Courtesy: Google Images Wikipidia
కంచి కి చేరిన కధ .
****************
రాత్రి పిల్లలకి భోజనం పెట్టి వాళ్ళని నిద్రపుచ్చటం తల్లికి ఓ ప్రయాస. ఎంత బుజ్జగించినా ఓ పట్టాన నిద్రపోరు. పగలంతా చేసిన అల్లరి మారాము చేస్తుంది. ఉదయాన్నే లేచి రాత్రివరకూ ఇంటి పనుల్లో ఊపిరాడనంత పని చేసి అలసిపోయిన శరీరానికి విశ్రాంతి కోరుకుంటుంది ఇల్లాలు. పిల్లల్ని నిద్రపుచ్చితే దినం గడిచినట్లే . ఆకాశంలో చంద్రుడిని చూపిస్తూ ' చందమామ రావే ! జాబిల్లి రావే ! ' అని జో కొడుతోంది తల్లి . ఊహు .. అయినా నిద్రపోరు పిడుగులు . ' కధ చెప్పవే ! అని తల్లిని బతిమాలుతారు . అప్పుడు చెబుతుంది తల్లి ఓ కధ . శ్రీ రామాయణంలోని కధలో...... లేక చందమామ కధలో తనకు తోచినవి. కధ మొదలెట్టగానే ఆసక్తి గా వింటారు. తల్లి కధ చెప్పటం ముగించి చివరికి ' కధ కంచి కి మనం ఇంటికి ' అని చూస్తే అప్పటికే సగం నిద్రలోకి జారుకుంటారు అమాయకంగా . సాధారణంగా ప్రతి ఇంట్లోనూ అను నిత్యం జరిగే చర్య .
ఇక్కడో మాట చెప్పాలి .
కధలు కంచికి వెళ్లవు . అమ్మవారి అనుగ్రహం కలిగిన భక్తులు కంచి కి దర్శనానికి వెళతారు .
ఇదీ ఉపోద్ఘాతం .
ఆ తర్వాత ?
తెలుసు కోవాలంటే చాలానే ఉంది .
చదవండి .
**************
విశాఖపట్టణం. డాబాగార్డెన్స్ . సారపాక వారి ఇంట్లో బారసాల సందడి .
సరిగ్గా బ్రహ్మ గారు నిర్ణయించిన ముహూర్తానికి కార్యక్రమం మొదలయ్యింది . దంపతులచే పసుపు వినాయకునికి పూజ నిర్వహించి సంకల్పం చేయించారు బ్రహ్మ గారు . ఆ తర్వాత పసిపాప నామకరణ కార్యక్రమం మొదలయింది . వేద మంత్రాలు బ్రహ్మ గారి నోటి నుండి అనర్గళంగా జాలు వారుతున్నాయి . పీటలమీద తల్లి ఒడిలో పొత్తిళ్ళలో పసిగుడ్డు కళ్ళు విప్పి విశాలంగా చూస్తోంది . పాప చెవులు నిక్కపొడుచుకున్నాయి . వేద మంత్రాలు ధ్వని తరంగాలుగా పసిపాప కర్ణ రంద్రాలనుండి శరీరంలో ప్రవేశిస్తున్నాయి . ఆ ప్రదేశమంతటా ఒక రకమైన అద్భుత వాతావరణం ఆవరించి ఉంది .
వేదం ఈ దేశ సంపద . మన జాతి ఔన్నత్యం . ఈ దేశం లోని ప్రతి పౌరుడూ గర్వపడవలసిన విషయం. లోకంలో అతి ప్రాచీనమైన గ్రంధాలు వేదాలే . ఇవి ఎవరి చేత ఆవిష్కరించబడినవో ఎవరికీ తెలియదు . అపౌరుషేయాలు. ఇవి కొన్ని వేల సంవత్సారాల మునపటివి. కానీ అవి నేటికీ నిత్య నూతనమై ఉన్నాయి . వేద ఋషులు ఈ యావత్తు లోకాన్నీ " ఏకం సత్ విప్రా బహుధా వదన్తి " అని అభివ్యక్తీకరించారు. ఉన్నది ఒకటే బ్రహ్మ పదార్ధం . వేద శ్లోకాలన్నీ మంత్రాలుగానే పరిగణించబడుతున్నాయి . "మననాథ్ తాయతే ఇతి మంత్ర : " సృష్టి ఏ నాడు మొదలయ్యిందో ఆనాటి నుండి వేదం ఉంది . అందుకే వేదం సనాతనం . పరమశివుని తాండవ లయ నుండి వేదం ఆవిర్భవించినదని పెద్దలు చెబుతారు. శృతి , స్వరం, మంత్రం ఒక అపూర్వ కలయిక. ఈ అపౌరుషేయాల సంపదని అప్పటి ఋషులు ఒక్క అక్షరమూ పొల్లుపోకుండా ప్రవచించే మార్గాన్ని కనిపెట్టి తరతరాలుగా కాపాడి భావి తరాలకి అందించారు . కేవలం నోటి ద్వారా వేల సంవత్సరాలు నిలుపుకున్న సంపద.
