తర్పణం .
గోదారమ్మ తల్లి అంత్య పుష్కరాలు క్రిందటి నెల 31 వ తేదీ నుండి మొదలు అవడంతో రాజమహేంద్రవరం నగరం పుష్కర శోభ సంతరించుకొంది . గోదావరి నది కి వడ్డాణాలుగా ఉన్న వంతెనలు రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో అలంకరించబడి దేదీపమాన్యంగా వెలిగి పోతున్నాయి . వాటి కాంతులు నదీ జలాల్లో ప్రతిఫలించి వింత శోభని కలిగిస్తున్నాయి . కృష్ణా నది పుష్కరాలు దగ్గిర పడటంతో అధికారులు ఆశించినంత భక్తసంద్రం లేదు . దాదాపు అన్ని ఘాట్ల వద్ద జనం పల్చగా ఉన్నారు . ఈ నెల 11 వ తేదీన అంత్య పుష్కరాలు పరి సమాప్తం . చివరి రెండు రోజులు ఒడిశా , రాజస్థాన్ , ఉత్తర రాష్ట్రాల నుండి పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల తాకిడి అధికంగా ఉండవచ్చని అంచనా .
....
సూర్యోదయానికి ముందరే నిద్ర లేచి దంతావధానం కానిచ్చి పొగలు కమ్మే ఫిల్టర్ కాఫీ లానులో పచార్లు చేస్తూ గాని , పై డాబా మీద తిరుగుతూ గాని ఆస్వాదించడం నా దైనిక చర్య .
నాలుగు రోజులనుండీ నా దైనిక చర్య ఆస్వాదించడం కష్టం గా మారింది .
కారణం .
నే కాఫీ కప్పు పట్టుకు బయటికి రాగానే అంతవరకూ చుట్టుపక్కల ఎక్కడా కనిపించని కాకులు ' కావ్ ... కావ్ ' అని అరుచుకొంటూ నాకు సమీపంగా గోడల మీద రివ్వుమని వాలడం మొదలైంది .
మా ఇంటి ప్రహారీ చుట్టూ నీడ కోసమని నేను ఎప్పుడో నాటిన మొక్కలు పెరిగి వృక్షాలు గా ఎదిగాయి . వాటి కొమ్మలు విశాలంగా పరచుకొని చల్లటి నీడని పరుస్తున్నాయి . చెట్టు కొమ్మల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయేమోనన్న అనుమానం కలిగింది . ప్రతి వృక్షం పరిశీలనగా చూసాను . ఒక్క పక్షి గూడు కూడా కాన రాలేదు .
ఆశ్చర్యం వేసింది .
కాకి గోలకి నా కాఫీ ఆస్వాదించే చర్యకి ఆటంకం కలిగింది .
ఆశ్చర్యం వేసింది .
కాకి గోలకి నా కాఫీ ఆస్వాదించే చర్యకి ఆటంకం కలిగింది .
సాయంత్రం పూట పోనీ డాబా మీదకి వెళ్లి కాఫీ త్రాగుదామని ప్రయత్నిస్తే అప్పుడూ కాకులు ప్రత్యక్షం .
...
రెండ్రోజుల క్రితం మాటల సందర్భంలో వేదం చదువుకున్న మిత్రునితో నా అనుభవం చెపితే చిన్న నవ్వు నవ్వాడు .
'నీ నవ్వు కాదు నాకు కావలిసిన జవాబు . దీనికి తర్కం ఏమిటి ?' అని నిలదీసాను .
భుజం మీద ఉత్తరీయం సర్దుకొని ' వాయస రూపం ' అన్నాడు ముక్త సరిగా .
'అంటే ' అన్నాను అర్థంకాక.
'పుష్కరకాలం . పితృదేవతలు నీ ధర్మాన్ని గుర్తు చేస్తున్నారు ' అన్నాడు తాపీగా .
అప్పుడు నాకు అర్థమైంది .
...
