బాల్యోత్సాహం |
Illustration by : Baby Aanya , California
కాలం మింగేసిన బాల్యం
(02)
మా నాన్న బాల్యం .
మా నాన్న బాల్యం గురించి నాకు నాన్న ఎప్పుడూ చెప్ప లేదు . ఆయన కాలం చేసిన తర్వాత నాన్న వ్రాసుకున్న డైరీలలో ఆశ్చర్యకరమైన మనుసులో గూడు కట్టు కొన్న నిక్షిప్త విషయాలు తెలిశాక నా మనసు కాస్త విచలితమైన మాట వాస్తవం .
అందుకే... ఇక్కడ మా నాన్న బాల్యం గురించి ఆయన డైరీల నుంచి సంగ్రహించిన విషయాలు ప్రస్తావించడం సమంజసం .
...

చంద్రుడు గారిని అతి గారాబంగా పెంచారు తల్లి తండ్రులు .అదే అదుననుకొని మా నాన్న తెగ అల్లరి చేసేవాడు . పొలాల గట్లమ్మట , జీడిమామిడి తోటల్లో ,పశువుల వెనకాలా , ఒకటేమిటి అంతటా మా నాన్నే. పొడవుగా గిరజాల జుత్తు పెంచి జడలేసేది మా బామ్మ . తన వస్తువులు అన్నీ కొడుకు మెడలో వేశి మురిసిపోయేది లక్ష్మీనరసమ్మ .
మా నాన్న జన్మించిన తర్వాత చాన్నాళ్ళకు కలిగిన ద్వితీయ పుత్రోత్సాహం ఎంతో కాలం నిలబడలేదు లక్ష్మీనరసమ్మ గారికి. ఆవిడ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది. అన్ని వైద్యాలు ప్రయత్నించి గుణం కన్పించిక పోవడంతో మా పితామహులు జగత్పతి గారు (బుల్లి ) తొట్టె వైద్యం మొదలు పెట్టించారు .
ఆ రోజుల్లో మందులూ, మాకులకు లొంగని రోగాలకు తొట్టె వైద్యం ఒక ప్రత్న్యామ్యా యం . ఫలితాలు బానే ఉండి రోగికి కొంత ఉపశమనం కలిగించేది ఈ వైద్యం . అలా కొద్ది రోజులు జరిగాక మా నాన్నకి తెలిసీ తెలియని వయసు లో లక్ష్మీ నరసమ్మ గారు అనారోగ్యంతో ప్రమోదూత నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్ష అష్టమి నాడు (23-04-1930) గౌరీ లోకం పొందారు .అప్పుడు నాన్న వయసు పదకొండు సంవత్సరాలు. ఈ సంఘటన బుల్లి గారి నే కాకుండా బాల్యంలో ఉన్న మా నాన్న జీవితాన్ని మున్ముందు కాలం లో ప్రభావితం చేసింది .
(బామ్మ వైద్యానికి ఉపయోగపడిన తొట్టె ఆ తర్వాత కాలంలో పశువులకు చిట్టూ ,తవుడూ నిల్వ చేసుకొనడానికి ఉపయోగపడింది . నా హయాంలో ఈ మధ్యనే 2012 వ సంవత్సరంలో ఈ తొట్టెని పాత సామాన్ల వ్యాపారికి రెండు కిలోల ఉల్లిపాయలకి ఇచ్చేశాను. )

ఇంట్లో ఆడ దిక్కు లేక పోవడంతో బుల్లి గారికి మా నాన్నని చూసుకోవటం ,పల్లెటూర్లో విద్య నేర్పించటం కష్ట తరమవటంతో మా నాన్నని తన సోదరుడైన మంగయ్య గారి వద్ద ఉంచి కాకినాడలో బడిలో చేర్పించారు .
అన్న బుల్లి గారు అంటే మంగయ్య గారికి మిక్కిలి గౌరవం , అభిమానం . మంగయ్య గారే కాదు రక్తం పంచుకు పుట్టిన తతిమ్మా సోదర సోదరీమణులకు కూడా బుల్లి గారు అభిమాన పాత్రుడు. బుల్లి గారు వ్యవహార దక్షుడు . ఉమ్మడి కుటుంబ ఆస్తుల సంరక్షణ పరిరక్షణ ,కుటుంబ యోగ క్షేమాలు ఆయనే చూసేవారు .
ఎంత పినతండ్రి ఇల్లు అయినా తల్లిని కోల్పోయిన నాన్న మొదట్లో బెంగగా, బెరుకుగా ఉండేవాడు .