ఆ కేకకి పాప తల్లి తల్లడిల్లి పోయింది . గుండెలు అవిసిపోయాయి. ఒడిలో పొత్తిళ్ళలో నున్న పాప గుక్క పట్టి ఏడుస్తోంది. కారణం నిస్సత్తువ.బారసాల తంతుకి అలసిన చిన్ని ప్రాణానికి ఆకలి వేసింది . పాల సీసాలో పాలు పోసి పీక నోటికి అందిస్తే శాంతించింది . కడుపు నిండాక బోసి నోటితో గల గలా నవ్వింది . తల్లి మొహంలో సంతోషం వెల్లి విరిసింది .
బ్రహ్మగారు వ్రత కార్యక్రమం ప్రారంభించారు. మంత్రోచ్ఛారణ జరుగుతోంది .
అప్పుడు జరిగింది ఇంకొక సంఘటన . మళ్ళీ కెవ్వు మన్న కేక. ఈసారి కెవ్వు కేక పసిబిడ్డ నోటి నుండి కాదు . మరెవరు ? దివాను బెడ్ మీద కూర్చున్న గౌరీపద్మ నుండి వెలువడింది . గౌరీపద్మ అలా కేక వేయడానికి ఓ బలమైన కారణం ఉంది . అప్పుడే వచ్చిన అతిధి గౌరీపద్మ పక్కన జాగా ఉంటే కూర్చోబోయాడు . అప్పుడు గౌరీపద్మ తన అరవై ఐదు సంవత్సరాల వయసును పక్కన పడేసి చంటిపిల్లలా కెవ్వుమంది అసంకల్పితంగా. సరిగ్గా అతిధి కూర్చోబోతున్న స్థలంలో గౌరీపద్మ ప్రాణప్రదంగా భావించే అరచేయి వెడల్పూ, జానెడు పొడవూ ఉన్న అధునాతనమైన స్మార్ట్ ఫోన్ ఉంది . అందులో ఆమె సందేశాలూ, బంధు మిత్రుల ఫొటోలూ , అరుదైన జ్ఞాపకాలూ , మనసు పడి ఇష్టంగా రికార్డు చేయించుకున్న స్తోత్రాలూ, శ్లోకాలూ , అష్ఠకాలూ , ఫోన్ నెంబర్లూ ఇంకా ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి . గౌరీపద్మ కేకకి ఇవేవీ కారణంకాదు . ముఖ్య కారణం సెల్ ఫోను స్క్రీన్ మీద తమ ఇంటి ఇలవేల్పు ఏడుకొండలవాడి ఫోటో పెట్టుకుంది . దాని మీద కూర్చుంటే అపచారం జరిగి పోతుందేమోనన్న భయం ఆమెలో ప్రవేశించి అలా ప్రవర్తింపచేసింది . గౌరీపద్మ కేకకి హడిలిపోయిన అతిధి అలా నిలబడి బిత్తర చూపులు చూసాడు . ప్రమాదం తప్పిందని గౌరీపద్మ తన సెల్ ఫోను జాగ్రత్తగా ఒడిలో పదిలపరచుకొని ఊపిరి పీల్చుకుంది .
సరిగ్గా బ్రహ్మ గారు నిర్ణయించిన ముహూర్తానికి కార్యక్రమం మొదలయ్యింది . దంపతులచే పసుపు వినాయకునికి పూజ నిర్వహించి సంకల్పం చేయించారు బ్రహ్మ గారు . ఆ తర్వాత పసిపాప నామకరణ కార్యక్రమం మొదలయింది . వేద మంత్రాలు బ్రహ్మ గారి నోటి నుండి అనర్గళంగా జాలు వారుతున్నాయి . పీటలమీద తల్లి ఒడిలో పొత్తిళ్ళలో పసిగుడ్డు కళ్ళు విప్పి విశాలంగా చూస్తోంది . పాప చెవులు నిక్కపొడుచుకున్నాయి . వేద మంత్రాలు ధ్వని తరంగాలుగా పసిపాప కర్ణ రంద్రాలనుండి శరీరంలో ప్రవేశిస్తున్నాయి . ఆ ప్రదేశమంతటా ఒక రకమైన అద్భుత వాతావరణం ఆవరించి ఉంది .
...
...
