రాధా 'రామ 'ణీయం .
రామ అంటే రమణీయ స్వరూపం . ఇదీ సౌందర్య తత్వమే . నిత్య నూతన సౌందర్యానికి 'రమణీయం ' అని పేరు . ఆనందాన్ని అందించేదే 'అందం ' అనేది భారతీయ తత్వ చింతన .'ఆనందోబ్రహ్మ ' అంటూ ఉపనిషత్తులు శాశ్వతమైన, చైతన్యమైన ఆనందమే 'పరమాత్మ' అని ప్రతిపాదించాయి . 'అంతర్యామి ' లో ....బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ.
పైన చెప్పబడిన 'ఆనందోబ్రహ్మ ' అన్న పదాన్ని ఆధారంగా చేసుకొని అందరినీ ఆనందింప చేయడానికి కొద్దిగా హాస్యం పాళ్ళు జత చేసి ప్రయత్నించిన ఈ రచన పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకంతో .... ఇక చదవండి .
గుత్తి వంకాయ కూర, వాక్కాయ పప్పు , గోంగూర పచ్చడి ,కొత్త ఆవకాయ , ముక్కల పులుసు ఆపైన మీగడ పెరుగు తో షడ్రుచుల భోజనం పెట్టిన రాధమ్మ వైపు ఆప్యాయంగా చూసి ..
' అన్నదాతా సుఖీ భవః ' అన్నాడు రామం .
పదిహేను సంవత్సరాల వయసులో రామం చేత మూడు ముళ్ళు కట్టించుకున్న రాధమ్మ ..
'చాలు . రోజూ ఈ కాకా ' అన్నట్లుగా రామం కేసి చూసి చిరు నవ్వు నవ్వింది . దానికి ముగ్ధుడు అయిపోయాడు రామం .
'అదేమిటీ ' అన్నదాత నువ్వే కదా ' అని ఆశ్చర్యం ప్రకటించేను నేను రామాన్ని ఉద్దేశించి .
దానికి కూడా ఓ నిగూఢమైన చిరునవ్వు పారేసి......
'కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా ' అన్నాడు రామం .
'కంచం పక్కనే నీళ్ళ చెంబూ , గళాసు పెట్టేగా!తీసుకొని త్రాగొచ్చు' అంది రాధమ్మ . 'నీ చేత్తో ఇస్తే అమృతంలా ఉంటాయి ' అన్నాడు రామం మరో కాకా బాణం ప్రయోగించి .
తిరుగు లేని ఈ బాణానికి పడిపోయింది రాధమ్మ .
గుత్తి వంకాయ కూర, వాక్కాయ పప్పు , గోంగూర పచ్చడి ,కొత్త ఆవకాయ , ముక్కల పులుసు ఆపైన మీగడ పెరుగు తో షడ్రుచుల భోజనం పెట్టిన రాధమ్మ వైపు ఆప్యాయంగా చూసి ..
' అన్నదాతా సుఖీ భవః ' అన్నాడు రామం .
పదిహేను సంవత్సరాల వయసులో రామం చేత మూడు ముళ్ళు కట్టించుకున్న రాధమ్మ ..
'చాలు . రోజూ ఈ కాకా ' అన్నట్లుగా రామం కేసి చూసి చిరు నవ్వు నవ్వింది . దానికి ముగ్ధుడు అయిపోయాడు రామం .
'అదేమిటీ ' అన్నదాత నువ్వే కదా ' అని ఆశ్చర్యం ప్రకటించేను నేను రామాన్ని ఉద్దేశించి .
దానికి కూడా ఓ నిగూఢమైన చిరునవ్వు పారేసి......
'కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా ' అన్నాడు రామం .
'కంచం పక్కనే నీళ్ళ చెంబూ , గళాసు పెట్టేగా!తీసుకొని త్రాగొచ్చు' అంది రాధమ్మ . 'నీ చేత్తో ఇస్తే అమృతంలా ఉంటాయి ' అన్నాడు రామం మరో కాకా బాణం ప్రయోగించి .
తిరుగు లేని ఈ బాణానికి పడిపోయింది రాధమ్మ .
...
రాధమ్మ పెట్టిన షడ్రుచుల భోజనం చేసిన రామం భుక్తాయాసం తీర్చుకోవటానికి హాలులో వాలు కుర్చీ వాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఆత్మావలోకనం చేసుకున్నాడు . ఇంత వరకూ గడచిన జీవితం తరచి చూసుకుంటే రాధమ్మ ఇంటి కోడలిగా ఆ కుటుంబంలో అడుగు మోపిన దగ్గర నుండి కుటుంబ సభ్యుల జీవితాలని తన వయసుకు మీరిన పరిపక్వతతో ఎంతగా ప్రభావితం చేసినదీ పదే పదే గుర్తుకు వచ్చి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నాడు రామం .
