సాయింత్రం ఆరున్నర గంటలు . నేను , కల్నల్ రంగారావు ఆఫీసర్స్ క్లబ్ లాంజ్ లో బ్రిడ్జి టేబుల్ వద్ద కూర్చొని తతిమ్మా మిత్రుల కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాం.
కల్నల్ రంగారావు , చలపతి , రామలింగం ,రమణమూర్తి నా ఆప్తమిత్రులు . ప్రభుత్వంలో వివిధ శాఖలలో విధులు నిర్వర్తించి రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగులం . బాధ్యతలు తీరిపోయాయి . అందువలన కాలక్షేపానికి కావలిసినంత టైం మా అందరికీ .
ప్రతి రోజూ సాయింత్రం ఆఫీసర్స్ క్లబ్ లో కలుసుకొని కనీసం ఓ రెండు రబ్బర్లు బ్రిడ్జి ఆట ఆడటం మా దైనందిక చర్య.
రంగారావు ఆర్మీ లో ఆర్డినెన్సు కోర్ ( AOC ) లో పనిచేశాడు . ధైర్యసాహసాలు ఎక్కువ . 'జీవితం అనుభవించాలి గాని దాచుకోవడానికి కాదోయ్ " అంటాడు ఎల్లప్పుడూ . స్నేహానికి విలువని ఇచ్చే మనిషి .
చలపతి ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి . సాహిత్యం అంటే మక్కువ . భావుకుడు. గ్రంధాలయాలూ, పుస్తక ప్రదర్శనలు ఎక్కడ ఉంటే అక్కడ తప్పనిసరిగా కనిపిస్తాడు చలపతి. సమాజంలో ఉన్న ప్రతి అరాచకం మీద మితి మిక్కిలిగా స్పందించి , అక్రోధన , ఆవేశం చివరకు నిస్సాహాయత పడే మనస్తత్వం .
ఇక రామలింగం. వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా రిటైర్ అయిన మిత్రుడు . అధిక బరువు తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది అని సతీమణి అస్తమానూ సతాయిస్తూ ఉంటే , ఆమె నస తప్పించుకోవడానికి ' యోగా శిక్షణ ' అన్న చిట్కా ఉపయోగించి , ఆ నెపంతో సాయింత్రం క్లబ్ లో హాజరు. ఇంటికి చేరాక ' పాపం ! బాగా అలిసిపోయి వచ్చారు ' అని భార్య విందు భోజనం వడ్డిస్తే మహదానంద పడిపోయే సరదా మనిషి.
రమణమూర్తి ప్రభుత్వ రంగ బ్యాంక్ లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశి జీవితం దిలాసాగా ఆనందించే మనిషి . నిగర్వి . విమర్శలు లైట్ తీసుకొనే సహృదయుడు . స్నేహితులకి సకల మర్యాదలు చేయటం అంటే మహా సరదా.
' అదిగో ! వస్తున్నారురా ! ' అన్నాడు ఉషారుగా కల్నల్ నన్ను ఉద్దేశించి .

చలపతి ,రామలింగం, రమణమూర్తి వచ్చి కూర్చొని 'సారీ ! కల్నల్ ! " అన్నారు ముక్త కంఠంతో .