మా కుటుంబ బ్రహ్మ గారికి ఫోన్ చేశి కార్యక్రమం నిశ్చయం చేసాను . మా అమ్మ గారు కాలం చేసిన తిథి షష్టి అవటంతో ఈ రోజున గోదావరీ తీరం వద్ద ఏర్పాట్లు చేయమని చెప్పాను బ్రహ్మ గారికి . ఉదయం ఆరు గంటలకి గోదావరి గట్టు వద్ద ఉండాలని వారి ఆదేశం .
...
ఉదయం ఆరు గంటలు .
తూర్పున తెల్ల వారింది .
తూర్పున తెల్ల వారింది .
బ్రహ్మ గారు చెప్పిన సమయానికి శ్రీ మార్కండేయస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ పద్మావతి ఘాటు వద్దకు చేరుకున్నాను .
ప్రభాత వేళ . సోమవారం కావటం మూలాన
శివాలయంలోంచి లౌడ్ స్పీకర్ల నుండి ఓం కార నాదం మంద్రంగా వినిపిస్తోంది . పరిసరాలు అన్నీ భక్తి భావం తో నిండుగా ఉన్నాయి .
********************************************
ప్రభాత వేళ . సోమవారం కావటం మూలాన
శివాలయంలోంచి లౌడ్ స్పీకర్ల నుండి ఓం కార నాదం మంద్రంగా వినిపిస్తోంది . పరిసరాలు అన్నీ భక్తి భావం తో నిండుగా ఉన్నాయి .
...
నదీ పరివాహాక ఎగువ ప్రాంతాల్లో ఈ మధ్యన బాగా వర్షాలు కురియడంతో గోదావరిలో వరద చేరి నీరు ఎరుపు వర్ణంగా మారింది . ఎరుపు రంగు చీర కట్టుకున్న పల్లె పడచులా గోదారమ్మ తల్లి తుళ్ళి తుళ్ళి పడుతోంది . సాగర సంగమం కోసం ఆతృతగా ముందుకు ప్రవహిస్తోంది గోదారమ్మ .
...
పుణ్య స్నానం చేయటానికి గోదావరి లోకి దిగాను . ప్రవాహ వేగానికి పట్టు దొరకటం కష్టం గా ఉంది . సమీపంలో యువ దంపతులు స్నానం చేస్తున్నారు . ఆమె తన్మయత్వం తో గోదాట్లో మునకలు వేస్తోంది . ఆమె భర్త మెట్ల మీద చిరు ప్రాయంలో ఉన్న కుమారుడిని వడిలో ఉంచుకొని వాడి చిన్ని చిన్ని చేతులతో భార్య మీద నీళ్లు చిలకరిస్తూ ఆటలాడిస్తున్నాడు . ప్రవాహ వేగం తట్టుకోలేక పోతున్న నన్ను చూశి ఆమెని నాకు చేయి అందించమని చెప్పి మందహాసం చేశాడు . పుణ్యాత్మురాలు . హస్తం అందించి గోదాట్లో నేను మూడు మునకలు వేయడానికి సహాయ పడింది . మూడు మునకలూ వేశాక నదిలో కుదురుగా నించోడానికి పట్టు దొరికింది .
బ్రహ్మ గారు మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు . ముందుగా నదీ స్మరణ . ఆ తర్వాత పుష్కరుని కి భక్త్యాఅంజలి . తూర్పు అభిముఖంగా నించొని ఆదిత్యుని ద్వాదశ నామాలు వల్లిస్తూ అంజలి ఘటిస్తూ తర్పణం . దాని తర్వాత ఉత్తర దిక్కునకు తిరిగి సప్త మహాఋషులకూ తర్పణం . ఇక పితృ దేవతలకు తిలా తర్పణం కావించడానికి గట్టున కూచోబెట్టి దర్భలతో తయారు చేసిన పవిత్రం ఉంగరం వేలుకి ధరింపచేసి తూర్పు అభిముఖంగా కూర్చోమని సంకల్పం చేయించారు బ్రహ్మ గారు . తర్వాత దక్షిణం దిక్కుకి తిరిగి బ్రహ్మ గారు మంత్రం చెబుతూ ఉంటే పేరు గోత్రనామం చెబుతూ పితృ దేవతలందరికీ తిలా తర్పణం చేయటం జరిగింది . అలా సంకల్పించిన కార్యక్రమం నియమ నిష్టలతో ముగిసి సంతోషాన్ని కలిగించింది . బ్రహ్మ గారి ఆశీర్వచనం పొంది కృతజ్ఞతలు తెలిపాను . రోడ్డు మీదకు చేరడానికి బ్రహ్మ గారు చేయూత ఇస్తానంటే .... కాస్సేపు ఒడ్డునుండి గోదారమ్మ తల్లి అందాలు చూస్తానని
ఆగిపోయాను .