పదిహేనేళ్ళు నిండిన రాధమ్మ కోడలుగా ఇంట అడుగు పెట్టి దాదాపు అరశతాబ్ధం పైనే దాటింది . ఆడ దిక్కు లేని సంసారం . కోడలిగా వస్తూనే తులసమ్మని శుభ్రం చేశి దీపం వెలిగిచింది . ఇంట్లో పూజ గదిలో నిత్య దీపారాధన కావించింది . వయసు మీద పడిన మామగారు , అప్పటికి ఇంకా చిన్నవాళ్ళు అయిన మరదులు , ఆడపడచు భాద్యతలు చిరు నవ్వుతో స్వీకరించి సక్రమంగా నిర్వహించి అందరి ప్రేమానురాగాలు పొందిన రాధమ్మ అద్వితీయురాలుగా అనిపించింది రామంకి.
ఈ సంసార ప్రయాణంలో మూడు పువ్వులు
పూసాయి .
పద్మ, యస్సు , శ్రీలక్ష్మి .
వారి వివాహా భాద్యతలు కూడా తీరిపోయాయి . ఈ ఆలోచనలలో మునిగిపోయిన రామం కి తెలియకుండానే కునుకు పట్టింది . .
...
ఫోను మ్రోగింది . డైనింగ్ టేబుల్ సర్దుతున్న రాధమ్మ
'పద్మా ! ఫోన్ ఎత్తు . నా చేయి ఖాళీ లేదు ' అంది పద్మని ఉద్దేశించి .
పద్మ ఫోన్ ఎత్తి ' అంతా బావున్నాం . పాపా
కులాసా . అమ్మ బావుంది . నేను టీవీలో 'గయ్యాళి అత్త -గోవు లాంటి కోడలు ' సీరియల్ చూస్తున్నా . విష్ణు ఆఫీసుకి వెళ్ళాడు' అంది పాఠం అప్పచెప్పినట్లు. అని మళ్ళీ ' అంతా బానే ఉన్నాం ' అంది . ఫోన్ చేసినది ఎవరో తెలుసుకోకుండానే .
పాపం పద్మ ఇలా మాట్లాడటానికి ఒక బలీయమైన కారణం ఉంది . వాళ్ళ అమ్మ ఎప్పుడైనా రామం తో కలిసి పని మీద బయటకు వెళ్ళ వలసి వస్తే ఇంటికి ఎవరైనా ఫోన్ చేస్తే ఒక్కర్తినీ ఉన్నానని చెప్పకు . దొంగలు అలా ఫోన్లు చేసి ఒంటరిగా ఉన్నారని తెలుసుకొని ఇంటికి వచ్చి తలుపు కొట్టి మరీ
దోచేస్తారు సుమా ! అని జాగ్రత్తలు చెప్పింది పద్మకి .
పద్మ ఫోనులో మాట్లాడుతున్న మాటలు విన్న రాధమ్మ నుదిటి మీద బాదుకొంది . అలా బాదుకొని సహాయం చేస్తున్న రెండో కూతురు
యస్సు ని ' నువ్వెళ్ళి చూడు ఫోను ఎవరో ? ' అంది .
యస్సు ని ' నువ్వెళ్ళి చూడు ఫోను ఎవరో ? ' అంది .
ఇది పద్మకి రుచించలేదు . వెంటనే కోపం
తెచ్చుకుంది . పద్మకి కోపం రెండు రకాలు . ఒక రకం సాధారణ కోపం . రెండవది విపరీతమైన కోపం . సాధారణ కోపం వచ్చినపుడు ఆవేశంగా దస్తర్ గుడ్డ తీసుకొని ఇంట్లోని సామాన్లన్నీ దుమ్ము దులిపేస్తుంది . విపరీతమైన కోపం వచ్చినపుడు మనుషుల మీద కూడా దుమ్ము దులిపేస్తుంది . ఇప్పుడు వచ్చినది మామూలు కోపం కనుక మనుషులం బతికి పోయాం . వస్తువులు శుభ్ర పడ్డాయి .
యస్సు వెళ్లి ఫోను అందుకొంది . అవతల వారి మాటలు విన్న యస్సు బదులు ఏమీ మాట్లాడకుండా ' పెళ్లి సన్నాయి ' సైగ చేసింది వాళ్ళ అమ్మ కేసి చూస్తూ .