ఇత్తడి పళ్లెంలో రాశిగా పోసిన బియ్యంలో చేతి వ్రేలి ఉంగరంతో పాప పేరు దంపతులచే వ్రాయించడంతో నామకరణ ఉత్సవం ముగిసింది . నామకరణం పూర్తి అయిన తర్వాత శ్రీ సత్యన్నారాయణ వ్రతం , శ్రీ వెంకటేశ్వర దీపారాధన కు సన్నాహాలు జరుగుతున్నాయి . అతిధులందరూ వచ్చిఆశీనులయ్యారు. ఎవరికి దొరికిన చోట వారు . అంతటా అతిధుల కోలాహలం . అప్పుడో సంఘటన జరిగింది. కెవ్వు మన్న కేక హాలంతటా ప్రతిధ్వనించింది . ఆ కేకకి పాప తల్లి తల్లడిల్లి పోయింది . గుండెలు అవిసిపోయాయి. ఒడిలో పొత్తిళ్ళలో నున్న పాప గుక్క పట్టి ఏడుస్తోంది. కారణం నిస్సత్తువ.బారసాల తంతుకి అలసిన చిన్ని ప్రాణానికి ఆకలి వేసింది . పాల సీసాలో పాలు పోసి పీక నోటికి అందిస్తే శాంతించింది . కడుపు నిండాక బోసి నోటితో గల గలా నవ్వింది . తల్లి మొహంలో సంతోషం వెల్లి విరిసింది .
బ్రహ్మగారు వ్రత కార్యక్రమం ప్రారంభించారు. మంత్రోచ్ఛారణ జరుగుతోంది .
అప్పుడు జరిగింది ఇంకొక సంఘటన . మళ్ళీ కెవ్వు మన్న కేక. ఈసారి కెవ్వు కేక పసిబిడ్డ నోటి నుండి కాదు . మరెవరు ? దివాను బెడ్ మీద కూర్చున్న గౌరీపద్మ నుండి వెలువడింది . గౌరీపద్మ అలా కేక వేయడానికి ఓ బలమైన కారణం ఉంది . అప్పుడే వచ్చిన అతిధి గౌరీపద్మ పక్కన జాగా ఉంటే కూర్చోబోయాడు . అప్పుడు గౌరీపద్మ తన అరవై ఐదు సంవత్సరాల వయసును పక్కన పడేసి చంటిపిల్లలా కెవ్వుమంది అసంకల్పితంగా. సరిగ్గా అతిధి కూర్చోబోతున్న స్థలంలో గౌరీపద్మ ప్రాణప్రదంగా భావించే అరచేయి వెడల్పూ, జానెడు పొడవూ ఉన్న అధునాతనమైన స్మార్ట్ ఫోన్ ఉంది . అందులో ఆమె సందేశాలూ, బంధు మిత్రుల ఫొటోలూ , అరుదైన జ్ఞాపకాలూ , మనసు పడి ఇష్టంగా రికార్డు చేయించుకున్న స్తోత్రాలూ, శ్లోకాలూ , అష్ఠకాలూ , ఫోన్ నెంబర్లూ ఇంకా ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి . గౌరీపద్మ కేకకి ఇవేవీ కారణంకాదు . ముఖ్య కారణం సెల్ ఫోను స్క్రీన్ మీద తమ ఇంటి ఇలవేల్పు ఏడుకొండలవాడి ఫోటో పెట్టుకుంది . దాని మీద కూర్చుంటే అపచారం జరిగి పోతుందేమోనన్న భయం ఆమెలో ప్రవేశించి అలా ప్రవర్తింపచేసింది . గౌరీపద్మ కేకకి హడిలిపోయిన అతిధి అలా నిలబడి బిత్తర చూపులు చూసాడు . ప్రమాదం తప్పిందని గౌరీపద్మ తన సెల్ ఫోను జాగ్రత్తగా ఒడిలో పదిలపరచుకొని ఊపిరి పీల్చుకుంది .
...
కారంచేటి సీతారాం బళ్లారి వీరశైవ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫసర్. సాయింత్రం కాలేజీ నుండి వస్తూనే ' అమ్మాయి వచ్చిందా ! ' అని ప్రశ్నించాడు భార్య కమలమ్మని అలవాటుగా.
గౌరీపద్మ సీతారాం కమల దంపతుల ప్రధమ సంతానం . ప్రొఫసర్ గారికి గౌరీపద్మ అంటే ప్రాణం . వంటింట్లోంచి వచ్చి కమ్మని కాఫీ ఆయనకి అందించి ' ఆ .. అమ్మాయి ఇప్పుడే వచ్చింది ' అని జవాబిచ్చింది కమలమ్మ పక్కనే సోఫాలో కూర్చొంటూ..
గౌరీపద్మకి చదువు అంటే అంతగా శ్రద్ద లేదు . రోజూ ఉదయాన్నే స్కూలికి వెళ్లడం అలిసిపోయి సాయింత్రం ఇంటికి రావడం పరమ బోర్ గా అనిపించేది గర్ల్స్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్న గౌరీపద్మకి . ఆ చిన్న వయసులోనే చదువు వేరూ ... విద్య వేరూ ... అన్న అభిప్ర్రాయం ఆమె లేత హృదయంలో బలంగా నాటుకొనిపోయింది . అందుచేత కావాలనే పరీక్షలు తప్పేది . తలచుకొంటే తండ్రి పరపతితో పరీక్షలు పాస్ అవుతానని గౌరీపద్మకు తెలుసు. కానీ అది ఆమెకు ఇష్టం లేదు . చదువు కొనసాగించడం అంత కన్నా ఇష్టంలేదు . రోజులు గడుస్తున్నాయి .