పినతండ్రి మంగయ్య గారికి సంతానం ఎక్కువ . పిల్లలతో కళ కళ లాడే గృహం .
ఇంచుమించు మంగయ్య గారి పిల్లలు వయసులో పెద్దా , చిన్నా అయినా తమతో నాన్నని కలుపుకొని ఆదరించడం తో బెంగ కాస్త తీరింది .
అప్పుడప్పుడు మనసు వంటిమామిడి లోని పచ్చని పొలాలు, జీడిమామిడి తోటలూ , ఇసుక దిబ్బలూ , ఘోషించే సముద్రం, తూర్పు
దిక్కున శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వర స్వామి కొలువైఉన్న యర్రమిల్లి వారి కుటుంబ దేవాలయం , ఇంట్లోని ఎల్లావులూ ,వాటి లేగ దూడలూ కేసి పోయేది . అప్పుడు ఎం తో వెలితి గా అనిపించి నిద్రలో తెలియకుండానే కన్నీళ్ళు కారేవి .
తల్లి ప్రతి క్షణం గుర్తుకు వచ్చేది . తెల్లారితే నిత్య క్రియలు , బడి, పినతండ్రి గారి పిల్లలతో ఆటలు, పోటీలతో గడిచి పోయేది .
కాలం గడిచిపోతోంది ఏమీ పట్టనట్లు . బుల్లి గారి ఆరోగ్యం కూడా మందగించ సాగింది . విపరీతమైన ఆయాసం . పల్లెటూరు లోని వైద్యం ఫలించలేదు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ వెళ్ళారు
బుల్లి గారు .
అన్న బుల్లి గారు అంటే మంగయ్య గారికి మిక్కిలి గౌరవం , అభిమానం . మంగయ్య గారే కాదు రక్తం పంచుకు పుట్టిన తతిమ్మా సోదర సోదరీమణులకు కూడా బుల్లి గారు అభిమాన పాత్రుడు. బుల్లి గారు వ్యవహార దక్షుడు . ఉమ్మడి కుటుంబ ఆస్తుల సంరక్షణ పరిరక్షణ ,కుటుంబ యోగ క్షేమాలు ఆయనే చూసేవారు .
ఎంత పినతండ్రి ఇల్లు అయినా తల్లిని కోల్పోయిన నాన్న మొదట్లో బెంగగా, బెరుకుగా ఉండేవాడు .
పినతండ్రి మంగయ్య గారికి సంతానం ఎక్కువ . పిల్లలతో కళ కళ లాడే గృహం .
ఇంచుమించు మంగయ్య గారి పిల్లలు వయసులో పెద్దా , చిన్నా అయినా తమతో నాన్నని కలుపుకొని ఆదరించడం తో బెంగ కాస్త తీరింది .
అప్పుడప్పుడు మనసు వంటిమామిడి లోని పచ్చని పొలాలు, జీడిమామిడి తోటలూ , ఇసుక దిబ్బలూ , ఘోషించే సముద్రం, తూర్పు
దిక్కున శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వర స్వామి కొలువైఉన్న యర్రమిల్లి వారి కుటుంబ దేవాలయం , ఇంట్లోని ఎల్లావులూ ,వాటి లేగ దూడలూ కేసి పోయేది . అప్పుడు ఎం తో వెలితి గా అనిపించి నిద్రలో తెలియకుండానే కన్నీళ్ళు కారేవి .
తల్లి ప్రతి క్షణం గుర్తుకు వచ్చేది . తెల్లారితే నిత్య క్రియలు , బడి, పినతండ్రి గారి పిల్లలతో ఆటలు, పోటీలతో గడిచి పోయేది .
...
బుల్లి గారు .
...
ఒకరోజు...
దుమ్ము రేపుకొంటూ ఓ కారు బుల్లి గారి ఇంటి ముందు ఆగింది . వేసవి కాలం . సూర్యుడు అగ్ని గోళం లా మండి పోతున్నాడు .
రాచ్చెర్వు పొలంలో ధాన్యం కుప్ప నూర్పిళ్ళు చేయించుకొని బాటలో నడిచి వస్తున్న బుల్లి గారి జ్యేష్ట సోదరుడు వెంకటచలం గారి కుమారుడు సత్యం గారు ( మా సత్యం బాబయ్య) తన చిన్నాన్న ఇంటి ముందర కారు ఆగిన దృశ్యం చూశారు .