తెచ్చుకుంది . పద్మకి కోపం రెండు రకాలు . ఒక రకం సాధారణ కోపం . రెండవది విపరీతమైన కోపం . సాధారణ కోపం వచ్చినపుడు ఆవేశంగా దస్తర్ గుడ్డ తీసుకొని ఇంట్లోని సామాన్లన్నీ దుమ్ము దులిపేస్తుంది . విపరీతమైన కోపం వచ్చినపుడు మనుషుల మీద కూడా దుమ్ము దులిపేస్తుంది . ఇప్పుడు వచ్చినది మామూలు కోపం కనుక మనుషులం బతికి పోయాం . వస్తువులు శుభ్ర పడ్డాయి .
యస్సు వెళ్లి ఫోను అందుకొంది . అవతల వారి మాటలు విన్న యస్సు బదులు ఏమీ మాట్లాడకుండా ' పెళ్లి సన్నాయి ' సైగ చేసింది వాళ్ళ అమ్మ కేసి చూస్తూ .
ఇలా సైగ చేయటానికి యస్సు కి కూడా చాలా బలహీనమైన కారణం ఉంది . ఆ మధ్యన ఒహ ప్రవచన ప్రసంగానికి వెడితే ఒక సందర్భంలో 'ఆయుధాలు అక్కరలేదు . ఒక్క మాట తో మనుషులని చంపెయ్య వచ్చు ' అన్నారు బ్రహ్మశ్రీ గారు . ఇది యస్సు మనస్సులో బలం గా నాటుకు పోవడంతో 'అమ్మో! బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది ' అన్న భయం తో రోజులో నిద్ర మినహా మిగతా సమయాల్లో మౌన వ్రతం పాటిస్తూ ఉంటుంది .
సైగల భాష అర్ధం కాక రాధమ్మ ఫోన్ అందుకొంది .
అవతల వైపు నుండి పెళ్లి వారు .
మీ సంబంధం మాకు అన్ని విధాల నచ్చింది . మిగతా విషయాలు కూడా నిశ్చయం చేసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం అని కబురు .
ఈ తీపి కబురు చెప్పాలని వాలు కుర్చీ లో కునుకు తీస్తున్న రామం తో ' పెళ్లి కుదిరింది ' అంది రాధమ్మ .
కళ్ళు నులుపు కుంటూ లేచిన రామం 'ఎవరికీ! ' అన్నాడు విషయం ఏమిటో అర్ధం కాక .
' నా మొహం లా ఉంది . కుమారి పెళ్లి ' అంది
రాధమ్మ .
అప్పటి కి నిద్రమత్తు దిగిన రామం శుభవార్త విని చాలా సంతోషించాడు . కుమారి రామం తమ్ముడు రవణ కుమార్తె . కుమారి పూర్తి పేరు సూర్య కుమారి . తండ్రి లేని పిల్ల కావటంతో రామం , రాధమ్మలు కుమారి వివాహానికి పెద్దరికం , భాధ్యత తీసుకొన్నారు .
...
సూర్య కుమారి పెళ్లి నిశ్చయం ఐపోయింది . ముహూర్తం దగ్గర పడటానికి ఇంకా ఎన్నో రోజులు లేవు .
...
ఆదివారం . ఉదయం కాఫీ టిఫిన్లు కానిచ్చి హాలులో టీవీ ముందు కూర్చున్నాం అందరమూ ' భాగవతం ' సీరియల్ చూద్దామని . ఇంతలో రాధమ్మ తోటికోడలు రమ వచ్చింది పెళ్లి ఏర్పాట్లు చర్చిద్దామని . వస్తూనే కుర్చీ టీవీ స్క్రీన్ కి అడ్డంగా లాక్కొని కూర్చొని
'ఏమిటో ! అక్కయ్యా ! అంతా టెన్షన్ గా ఉంది . బీపీ రైజు అయిపోతోంది . పెళ్లి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలో అర్ధం కాకుండా పోతోంది . మతి పోతోంది అనుకో ' అంది రాధమ్మతో .
'దానిదేముంది అమ్మా ! అంత ఆదుర్దా దేనికీ ! అన్నీ అవే అమరుతాయి . ' అంది రాధమ్మ నింపాదిగా .