...
యుక్తవయసు వచ్చిన ప్రతీ ఆడపిల్ల మనసులో చిన్న ప్రపంచం ఉంటుంది. రంగు రంగుల ఊహల ప్రపంచం . ఎన్నెన్నో అందమైన కలలు . ఊహల కన్నా వేగంగా మనసు పరిగెడుతూ ఉంటుంది . ఆ రంగుల కలల్లో ఓ రాజకుమారుడు విహరిస్తూ ఉంటాడు . ఎదో ఒకనాడు తన కలల రాజకుమారుడు గుర్రమెక్కి వచ్చి తనను పరిణయమాడుతాడని కలలు కంటుంది ప్రతి కన్నెపిల్ల ఆ వయసులో.....
పద్దెనిమిదో ఏట అడుగుపెట్టిన అమ్మలు దీనికి అతీతం కాదు .
చాలా మంది తల్లి తండ్రులు తమ చిన్నతనంలో వారు కోల్పోయిన సరదాలు , కోరికలూ తమ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకోవడం విచిత్రమేమీ కాదు . అమ్మలు అమ్మ ఈ వైఖిరి కి భిన్నం కాదు .
అట్లతద్ది ఫక్తు కన్నెపిల్లల పండుగ. అట్లతద్దోయ్ .. ఆరట్లోయ్ ... అంటూ పాటలు పాడుకొంటూ పెరటిలో ఓ చెట్టుకు కట్టిన ఉయ్యాల ఊగుతూ వారు చేసే అల్లరి సందడి రంగు రంగుల సీతాకోక చిలకల గుంపు దాడి చేసినట్లు అనిపిస్తుంది .
బంధువుల ఇంట్లో అట్లతద్ది పండగకి అమ్మలు వెడతానంటే ' సరే ' అంది తల్లి . సన్నగా రివటలా ఉండే అమ్మలు లంగా ఓణీ లో అజంతా శిల్పంలా ఉంది . మొగలిరేకులు కుట్టి చివరన ముద్దబంతి పూలు జడగంటలులా అలంకరించిన వాల్జెడ నల్లని త్రాచులా ఉంది . తోటి స్నేహితురాళ్ళతో కలిసి బయలు దేరింది అమ్మలు పండగ సందడికి ఆ సాయింత్రం పూట .
నడిచి వెడుతున్న అమ్మలు ఓసారి తన జెడ ముందుకు వేసుకుంది . మెగలిరేకులు సవరించుకుంది. సవరించుకున్నాక తన వాల్జెడ వెనక్కి విసిరింది . అలా విసిరిన వాల్జెడ వెనకాలే వస్తున్న సత్తిబాబు గుండెల్ని తాకింది. బంతిపూలు మన్మధ బాణంలా వచ్చి సత్తిబాబు హృదయాన్ని తాకాయి . సత్తిబాబుకి అదోలా అనిపించింది. గుండెల్లో మధురమైన అలజడి . అమ్మలు ఇదేమీ గమనించలేదు . ఆలస్యం అయిపోతుందని వడి వడిగా అడుగులు వేసింది. మన్మధ బాణం దెబ్బ కి అయోమయానికి గురి అయిన సత్తిబాబు నడకలో వెనకపడిపోయాడు. తేరుకునేసరికి అందనంత ముందుకు సాగిపోయింది అమ్మలు .
...
మన్మథుడు చతుర్ముఖ బ్రహ్మ సృష్టించిన దేవతామూర్తి. శృంగారానికి అధిష్టాన దేవత. మన్మధుని ధనుస్సు చెరుకు గడ . సంధించే అస్త్రం పూలబాణం . ఒకసారి కైలాసంలో శివ -పార్వతులు ఏకాంతంలో ఉండగా తన కర్తవ్య నిర్వహణలో భాగంగా మన్మధుడు వారి మీద పూల బాణం సంధించబోగా అది చూసిన పరమశివుడు ఆగ్రహుడై మూడవ నేత్రాన్ని తెరవగా మన్మధుడు కాలి బూడిద అయిపోతాడు . అలా కాలి బూడిద అయిన మన్మధుడిని అమ్మవారు కనికరించి పునర్జీవితుడిని చేస్తుంది .. అయితే అలా అమ్మవారి అనుగ్రహంతో పునర్జీవితుడైన మన్మధునికి రూపం ఉండదు. ఇది నాకు తెలిసిన కధనం . దీనికి అనేక రూపాంతరాలు ఉండవచ్చు. ఇక్కడ ఈ ప్రస్తావనకు మున్ముందు లంకె ఉంది.
...