' ఇంకెందుకూ ఆలస్యం " అని పేక ముక్కలు పంచడానికి ఉపక్రమించాడు కల్నల్ . నాది ఎప్పుడూ ప్రేక్షక పాత్రే . వాళ్ళు నలుగురూ ఆటలో మునిగిపోయారు . ఆటలో నిమగ్నమవడంతో గమనించలేదు. బయట వాతావరణం అకస్మాత్తుగా క్షణాలలో మారిపోయింది . ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచాయి . ముందు జాగ్రత్తగా కరెంటు వాళ్ళు కరెంటు తీసేసారు . అంతటా అంధకారం . చిమ్మ చీకట్లు నగరాన్ని కమ్మేశాయి . ఇంకొంత సేపటికి చినుకులు రాలడం మొదలయింది . కాస్సేపటికి చినుకులు కాస్తా హోరు వానగా మారింది . క్లబ్ అటెండర్ వచ్చి కొవ్వొత్తులు వెలిగించాడు , మా పేకాట అటకెక్కింది ఆ రోజుకి . మిగాతా టేబుల్స్ వద్ద మెంబెర్స్ బార్ అటెండర్ కి కావలసిన సరంజామా ఆర్డర్ ఇస్తున్నారు ,
' ఇప్చ్ ! గ్రాండ్ స్లాం తప్పింది' అన్నాడు కల్నల్ . చేతిలోని పేక ముక్కలు విసురుగా పడవేస్తూ .
' గుర్రం ఎక్కుతానోయి ' అన్నాడు కల్నల్ రంగారావు రమణమూర్తి కేసి చూసి .
' నాకు రేసు గుర్రం కావాలి . పూర్తిగా కిక్ ఎక్కీతేగాని మజా లేదు ' అన్నాడు రామలింగం .
రమణమూర్తి సకల మర్యాదల ఏర్పాటుకై లోపలికి వెళ్లి కాస్సేపటికి వచ్చి కూర్చున్నాడు . తన పని అయిపోయిందన్నట్లుగా.
కొంతసేపటికి గుర్రం , రేసుగుర్రం , సోడా , మినరల్ వాటర్ , వేడి వేడి మిరపకాయ బజ్జీలు , మసాలా జీడిపప్పు మా టేబుల్ చేరాయి .
కల్నల్ గుర్రాన్ని ఆస్వాదిస్తున్నాడు . గొంతు లోంచి వెచ్చగా దిగుతోంది .
రామలింగం రేసు గుర్రం పని పట్టి హడావుడిగా రెండు గళాసులు బిగించాడు .' ఈ రోజు మత్తులో మునిగి కింద పడి దొర్లేయాలి ' అంటూ . మిగతా జనం బజ్జీలు , జీడిపప్పు మీద దాడి చేసాం .
రామలింగం వాఖ్యలకి కల్నల్ గాఠిగా నవ్వాడు . కారణం రామలింగం రేసుగుర్రం కోడ్ భాష " కోక్ " .
అలా రాత్రి కరిగి పోతోంది .
కాలక్షేపం కోసం నేను ' చలపతీ ! నీ ఉద్యోగ బాధ్యత నిర్వహణలో మరిచిపోలేని సంఘటన ఒహటి చెబుదూ ! ' అని ప్రతిపాదించాను .
చలపతికి ఏ విషయమైనా అందరినీ ఆకట్టుకొనేలా చెప్పే ప్రావీణ్యం ఉంది . నా ప్రతిపాదన మిగతావారు ఏకగ్రీవంగా సమర్ధించటంతో చలపతి అంగీకరించక తప్పలేదు .
చలపతి చెప్పటం ప్రారంభించాడు .
***
" ఈ సంఘటన నేను డైరెక్ట్ recruit ఆదాయపు పన్ను అధికారిగా (ITO) చేరిన కొత్త లో జరిగింది .
ఉడుకు రక్తం . ఉత్సాహం . అప్పట్లో . నీతి ,నిజాయితీ ఎట్టి
పరిస్థితుల లోనూ తాకట్టు పెట్టకూడదన్న దృఢసంకల్పం . కృషి తో ఉన్నతాధికారుల మెప్పు పొందాలన్న పట్టుదల . ఆశయాలు , లక్ష్యాలు సహజంగా కొత్తగా ఉద్యోగం లో చేరే యువతలందరిలోనూ ఉన్నట్లు నా లోనూ బలంగా ఉన్నాయి .
ఒకరోజు ఆఫీస్ లో పెండింగ్ ఫైల్స్ చూసే పనిలో ఉండగా కమీషనర్ గారి వద్ద నుండి పిలుపు వచ్చింది .
వెళ్లాను .