మా సత్యం బాబయ్య ధృఢ శాలి . సింహం లాంటి గాంభీర్యం . వెన్నపూస లాంటి మనసు . సింహంలా వడిగా అడుగులేస్తూ బుల్లి గారి ఇంటి వద్దకు చేరుకున్నారు .
కారులోంచి బుల్లి గారు దిగలేదు .
సన్నగా రివిట లా ఉండే బుల్లి గారి శరీరం అంతటా నీరు పట్టి కారు డోరు తెరుచుకొని దిగటం
సాధ్య పడలేదు. ఇది గమనించిన సత్యం బాబయ్య తన బలం ఉపయోగించి కారు తలుపు ఊడ బెరికారు . మా నాన్న అమాయకంగా కారు లోంచి దిగి జరుగున్నదంతా చూస్తున్నాడు.
సాధ్య పడలేదు. ఇది గమనించిన సత్యం బాబయ్య తన బలం ఉపయోగించి కారు తలుపు ఊడ బెరికారు . మా నాన్న అమాయకంగా కారు లోంచి దిగి జరుగున్నదంతా చూస్తున్నాడు.
బుల్లి గారిని ఇంటిలోనికి తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు సత్యం బాబయ్య .
'ఎలా ఉంది బుల్లి నాన్నా ' అన్నారు సత్యం బాబయ్య .
నిర్లిప్తంగా చూసేరు బుల్లి గారు .
ఇంతలో సత్యం గారి భార్య సీతాయమ్మ వచ్చింది .
సీతాయమ్మని చూశి ' నా చింత అంతా వీడి గురించేనమ్మా ' అన్నారు బుల్లి గారు మండువాలో స్తంభాన్ని కావలించుకొని ఉన్న మా నాన్నని చూపిస్తూ .
' మీరు అధైర్య పడకండి మావయ్య గారూ . మేమంతా లేమూ ! ' అంది సీతాయమ్మ.
సీతాయమ్మ మా నాన్నకి వరస కి వదిన అయినా వయసు లో మాతృ సమానురాలు . మా నాన్నకి సీతాయమ్మ అంటే అభిమానం , భక్తీ , గౌరవం . పెద తండ్రి కొడుకు సత్యం గారంటే భయంతో కూడిన గౌరవం.
'నువ్వు ఆ మాట ఇస్తే చాలమ్మా . పసితనం. నిండా పదహారు సంవత్సరాలు వాడికి . లోకం తెలీదు . తల్లి ప్రేమను చిన్న తనం లోనే కోల్పోయాడు . అదీ నా బాధ . ' అన్నారు బుల్లి గారు .
సమాధానంగా ' చంద్రుడు గురించి ఏమీ చింతన చెందకండి మావయ్యా. విశ్రాంతి తీసుకోండి ' అని అభయం ఇచ్చింది సీతాయమ్మ .
ఈ మాటలు విన్న బుల్లి గారు ప్రశాంతం గా నిద్రపోయారు .
అమాయకంగా , బిత్తరగా చూస్తున్న మా నాన్నకి జరుగుతున్నది ఏమిటో అర్థం కావటం లేదు .
అలా ప్రశాంతంగా నిద్ర పోయిన బుల్లి గారు మరి లేవలేదు .
యువ నామ సంవత్సరం చైత్ర శుద్ద మంగళ వారం రాత్రి (16. 04. 1935 ) పదకొండు గంటలకు బుల్లి గారు శివ సాన్నిధ్యం చేరు కొన్నారు .
...
తల్లీ , తండ్రిని కోల్పోయిన మా నాన్నకు భవితవ్యం శూన్యం గా గోచరించింది . ప్రపంచం అంతా చీకటి గా అనిపించింది . విషయం తెలిసి మచిలీపట్నంలో రెవిన్యూ శాఖలో పనిచేస్తున్న మా పెద నాన్న సుబ్బులు గారు వచ్చి తండ్రి అంత్యక్రియలు కావించారు .
...
,
వయసు లో తన కన్నా పదహారు ఏళ్ళు పెద్ద అయిన అన్నగారంటే మా నాన్నకి ప్రేమ ,గౌరవం ,భయం . మా పెద నాన్న భార్య, వదినగారైన మృణాలిని దగ్గర చనువు . సుబ్బులు గారు వంటిమామిదిలోని భూ సంభందిత ఆస్తి వ్యవహారాలన్నీ పినతల్లి సుబ్బమ్మ గారి భర్త అయిన యర్రమిల్లి సుబ్బారాయుడు గారిని అజమాయిషీ చేయవలసిందిగా కోరి తమ్ముడిని తీసికొని మచిలీపట్నం వెళ్ళారు .