చదువుమీద నిరాశక్తితో పరీక్షలు తప్పుతున్న గౌరీపద్మ పదహారో ఏడు నిండేసరికి ఎలాగో తొమ్మిదవ తరగతికి వచ్చింది. ప్రొఫసర్ గారికి కూతురిని ఇంకా చదివించాలన్న కోరిక ఉంది . ఇంకా చదువుకోవాలన్న కోరిక మాత్రం గౌరీపద్మలో లేశమైనా లేదు . కమలమ్మ భర్తని తొందరపెడుతోంది. అమ్మాయికి వివాహం చేసేద్దామని . సీతారాం మాత్రం తొందర పడటం లేదు . గౌరీపద్మ చదువులో పురోగమనం లేకపోవడంతో సీతారాం కమలమ్మ నిర్ణయంతో ఏకీభవించక తప్పలేదు. ' సరేలే వరుడు వెదకనవసరం లేదుగా ' అని లేచిపోయారు అక్కడనుంచి ప్రొఫసర్ గారు.
...
బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లకి తల్లి ముందుచూపుతో ఇంటి పనులలో కొద్ధి కొద్దిగా తర్ఫీదు ఇస్తుంది. చిన్న చిన్న పనులు నేర్పుతుంది. వయసులో జాగ్రత్తలు చెబుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు దుస్తులు ఎలా వేసుకోవాలో నేర్పుతుంది. మాట, నడవడిక అలవాటు చేస్తుంది . తర తరాలుగా తల్లులు అందరూ ఆడపిల్ల క్షేమం కోసం చేసేదే ఈ ప్రయత్నం .
కమలమ్మ గౌరీపద్మకు నడవడిక నేర్పింది. సంస్కారం అద్ది దిద్దింది.
...
బళ్లమూడి సుబ్రహ్మణ్యం విశాఖపట్నం పోర్ట్ లో ఉద్యోగి. ఆయన భార్య శేషమ్మ. వారి కుమారుడు సత్యనారాయణమూర్తి . సత్యనారాయణమూర్తి లో కావాల్సినంత చురుకుదనం ఉంది. అతి తక్కువ వయసులోనే మూర్తి తండ్రి పనిచేస్తున్న విశాఖపట్నం పోర్ట్ లోనే ఉద్యోగం సంపాయించుకున్నాడు . అన్ని అర్హతలూ ఉన్న బ్రహ్మచారి. శేషమ్మ ప్రొఫసర్ గారి సోదరి . శేషమ్మకి సోదరుడు సీతారాం అంటే వల్లమాలిన అభిమానం. గౌరీపద్మ పుట్టినప్పుడే తన ఇంటి కోడలిని చేసుకోవాలన్న కోరికకు శేషమ్మ మనసులో బీజం పడింది. సత్యనారాయణ మూర్తి ప్రయోజకుడవగానే అది బలపడింది .
ఈ మధ్యన సత్యనారాయణ మూర్తి లో ఒక మార్పు గమనించింది శేషమ్మ. ఎప్పుడూ ఉత్సహాంగా ఉండే కొడుకు కొన్నాళ్లుగా పరధ్యానంగా ఉంటున్నాడు. విషయం భర్త సుబ్రహ్మణ్యం చెవిన వేసింది శేషమ్మ. విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేసిన సుబ్రహ్మణ్యం ' త్వరలో వివాహం జరిపించేద్దాం . వధువు సిద్ధం గానే ఉంది కదా ! ' అని డ్యూటీకి వెళిపోయాడు. శేషమ్మ మనసు తేలిక పడింది .సంతోషంతో . తండ్రి పలికిన మాటలు గదిలో ఆఫీసుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సత్యనారాయణ మూర్తి విన్నాడు . మూర్తి మొహం పున్నమి చంద్రునిలా వెలిగిపోయింది. బూట్లు వేసుకొని ఈల వేస్తూ పట్టలేని ఉత్సాహంతో డ్యూటీకి బయలుదేరిన కొడుకుని చూసి శేషమ్మ విస్తుపోయింది.
...
గౌరీపద్మకి పద్దెనిమిదవ ఏట మేనత్త కుమారుడు సత్యనారాయణ మూర్తి తో వివాహం జరిపించారు సీతారాం-కమలమ్మ దంపతులు. మొదట్లో పుట్టింటి మీద బెంగపడిన గౌరీపద్మ కొంతకాలానికి సర్దుకొంది . అత్త ఇంటిలో జీవితానికి అలవాటు పడింది . కోడలిగా భాద్యతలు తీసుకుంది. జీవితం గాడిలో పడింది .
కాలం ఎవ్వరి కోసం క్షణం కూడా ఆగదు . రోజులు , నెలలు ,సంవత్సరాలు గడచిపోయాయి. గౌరీపద్మ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి. ముగ్గురు బిడ్డల తల్లి అయింది . వారి ఆలనా , పాలనా , పెంపకం , వివాహాది బాధ్యతలతో నాలుగు దశాబ్దాలు తెలియకుండానే గిర్రున తిరిగిపోయాయి.
...