రూంలోకి వెళ్ళగానే ' రా ! చలపతీ " అని కుర్చీ చూపించారు. ఆ వెంటనే ఛాంబర్ బయట ఉన్న రెడ్ లైట్ ఆన్ చేశారు . రెడ్ లైట్ దీపం ఛాంబర్ బయట వెలుగుతూ ఉందంటే కమీషనర్ గారు ముఖ్య మైన సమావేశం లో ఉన్నారు . ఇతరులు ఎవ్వరికీ ప్రవేశం లేదని సంకేతం .
నేను కూర్చోగానే టేబుల్ సొరుగు తెరిచి ఓ కాగితం అందించారు కమీషనర్ నా చేతికి . చదవండి అన్నట్లుగా . ఆశాంతం చదివితే తేలిన సారాంశం ఇది .
అది ఒక ఆకాశ రామన్న లేఖ. గోదావరీ తీర ప్రాంతం సఖినేటిపల్లి లో ఒక సంపన్న ఫలానా రాజు గారి కుటుంబం ఉందనీ , వారి వద్ద వడ్డీ వ్యాపారం మరియు ఇతరత్రా లావాదేవీల వల్ల లెక్క చూపని సుమారు ఏభై లక్షల నల్లధనం , లెక్కలేనంత బంగారం ,వెండి నిల్వలు ఉన్నాయని అందువలన చట్టపరంగా తగు చర్యలు ఆదాయ శాఖ అధికారులు తీసుకొన వలిసినది అని
పిర్యాదు .
లేఖ చదివిన తర్వాత 'మీ ఆదేశం ఏమిటి ' అన్నట్లు కమీషనర్ గారి వైపు చూసాను .
'చలపతీ ! ఇటువంటి ఆకాశ రామన్న ఉత్తరాలు పెద్దగా పట్టించుకోనక్కరలేదు . కానీ మన దృష్టికి వచ్చింది కనుక " ఏ పుట్టలో ఏ పాము ఉందో " అన్న సంశయం ఉంటుంది' అన్నారు సాలోచనగా .
' సార్! ఇది కొంత ఆలోచించ దగ్గ విషయం .పిర్యాదు లేఖలో వ్రాసినంత ధనం , ఆభరణాలు దొరకక పోవచ్చు . కనీసం ఒక ఇరవై లక్షలు పట్టుబడినా మన టార్గెట్ అందుకోగలం ' అన్నాను ఉత్సాహంగా .
' సరే ! సెర్చ్ చేద్దాం . కాకినాడ ఐటిఓ (ITO) గారి సహాయ సహకారం కూడా తీసుకో ' అని సెర్చ్ అనుమతి ఇచ్చారు .
ఆకాశరామన్న లేఖ తీసుకొని కమీషనర్ గారి చాంబర్ నుంచి బయటకు వచ్చాను .
ఎర్ర దీపం బదులుగా ఆకుపచ్చని దీపం వెలిగింది ఛాంబర్ బయట .
నాకు అది మొదటి సెర్చ్ రైడ్ జరపటం మూలాన్న చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది .
సెర్చ్ రైడ్ తేదీ నిశ్చయమైంది .
కాకినాడ ఐటిఓ (ITO) నరసింహం కి ఫోన్ చేసి 'గురూ ! రేపు టిఫిన్ కి వచ్చెయ్యండి " అన్నాను .
' ఎంతమంది ? ' అన్నాడు నరసింహం .
' నలుగురు చాలు" అన్నా .
' ఎక్కడ' అన్నాడు నరసింహం .
'సఖినేటిపల్లి ' .
సెర్చ్ రైడ్ ఆపరేషన్ కోడ్ "టిఫిన్ ".
***
ఉదయమే మా బృందం సఖినేటిపల్లి చేరుకుంది . ఆకాశ రామన్న లేఖలో ఇచ్చిన వివరం మేరకు రాజు గారి ఇల్లు చేరుకున్నాము . ఊరి చివర్లో సుమారు ఎకరా విస్తీర్ణం గల కొబ్బరి తోటలో రాజు గారి డాబా . బయటికి సామాన్య మధ్య తరగతి వారి ఇల్లులా అనిపించింది .