...
మా నాన్న స్కూల్ విద్యాభ్యాసం కాకినాడ , గుడివాడ , మచిలీపట్నం (బందరు ) నగరాల్లో జరిగింది . ఆతర్వాత వివాహం బోడపాటి సత్యనారాయణ , రంగనాయకమ్మ గారి తృతీయ కుమార్తె యశోదమ్మ తో జరిగింది . చంద్రుడు గారి కాలేజి చదువు మామ గారు సత్యనారాయణ గారు చెప్పించారు . ఇంటర్మీడియట్ బరంపురం కల్లికోట మహారాజా వారి కళాశాలలోను , డిగ్రీ ఆంధ్ర విశ్వవిద్యాలయం , వాల్తేరు లోను చదువు సాగింది .
...
మా నాన్న ఇంటర్మీడియట్ పూర్తి చేసే సరికి ఇద్దరు పిల్లల తండ్రి . 1939 వ సంవత్సరంలో రాజప్ప , 1940 వ సంవత్సరంలో నేను ఈ లోకంలో కళ్ళు తెరిచాము. 1943 వ సంవత్సరంలో మా నాన్న మమ్మల్ని వంటిమామిడి తీసుకు వచ్చి కాపురం పెట్టాడు . అప్పుడు రాజప్పకి మూడు నిండి 4వ సంవత్సరం నాకు రెండు నిండి మూడవ సంవత్సరం . అలా వంటిమామిడి వచ్చి స్థిర పడ్డాము .
...
మా నాన్న తన బాల్యం గురించి డై రీలలో వ్రాసుకున్న మాటల సంక్షిప్త సారాశం :
' తెలిసీతెలియని వయసులో కౌసల్య మాత లాంటి తల్లి ని కోల్పోయాను . ఎవరూ తీర్చలేని లోటు .
లోకాన్ని చదవగలిగిన వయసు రాకముందే దశరధుడు లాంటి తండ్రి కళ్ళముందే స్వర్గస్తులయ్యారు . ప్రపంచం చీకటి అయిపోయినట్లు అనిపించింది ఆ సమయంలో . ...
అన్నా , వదినా ఉండకపోతే ఏమయి పోయి ఉండేదో ఈ జీవితం .
నాకు ఓ సోదరి కామేశ్వరి ఉండేదని తెలిసింది ఊహ తెలిసే వయసులో . సోదరి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు . కారణం . నా జన్మకు ముందే నా సోదరి సుమంగళి గా పోవటం . ఈ లోటు జీవితమంతా నన్ను భాధించింది . అందుకే .... పినతల్లి చిట్టెమ్మ కుమార్తె లక్ష్మీదే వి లో అక్కయ్య కామేశ్వ రి ని దర్శించు కొన్నాను . ప్రతీ ఏడాదీ భగినీ పండగ నాడు లక్ష్మీదే వి అప్పయ్యని సత్కరిస్తున్నాను . '
మా నాన్న గతించిన తర్వాత డైరీలలో నిక్షిప్త పరచిన ఈ వాక్యాలు నన్ను కలచి వేశాయి .
అప్రయత్నంగా నా నోటి నుండి 'పితృ దేవోభవః ' అన్న మాట వెలువడింది .
నా బాల్యం చాలా మధురమైనది . అది తెలుసుకోవాలంటే తర్వాతి భాగం వరకు వేచి చూడాల్సిందే మరి .
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
సకాలంలో సత్కర్మలను ఆచరించటమే నైష్కర్మ్యానికి మార్గం. కర్మే అకర్మణ్యతకు సాధన మవుతుంది . ఆ పిమ్మట పొంద దగినది ఏమీ ఉండదు.
'నడిచే దేవుడు . '
శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర స్వామి వారు .
శ్రీ కంచి కామకోఠి 68 వ పీఠాధిపతి.
శ్రీ కంచి కామకోఠి 68 వ పీఠాధిపతి.
'''''''''''''''''''''''''''''''''''''''''
మిత్రులూ , బంధువులూ , శ్రేయోభిలాషులు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు .
'''''''''''''''''
మిత్రులూ , బంధువులూ , శ్రేయోభిలాషులు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు .
'''''''''''''''''
No comments:
Post a Comment