దాంపత్య జీవితంలో మానవ సంబంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి . ఒంటరిగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనుభవిస్తూ ఉన్న పురుషుడు వివాహం కాగానే దాంపత్య జీవితంలో క్రమంగా ఒదిగి పోతాడు. ఈ క్రమంలో జీవన శైలిలో కొన్ని సర్దుబాట్లు తప్పవని గ్రహించి సర్దుకుపోతాడు . తనను నమ్ముకొని వచ్చి, తన అవసరాలను తీర్చి దిద్దిన భార్య జీవితం చుట్టూ అల్లుకుపోతాడు. ఇదీ ఈ దేశం వివాహ వ్యవస్థ లోని అద్భుత లక్షణం . హిందూ ధర్మంలోని మూలం . సనాతనం అద్దిన ముద్ర. పురుషుడు ప్రకృతి . స్త్రీ శక్తి స్వరూపిణి. సృష్టి స్వరూపిణి . దౌర్భాగ్యం ఏమిటీ ఆంటే ..... పాశ్చాత్య దేశాల సంస్కృతీ , అలవాట్లు , విచ్చలవిడితనం అనుకరిస్తున్న నేటి యువత హిందూ వివాహ వ్యవస్థని నిర్వీర్యం చేస్తోంది.
...
కుటుంబ బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత గౌరీపద్మకి జీవితం ఒడ్డెక్కినట్లు అనిపించింది . కావాల్సినంత తీరిక. ఈ సమయంలో ఆమె మనసు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపింది. ఇది ఒక కొత్త అనుభవం . ఆ క్రమంలో ఆమె పురాణాలు ఇతిహాసాలు , భగవధ్యానం , స్త్రోత్ర పారాయణం వైపు ద్రష్టి మరల్చింది . ఇందులో ఆమెకి చాలా ప్రశాంతత లభించింది. లలితాసహస్రనామ స్త్రోత్రం ప్రతి నిత్యం పఠించడంతో ఆ స్తోత్ర మంత్రాలు ఆశువుగా కంఠస్ధా వచ్చేసాయి . భగవంతుని ఆరాధన , ఇష్టదేవతా స్తోత్ర పఠనం గౌరీపద్మ దైనందిన జీవితంలో ఇప్పుడు ఒక భాగమైపోయాయి. స్తోత్ర , మంత్రాల విశ్లేషణ మూలార్ధం తెలుసుకున్నప్పుడు గౌరీపద్మకి 'ఇదీ విద్య ... ' అనిపించింది.
...
ఒకనాడు రాత్రి నిద్రలో గౌరీపద్మ ఒక వింత అనుభవానికి గురి అయింది . కలలో అమ్మవారు ప్రత్యక్షమై ' తల్లీ ! నీకు వాక్కు అనుగ్రహిస్తాను . స్వీకరించు . ' అంది. గౌరీపద్మ భయపడిపోయింది . శరీరం చెమటలు పట్టి తడిసి ముద్దయిపోయింది. పక్కనే నేలమీద నిద్రలో ఉన్న భర్త సత్యనారాయణమూర్తి ని చేయి తట్టి లేపుదామని ప్రయత్నించింది . చేయి ఎంత చాపినా భర్త అందటం లేదు . అమ్మవారు నవ్వుతూ చూస్తోంది. అమ్మవారు వాక్కు అనుగ్రహిస్తానంటే గౌరీపద్మ భయపడటానికి ఓ బలీయమైన కారణం ఉంది . ఆమె వాక్కు కొందరికి ఫలించవచ్చు. మరికొందరి విషయంలో ఫలించకపోవచ్చు. అది వారి కర్మానుసారం బట్టి ఉంటుంది . ఇట్టి అనుగ్రహం స్వీకరించటానికి గౌరీపద్మ మనసు అంగీకరించలేదు. రెండు చేతులూ జోడించి ' తల్లీ ! నాకు వాక్కు ఆనుగ్రహం వద్దు " అని భక్తి తో తిరస్కరించి ' సదా నీ దయ ,కృప, కరుణ నామీద ఉంటే చాలు తల్లీ ! ' అని వేడుకొంది . ఆమె కళ్ళనుండి ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి . కల చెదిరిపోయింది . గౌరీపద్మకి స్పృహ వచ్చ్చింది . ఇంకా భయం తగ్గలేదు . గుండె వేగం పెరిగిపోయింది . గభాలున లేచి రాగి చెంబు తో చెంబుడు నీళ్ళు గట గటా తాగింది. అప్పటికి గాని స్థిమితపడలేదు. ప్రశాంతంగా నిద్రిస్తున్న భర్తని లేపి అనుభవం చెప్పింది. అంతా విన్న సత్యనారాయణమూర్తి ' త్వరలో అమ్మవారి దర్శనానికి వెళ్లి వద్దాం ' అన్నాడు. భర్త నోటి నుండి ఆ మాట వినగానే సంబరపడింది గౌరీపద్మ. అప్పటికి తూర్పున తెల్లవారు తోంది .
...
లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే ..
అష్టాదశ శక్తి పీఠ ప్రార్ధన మొదటి శ్లోకం .