తలుపు తట్టాము .
' ఎవరూ ! ' అంటూ సుమారు ముప్పై ఐదేళ్లు మించని స్త్రీ తలుపు తెరిచింది .
ఆమెను చూస్తూనే మేము వచ్చిన పని కొద్ధి క్షణాలు మరిచిపోయాం . ఈమె మానవ స్త్రీ యా లేక దేవతా స్త్రీ యా అని అనిపించింది . అద్భుతమైన సౌందర్యం . గంధర్వ , కిన్నెర స్త్రీల అందం ఆమె ముందు దిగడుపే . ముల్లోకాలలోని సౌందర్యం అంతా ఒక రాశి గా పోస్తే ఎలా వుంటుందో అలా ఉంది ఆమె అందం .
కార్తీక మాసం అవటంవల్ల తలస్నానం చేసి వచ్చిన ఆమె నీళ్ళోడుతున్న జుట్టుని తుండుతో చుట్టుకుంది .
సంబ్రమ ఆశ్చర్యం నుండి తేరుకున్న నేను ' రాజు గారి తో పని ఉంది తల్లీ ! వారిని ఒహసారి పిలవండి .' అన్నాను .
ఆమె మొహంలో కళ తప్పింది . నా మాట వినగానే .
' రాజుగారు కాలం చేసి ఆరు నెలలు దాటింది బాబూ ' అంది ఆమె దీనంగా .
ఆమె అందానికి ముగ్ధులైన మేము అప్పటి వరకు ఆమె ముఖాన బొట్టు లేదన్న సంగతి గమనించలేదు .
' మీరు రాజుగారికి ఏమవుతారు ? ' అని ప్రశ్నించా .
' నేను రాజు గారి భార్యను ' అంది ఆమె .
మేము వచ్చిన పని ఆమెకు వివరంగా అర్ధమైనట్లు
చెప్పాను .
' నేను పెద్దగా చదువుకోలేదు బాబూ ! ఇవన్నీ నాకేమి అర్థమవుతాయి' అంది ఆమె.
' ప్రభుత్వ ఉద్యోగులం . మా డ్యూటీ మేము చేయాలి కదమ్మా! . మీ ఇల్లు పూర్తిగా సోదా చేయాలి . పోనీ మీ బంధువులు గాని సన్నిహితులు గాని ఎవరైనా ఉంటే వారిని పిలవండి . వారి సమక్షం లో సోదా తనిఖీలు చేస్తాం ' అన్నాను నేను .
' ఈ ఊర్లో రామన్న పంతులుగారు రాజు గారి స్నేహితులు . వారికి రాజు గారి వ్యవహారాలూ అన్నీ తెలుసు . పంతులు గారిని రమ్మని కబురు అంపిస్తాను ' అంది రాజు గారి భార్య.
' అలాగే తల్లీ " అని పంతులు గారి రాక కోసం ఎదురు చూస్తున్నాము .
రాజు గారి భార్య వచ్చి ' పంతులుగారికి కబురు పెట్టాను బాబూ. వారు వచ్చేలోగా మీకు కాఫీ , ఫలహారం ఏర్పాట్లు చేయిస్తాను ' అంది ఆప్యాయంగా .
సున్నితంగా తిరస్కరించాను .
కాస్సేపటికి ఓ వ్యక్తి వచ్చారు . ' బాబూ ! వీరే రామన్న పంతులుగారు ' అని పరిచయం చేసింది రాజుగారి భార్య .
పంతులుగారు నమస్కరించారు . ప్రతివాదం చేశాం బృంద సభ్యులం .