టీవీ లో సీరియల్ మాంచి రసపట్టులో ఉంది . టీవీ కి అడ్డంగా కూర్చున్న శాల్తీ ని తప్పించి చూడటానికి మెడలు ఇటూ అటూ వంచి అవస్థలు
పడుతున్నాం . అయితే మా ప్రయత్నాలు ఫలించడం లేదు . మేము మెడలు ఎటు వంచితే అటు కుర్చీ లో శాల్తీ భంగిమ మారుతోంది . పాపం రమ తాపత్రయం మా అందరి వైపూ చూస్తూ మాట్లాడాలని . రమ కి తెలీదు తాను టీవీ కి అడ్డంగా కూర్చొని ఉన్నానని .
'అదికాదు . నాకు అనుభవం లేదు . ఎలాగో నువ్వూ, బావగారూ గట్టేక్కించాలి . కన్యాదానం కూడా మీరే చెయ్యాలి ' అంది రమ . రాధమ్మ మనసు వెన్న లా కరిగి పోయింది రమ అభ్యర్ధనకి . కళ్యాణ మండపాలు , కేటరింగ్ వాళ్ళ నెంబర్లు టెలిఫోన్ లో టక టకా తిప్పి వాళ్ళందరితో ఫోన్లో మాట్లాడి 'పర్వాలేదు . నిశ్చింత గా ఉండు ' అని అభయం ఇచ్చింది తోటి కోడలు
రమ కి .
' అమ్మయ్య ! నా తల మీంచి కొండంత బరువు దించేసావ్ ! ' అక్కయ్యా ! ' అని కుర్చీ లోంచి లేచింది రమ .
మేము కూడా 'హమ్మయ్యా ' అడ్డం లేకుండా సీరియల్ చూడ వచ్చని ఊపిరి పీల్చుకున్నాం . ఇంతలో 'తరువాయి భాగం వచ్చే
వారం ' అని టీవీ స్క్రీన్ మీద కనిపించింది .
సీరియల్ చూస్తానని హాల్లోకి వచ్చి మంచం మీద పడుకున్న అమ్మ యశోదమ్మ నిద్రలో నుండి మేల్కొని ' ఏమయింది ! కంసుడు చచ్చాడా ! '
అంది .
'కంసుడు చావటం కాదు . మెడలు నొప్పెట్టి చస్తున్నాం ' అన్నాం . ఇరుకు పట్టేసిని మెడకి జండూ బాం రాసుకొంటూ .
...
కుమారి పెళ్లి రోజు రానే వచ్చింది . అర్ధరాత్రి దాటేక ముహూర్తం . అమ్మకి అనారోగ్య కారణంగా నేను ఉండిపోయాను . సహాయంగా బుల్లి ,మా ఆఖరి చెల్లెలు, వచ్చింది . బుల్లితో ఒహ తిరకాసు ఉంది . రాత్రి నిద్రపోకుండా టార్చి లైటు పట్టుకొని ప్రతి అయిదు నిమిషాలకీ అన్ని గదులు తిరుగుతూ తలుపులు , గడియలు , కన్నాలు వగైరాల కేసి లైటు వేసి దొంగలు , పాములు లాటివి దూరడానికి ఎట్టి అవకాశాలు లేవని నిర్ధారించు కోవడానికి పహారా డ్యూటీ చేస్తూ వుంటుంది . అప్పుడప్పుడు నిద్రపోతున్న మనుషుల మీద కూడా టార్చి వేసి దొంగలు కాదని అనుమానం నివృత్తి చేసుకుంటూ ఉంటుంది . మధ్యాన్నం మూడు గంటలకి నాకు, బుల్లికి అమ్మ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పి వివాహం జరిపించటానికి వెళ్ళారు రామం ,రాధమ్మ. బంధువులు అందరి తో కలిసి . పెళ్లి తంతుకి కావలసిన సరంజామా అంతా అట్ట పెట్టెలలో సర్దుకొని తీసుకు వెళ్ళారు . వేదిక లకిడి కా పూల్ వద్ద అశోక హోటల్ లోని మ్యారేజ్ ఫంక్షన్ హాలు .
...
సమయం .
రాత్రి ఒంటి గంట దాటింది .
స్థలం . సూర్య కుటీర్ . ఫ్లాట్ నం . 303.
అమ్మకి నిద్ర మాత్ర వేసి నేను నిద్ర పోయాను . బాగా అలసిపోయి ఉండటంతో మొద్దు నిద్ర పట్టింది . ఎవ్వరో తట్టి లేపుతూ ఉంటే మెలుకువ వచ్చింది .