దక్షిణ భారత దేశం లోని కాంచీపురం క్షేత్రం చెన్నపట్నానికి డబ్భై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది . భారతదేశంలో గల సప్త మోక్షపురులలో కాంచీక్షేత్రం ఒకటి .
ఫొటోలోని వారే కధలోని ముఖ్య పాత్రలు
" అయోధ్యా మధుర మాయా కాశీ కాంచీ అవంతికా
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకా : "
( అయోధ్య, వారణాసి , మథుర , హరిద్వార్ , కాంచీపురం , ఉజ్జయిని , ద్వారకా ... ఇవి సప్త మోక్షపురాలు ) కంచి మోక్షవిద్యకు మూలపీఠం , అద్వైతవిద్యకు ఆధార స్థానం . ' కాంచి ' అనగా మొలనూలు . వడ్డాణం . భారతభూమికి ఇది నాభి స్థానం . ' కా ' అంటే "లక్ష్మి " , ' మా ' అంటే "సరస్వతి" ' అక్షి ' అంటే "కన్ను " . కామాక్షీ దేవి అంటే లక్ష్మీదేవి , సరస్వతీ దేవి కన్నులుగా గలది అని అర్ధం. ఈ క్షేత్రంలో కామాక్షీ దేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కోలువుతీరి ఉంటారు .. యోగ ముద్ర. ఈ యోగ ముద్ర ప్రేమ , శాంతి , ఐశ్వర్యాలకు చిహ్నం. అమ్మవారు ఎడమవైపు పై చేతిలో చెరకుగడ ధనస్సుగా ఉంటుంది. కుడి పై చేతిలో కమలం ,రామచిలుక ఉంటాయి . అమ్మవారి క్రింద చేతులలో పవిత్రమైన "పాశ " "అంగుస " చక్రాలు ఉంటాయి . నుదిటిమీద చంద్రాకారంలో చిహ్నం ఉంటుంది . అద్వితీయ రూపం అమ్మవారిది . ఒకసారి దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనిపిస్తుంది. ఎంతచూసినా తనివి తీరని ఆకర్షణీయమైన రూపం అమ్మవారిది .
...
కామాక్షీ అమ్మవారి దివ్య దర్శనం కోసం కాంచీపురం వచ్చిన సత్యనారాయణమూర్తి -గౌరీపద్మ ఉదయాన్నే కాల కృత్యాదులు కానిచ్చి శుచిగా స్నానమాచరించి దేవాలయం చేరుకొన్నారు. . ఆలయంలో కామాక్షీ పరదేవతా స్త్రోత్ర పఠనం జరుగుతోంది.
కల్పనోకహ పుష్పజాల విలాసన్నీలాలకాం మాతృకాం
కాంతాం కందలేక్షణాం కలిమల ప్రధ్వంసినీం కాళికాం
కాంచీనూపురహార హీరసుభాగాం కాంచీపుర నాయకీం
కామాక్షీమ్ కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియాం .....
రుత్వికులు గంభీరస్వరం ఆలయ ప్రాంగణంలోనలుదిక్కులనుండి ప్రతిధ్వనిస్తోంది. ఇలాంటి పవిత్ర వాతావరణంలో అమ్మవారిని దర్శించుకున్న సత్యనారాయణమూర్తి - గౌరీపద్మ దంపతులు పరవశించిపోయారు.
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే .
అని అమ్మవారిని స్తుతించి మరొక్కసారి అమ్మవారి మంగళ రూపాన్ని దర్శించుకొని తరించిపోయింది గౌరీపద్మ.
అలా తన్మయత్వంలో ఉన్న గౌరీపద్మని చూసిన సత్యనారాయణమూర్తి ..
"అమ్మలూ " అని పిలిచాడు.
ఆ పిలుపులో శృంగారం లేదు .
మనస్సునిండా నిండిన ఆప్యాయత ఉంది .
అంతకన్నా మించిన అనురాగం ఉంది .
ఆ పిలుపుకి ఉలిక్కిపడ్డ గౌరీపద్మ అటూ ఇటూ తిరిగి చూసింది .
నవ్వుతూ సత్యనారాయణమూర్తి కనిపించాడు.
' నువ్వా ! బావా! సత్తిబాబూ " అని అరచేతుల్లో ముఖం దాచేసుకుంది.
గౌరీపద్మ ప్రతిచర్యలో గౌరవం ఉంది.
ఆనందం ఉంది.
అంతకన్నా మించి జీవిత సాఫల్యం ఉంది .