రామన్న పంతులుగారు మేము ఊహించుకున్న దానికి భిన్నంగా ఉన్నాడు . పంతులు గారంటే పంచెకట్టు ధోవతి, అంగవస్త్రం, నుదుటిన బొట్టు తో ఉంటారని మేము ఊహించాము . ఆయన సాధారణంగా మన అందరిలానే ఉన్నాడు . స్ఫురద్రూపి . ఆజానుబాహువు . దబ్బపండు ఛాయ . మన్మధ రూపం . అందగాడు . వయసు నలభై అయిదు సంవత్సరాలు ఉండవచ్చు . వయసుకి తగ్గ గాంభీర్యం .
పంతులు గారికి మేము వచ్చిన పని వివరించాము . ఆయన రాజు గారి భార్యతో సంప్రదింపులు జరిపి 'మీ పని కానివ్వండి ' అన్నాడు .
రాజు గారి భార్య గదులు తెరిచి బీరువాలు , అలమారాల తాళాలు అందించింది తత్తరపాటు లేకుండా .
మా బృందం పనిలో పడింది . క్షుణ్ణంగా సోదాలు చేసి దొరికిన దస్త్రాలు, నగలు , నగదు నా ముందు పెట్టారు . రిపోర్ట్ వ్రాయటానికి . దస్త్రాలలో కొన్ని ప్రామిసరీ పత్రాలు ఉన్నాయి. అవి లెక్క చూస్తే అంతా కలిపి అరవై వేలని తేలింది . నగదు పది వేలు . బంగారం వెండి ఆభరణాలు సాధారణం గా ప్రతి గృహిణికి ఉండే దానికి మించి లేవు . కంగు తిన్నాము . ఆశించిన దానికి వాస్తవం మరోలా ఉంది .
ఇంతలో నరసింహం వచ్చి నైరుతి దిశ గది తాళం వేసి ఉంది అని ఉప్పు అందించాడు .
రాజు గారి భార్యతో ' ఆ గది కూడా తెరవండి తల్లీ " అని ఆజ్ఞాపించాను .
రాజు గారి భార్య రామన్న పంతులు గారి వైపు చూసింది . సంశయంగా .
'మా డ్యూటీ మేము చేయాలి కదమ్మా ! ఆ గది లో కూడా తనిఖీ నిర్వహించి మా రిపోర్ట్ వ్రాసుకొని మీ వాంగ్మూలం తీసుకొంటే మా పని ముగుస్తుంది " అన్నాను ఆమెతో .
' అది రాజు గారి గది . అక్కడ ఆయన వస్తువులు తప్ప మరేమీ లేవు బాబూ ' అంది రాజు గారి భార్య దీనంగా .
' తెరవక తప్పదమ్మా " అన్నాను నేను .
ఇక తప్పదన్నట్లు ఆమె గది తాళం తీసి తలుపులు తెరిచింది.
ఆమె చెప్పినట్లు గానే గదిలో పెద్ద సామాను ఏమీలేదు . రాజు గారి మంచం , పడక కుర్చీ కనిపించాయి . ఇంకాస్త దృష్టి సారిస్తే ఓ మూలాన పెద్ద ట్రంక్ పెట్టె కనిపించింది . దానికి తాళం వేసి ఉంది . ట్రంక్ పెట్టె చూడగానే నా కళ్ళు మిల మిలా మెరిసాయి . మా సెర్చ్ రైడ్ సఫల మవుతుందన్న ఆశ చిగురించింది నాలో .
' ఆ ట్రంక్ పెట్టె తాళం తెరవండమ్మా ' అన్నా రాజు గారి భార్యతో .
'ఆ పెట్టె లో రాజు గారి వస్తువులు తప్ప మరేమీ లేవు
బాబూ ! ' అంది ఆమె.
' తెరవాలమ్మా' అన్నా నేను .
రాజుగారి భార్య పెట్టె తెరిచి అందులోని వస్తువులన్నీ చాలా విలువైనట్లుగా ఒక్కొక్కటీ బయటికి తీసి పరిచింది .