అప్పుడు అనిపించింది .
ఆగిపోయాను .
అప్పుడు అనిపించింది .
పుణ్య జీవ నదులు అయిన గోదారమ్మ , కృష్ణవేణి అఖండ రూపంలో ప్రవహిస్తున్న తెలుగు నేల తల్లి మీద జీవించడం పూర్వ జన్మ సుకృతం అని . త్రేతా యుగంలో కోందండ రాముడు , సీతమ్మతల్లి , లక్ష్మణ స్వామి తో కలిసి నడయాడిన నదీ తీరం గోదావరి అని జ్ఞప్తికి వచ్చి అనిర్వచనీయమైన ఆనందం కలిగింది .
...
మామూలు దుస్తులు ధరించి ,రాగి చెంబూ , ఉద్దరిణి ,తతిమ్మా సామాగ్రీ సర్దుకొని బయలు దేరబోతూ ఉంటే గట్టు మీద కూర్చొన్న ఓ వ్యక్తి ' మీదే ఊరు ? ' అని పలకరించాడు . " ఈ ఊరే ! ' అన్నా .
'బ్రాహ్మలా ! ' అన్నాడు ఆయన .
"అవును " అన్నా .
నమస్కరించాడు . ఆయన చర్యకి విస్తు పోయాను .
ఇంకా ముందుకి వెళుతూ ఉంటే బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న పండితుడు వేదమంత్రాలు వల్లె వేసుకుంటూ దర్శన మయ్యాడు . నన్ను చూసి మందస్మితం చేసి ' శివోహం ' అని సాగిపోయాడు .
'శివోహం ' అన్నా నేను .
ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటే బాగా గెడ్డం పెరిగి మాసిన దుస్తులతో ఉన్న యువకుడు ఎదురయ్యాడు .
' సార్ ' అని పలకరించాడు .
'ఏమి చేశారు సార్ ! గోదారొడ్డున ' అన్నాడు .
' తర్పణం ' అని జవాబు ఇచ్చా .
'అంటే '
' పితృదేవతలని స్మరించుకొని దోసిలితో వారికి నీళ్లు గోదారమ్మ వడిలో వదలటం లాంటి కార్యక్రమం .'
ఆ యువకుని కళ్ళల్లో నీళ్లు చిమ్ముకొచ్చాయి .
' సార్ . నేను చాలా పాపిష్టిని . వ్యసనాలకు బానిసని అయి తల్లి తండ్రులను పట్టించుకోలేదు . ఈ నాడు నాకు వారు కావాలని వస్తే ఈ లోకంలో లేరు . తర్పణం ఇస్తే వారు నన్ను క్షమిస్తారా !' అన్నాడు .
'తప్పకుండా ' అన్నా .
అది వినగానే ఆ యువకుడు చర చరా గోదావరి లోకి దిగి మూడు మునకలు వేసి దోసిలి తో " తర్పణం " కావించడం కనిపించింది .
అది గమనించిన గోదారమ్మ మరింత ఉత్సాహంగా ఉరకలు వేసింది .
ఇంటికి చేరుకునేసరికి రమారమి ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది .
కాఫీ త్రాగుతూ పై డాబా మీదకు వెడితే 'వాయసాలు ' కనిపించలేదు .
జీవితంలో కొన్ని అనుభవాలు ఊహకు అందవు .
ఇంటికి చేరుకునేసరికి రమారమి ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది .
కాఫీ త్రాగుతూ పై డాబా మీదకు వెడితే 'వాయసాలు ' కనిపించలేదు .
జీవితంలో కొన్ని అనుభవాలు ఊహకు అందవు .
ధర్మో రక్షతి రక్షతః
*********************************************************************************
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి.
********************************************
No comments:
Post a Comment