*********************************************************
మొన్నామధ్య విశాఖపట్నంలో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంటే వెళ్లడం జరిగింది . కార్యక్రమం పూర్తి అయి అతిధులు అందరూ సెలవు తీసుకుంటున్నారు . ఆ సమయంలో అరవై ఐదేళ్లు దాటిన ముత్తైదువ నా చెవికి ఉన్న బంగారుపోగు , వేషం చూసి నేనొక పండితుడనని భ్రమ పడి పరిచయం చేసుకొంది . మాటల్లో నేను అడపా తడపా పిచ్చి పిచ్చి రాతలు రాస్తానని తెలుసుకొని " నా కధ వ్రాయరూ " అని అడిగింది . ఆమె లోని అమాయకత్వం , భోళాతనం, పసిపిల్ల మనస్తత్వం నన్ను కట్టి పడేశాయి. కాదనలేకపోయాను. ఆమె గురించి, ఆమె జీవితం గురించి నాకేమీ తెలీదు. ఆమె చెప్పిన చిన్న వివరాలు మినహా. మాట అయితే ఇచ్చేశాను గాని రచన విషయంలో ఎలా ముందుకు సాగాలో అర్ధం కాలేదు . సరే ! మొదలెడదాం అని ప్రారంభించేసరికి అక్షరాల కూర్పు జరిగిపోతోంది ప్రవాహంలా . ఈ కధ నడిపించింది సాక్షాత్తూ కామాక్షీ అమ్మవారని నా ప్రగాఢ విశ్వాసం. పట్టుమని రెండు వారాలు కూడా కాలేదు నేను అమ్మవారిని దర్శించుకొని. ఈ రచన లోని ప్రతి అక్షరం ,వాక్యం ,కూర్పు కామాక్షీ అమ్మవారివే. నా ప్రమేయం నామమాత్రమే .
మిత్రులు ,శ్రేయోభిలాషులూ అందరికీ హేవలంబ నామ సంవత్సర దీపావళి పండగ శుభాకాంక్షలు.
ఈ క్రింద
శ్రీమతి గౌరీపద్మ (అమ్మలు ) =శ్రీ సత్యనారాయణమూర్తి (సత్తిబాబు)
******************************************************
:
7 comments:
చాలా రోజుల తర్వాత మీ కథ..సూటిగా సాగింది.ఫోటోలు చూసేసరికి కళ్లకి కట్టినట్లు హీరో హీరోయిన్లు ప్రత్యక్షమయ్యారు.
Thanks Radhika Rao gaaru.
Comment on the story by Sundaresa Ananda Rangan pasted below.Comments on the blog by my Childhood friend Sundress Ananda Rangan sent by email are pasted below:
" My dear Jagatpati:
Thanks for sending me your latest short story - కంచికి చేరిన కధ.
I read it a couple of times to relish and enjoy it more. So it took me for a while to share my thoughts with you.
1. This is a very creative effort on your part, an inspiration morphing into a short story. Many writers don’t tell us how they get ideas for their stories; I am glad you did. And in your case, it also happened quite spontaneously. As you say thatముత్తైదువ, as a person, made a deep impression on your mind and you let it all come together. In a way, the story wrote itself! The prime reason was an inspiration and as you say, it could be divine too!
2. I am familiar with the proverbకధ కంచికి, మనం ఇంటికి. With your temple darshan, you connected it to a proverb; elaborated a brief anecdote about a couple and spun a story - with interesting details along the way.
3. A similar proverb in Tamil - in a close translation - goes like this:The story ended, the eggplant has ripened. The Tamil words for storyand eggplant are kathai andKattarikkai - two alliterative words like కధ and కంచి. I wanted to add a bit of trivia here!
4. Yours is a very fluent Telugu style, and it looks like a child play to you; that can come only with a lot of practice. You write about our rich Vedic tradition and I am glad you also translated and explained the meaning of the Sanskrit slokas in the narrative. This again reminds me the wealth of Sanskrit knowledge you possess and can articulate. You can also write at length unsullied Telugu - free from English and other foreign words. I commend your use of గ్రాంధిక భాష. It feels to me like a breath of fresh air."
Rangan was my school , college and Engineering mate. He migrated US in seventies. He is a writer himself.He won Sahitya Academy Award for one of his translation of Tamil novel into English.
Comment on the story by my elder sister I. R.Laxmirao(Rajappa).My Dear Brother,....
Amazing...! Immediet action,. Write up..... Flow in U r Language ...Hats off..
U r already Gifted.... Ammavari Kripa is always there with you.
U r intensive Sankalpa always makes successful any thing U attempt.
This is what I believe!
Lot of Blessings,,,..,.. Rajappayya "
Comment on story by Shri Vaddadi Surya rao gaaru.
"
Ifully agree with Raja."
Mamayya
Comments on the blog sent by Smt. Shobha Tiruvuri sent through FB Messenger are pasted below:
Kamakshi ammavarini kallaku kattinattu gaa sagindi mee varnana . Meeku maa Padabhivandanamulu .
Comment on my Story by Mrs. Janaki Sastry sent by mail is pasted below.
Janaki Sastry was our playmate in childhood.After marriage She migrated to United Kingdom. She is a very popular writer of Fiction and non-fiction novels and stories. These have been published and are available.(Amazon) Her most popular book is " He Let Gandhi into his Life ". A beautiful book on India's Freedom Struggle.I get connected to this book as I know most of the characters in it.I feel it as a honor to have her immediate response which reads as follows.
" Simply superb narration. Send it to Madhuravani (USA). e-magazine . Let me know when it gets published. "
Post a Comment