్రహ్మజెముడు , ఇసక మేటలు తవ్వించటం ప్రారంభించారు . నాలుగు రోజులు తవ్విన మీదట చిన్న పాడుపడిన గుడి కనిపించింది . గుడి లోపల అద్భతమైన శివలింగం దర్సనమిచ్చింది . వేంకటాచలం గారి కళ్ళు వర్షించాయి శివలింగం చూడగానే . ఆ కంటి తడిలో త్రినేత్రుడు ఇంకా మనోహరంగా కనిపించాడు . వేంకటాచలం గారి ఆనందోత్సాహాలకి అంతు పట్ట లేదు . ఆయనే శ్రీ విశ్వేశ్వర స్వామి వారు .
ఇది జరిగిన కొద్ది రోజులకి వేంకటాచలం గారికి ఇంకొక స్వప్న సూచన జరిగింది . సముద్రగర్భం నుండి అమ్మవారి శిలావిగ్రహం ,ధ్వజస్తంభము ఒడ్డుకు చేరుతాయని . ఆ విధంగానే అమ్మవారి ఏకశిలావిగ్రహం ,ఏకాదారు ధ్వజస్థంభము ఒడ్డుకు చేరుకున్నాయి . ఈశ్వర ప్రాసాదితమైన వాటిని బండి మీద జోడు ఎడ్లతో లాగించి గుడి ప్రాంగణం చేర్చారు వేంకటాచలం . తర్వాత ఆ మూర్తులను ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ట చేశారు . గుడి బాగా చిన్నది అగుటచే గర్భగుడిలో స్వామి వారి ప్రక్కనే అమ్మవారిని ప్రతిష్టించటం జరిగింది . పద్మపీఠం మీద నిలుచొని ఉన్న భంగిమలో అమ్మవారు . యర్రమిల్లి వారి ఇలవేల్పు . శ్రీ రాజరాజేశ్వరీ దేవి . ఆ సమయంలోనే ఆలయ జీర్ణోద్ధరణ జరిగింది. ఆలయంలో నిత్య ధూప ,నైవేద్య సేవలు ప్రారంభించబడ్డాయి వేంకటాచలం గారి ఆధ్వర్యంలో . ఇది జరిగినది 1854 వ సంవత్సరంలో .
(ఇంకా ఉంది . తరువాయి షష్టమ భాగం లో చదవండి . )

3 comments:
The simplicity of language and the lucidity make this beautiful story even more fascinating.
Super story ... Ur great grand father is very lucky ....
Thank you.
Read the remaining parts as well. The story unfolds further to your surprise.
Om Namah Sivaah.
Post a Comment