ఆ దృశ్యం చూసి విద్యుత్ షాక్ తగిలినట్లు అయింది నాకు .
అవి రాజు గారి దుస్తులు . కంటి మెడ బనీను , ఖద్దరు కమీజు , పొందూరు పంచె , కండువా , తుండు , జేబు రుమాలు , శీతాకాలంలో కప్పుకోడానికి వాడే షోలాపూర్ దుప్పటి,
శాలువా . ఆమె రాజు గారి దుస్తులు ఒక్కొక్కటే తీస్తూ ఆప్యాయంగా గుండెల మీద పరచుకొని కన్నీరు కార్చింది. రాజు గారి దుస్తులు స్పర్శిస్తూఉంటే ఆమెకు రాజు గారు పలకరించినట్లుగా ఉంది . ఓదార్చినట్లు అనిపించింది . రాజు గారు బతికే ఉన్నారు అనిపించసాగింది . పమిట చెంగుతో కన్నీరు తుడుచు కొని " మహాదేవ శంభో " అని భర్తను మనసారా స్మరించి నమస్కరించింది .
రాజు గారి పేరు మహాదేవుని రుద్రరాజు .
ఆమె స్థితిని చూసిన నా మనసు ద్రవించి మూగ పోయింది . అప్పుడు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి రామాయణ కావ్య రచనకు కారణమైన క్రౌంచ పక్షుల గాధ స్ఫురణకు వచ్చింది . వేటగాని లా చాలా గిల్టీ గా ఫీల్ అయ్యాను . ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండ బుద్ధి కాలేదు .
ఆమె దీన స్థితిని ఇక చూడలేక "క్షమించమ్మా " అని నమస్కరించి పంతులు గారి నుండి , ఆమె నుండి శలవు తీసుకున్నాము.
...
ఇది జరిగిన కొన్నాళ్ళకి ఒక ఫంక్షన్ లో రామన్న పంతులు గారు తారస పడ్డాడు . నేను రాజు గారి భార్య కుశలం వాకబు చేసాను . అప్పుడు చెప్పాడు ఈ సంగతి రామన్న పంతులు . ' రాజు గారు కాలం చేసిన తర్వాత ఆయన బంధువు కౌటిల్య రాజు , రాజు గారి భార్య ని సానుభూతి నెపంతో మోసగించబోతే అది కుదరలేదు . దాని పర్యవసానమే మీకు అందిన ఆకాశ రామన్న ఫిర్యాదు .
' అవును . అటువంటి సందేహం మాకూ కలిగింది పంతులు గారూ ! ' అని శలవు తీసుకున్నాను .
...
చలపతి ముగించిన తర్వాత మా అందరి గుండెలూ బరువెక్కిపోయాయి .
...
బయట వాన వెలిసింది .
అప్పటివరకూ మబ్బుల మాటున దాగిని చంద్రుడు
వెన్నెల అమృతంలా కురిపిస్తున్నాడు .
ఆకాశం నక్షత్రాలు పరచుకున్న దుప్పటిలా ఉంది .
కల్నల్ రంగారావు గుర్రం దిగిపోయాడు .
రేసుగుర్రం ఎక్కి బొక్కబోర్లా పడతానన్న రామలింగం చతికిలపడిపోయాడు .
అందరమూ మౌనంగా ఉండిపోయాము .
మహాదేవ శంభో ! అని ఇళ్ళకి బయలు దేరాం .
*******************************************
సీతాదేవి ని అపహరించటానికి నిశ్చయమైన రావణుడు మారీచుని వద్దకు చేరుకొని సీతాపహరణంలో సాయం

కోరతాడు . అప్పటికే రామ బాణం ధాటికి గురి అయి రామునికి దూరంగా అడవుల్లో తల దాచుకున్న మారీచుడు రాముని గురించి ఇలా రావణునితో పలుకుతాడు .
రామో విగ్రహవాన్ ధర్మః
సాధుః సత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకస్య
దేవానామివ వాసవః