ఎదరగా బుల్లి . కరెంటు లేదు . రాత్రి అంతా పహారా చేయటంతో బుల్లి టార్చి లో చార్జి ఐపోయింది . తట్టి లేపిన బుల్లి రహస్యం చెబుతున్నట్లు 'ఇందాకటి నుంచీ ఎవ్వరో తలుపు తడుతున్నారు .నేను తీయలేదు . ఇప్పుడు ఫోన్ చేసి నేను రమేష్ ని అంటున్నాడు ' అంది . రమేష్ శ్రీలక్ష్మి భర్త . నాకు స్వయానా పిన్ని కుమారుడు . భోపాల్ లో చదివి పెరిగాడు . నేను లేచి తలుపు వద్దకు వెళ్ళబోతూ ఉండగా
'వద్దు . తలుపు తీయొద్దు . హైదరాబాద్ లో ఇలాగే ఇంట్లో వాళ్ళమని చెప్పి దొంగలు దోచేస్తూ ఉంటారు. మాకంతా ఇది మామూలే . రోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం ఇలాటి వార్తలు ' అంది బుల్లి . నేను సందిగ్ధం లో పడ్డాను . కరెంటు పోయింది . చుట్టుపక్కల అంతా చిమ్మ చీకటి . అవసరానికి
టార్చ్ లేదు . అయినా రమేష్ కళ్యాణ వేదిక దగ్గర ఉండాలి గాని ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు ? అన్న ప్రశ్నలు నన్ను నిలవరించాయి .
టార్చ్ లేదు . అయినా రమేష్ కళ్యాణ వేదిక దగ్గర ఉండాలి గాని ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు ? అన్న ప్రశ్నలు నన్ను నిలవరించాయి .
ఇంతలో ' టక్ .. టక్ ' మని తలుపు చప్పుడు . సరే అవతల కటకటాల తలుపుకి తాళం కప్ప వేశాము కదా అన్న ధైర్యం తో మెయిన్ డోర్ తీశా . నిజం గానే రమేష్ కటకటాల తలుపు అవతల నిలుచొని ఉన్నాడు . తాళం తీశి తలుపు తెరిచి ' ఏంటి !
రమేష్ . ఏమయింది ' అని అడిగా .
'జీల కర్రా , బెల్లం ఉంచిన అట్ట పెట్టె గల్లంతు అయింది. ఇంటికి వెళ్లి తెమ్మంది శ్రీలక్ష్మి' అని జవాబు ఇచ్చి తిన్నగా వంటింట్లోకి దూరి పోయాడు రమేష్ .
వంటింట్లో ఇంకా చిమ్మ చీకటి . అస్సలు ఏమీ కనిపించడం లేదు . సెల్ ఫోన్ వెలుగులో డబ్బాలు వెదుకుతున్నాడు రమేష్ . జీల కర్రా , బెల్లం కోసం . మినప పప్పు , కంది పప్పు ,పంచదార ,ఆవాలు వగైరా దొరుకుతున్నాయి గాని జీల కర్రా ,బెల్లం దొరకడం లేదు .
ఇంతలో సెల్ ఫోన్ మ్రోగింది . రమేష్ ఫోన్
స్పీకర్ ఆన్ చేశాడు 'హలో ' అంటూ . అవతలి వైపు నుండి శ్రీలక్ష్మి 'మిలా ' అంది .
స్పీకర్ ఆన్ చేశాడు 'హలో ' అంటూ . అవతలి వైపు నుండి శ్రీలక్ష్మి 'మిలా ' అంది .
'నహీ ' అన్నాడు రమేష్ .
' పోపుల పెట్టె లో ఉంటుంది '
'పోపుల పెట్టీ కహా హై ? '
'గ్యాస్ సిలిండర్ మీద ఉంటుంది '
రమేష్ పోపుల పెట్టె తీశాడు . అందులో ఏ పోపులూ లేవు . వాళ్ళ అమ్మాయి దివ్య దాచుకున్న సుద్ద ముక్కలూ , బొట్టు బిళ్ళలూ , రబ్బరు ముక్కలూ ఉన్నాయి .
'మిలా ' అంది మళ్ళీ శ్రీలక్ష్మి ఫోన్ లో .
'నహీ. పోపుల పెట్టీ మే పోపులూ నహీ హై ' అన్నాడు రమేష్.
'మై ఆవూ ' అంది శ్రీలక్ష్మి .
'ఆకే క్యా కరేగీ ' అన్నాడు రమేష్ .
'అయితే మిక్సీ పైన ఉన్న అల్మారా లో సీసాల్లో ఉంటాయి ' అంది శ్రీలక్ష్మి . అని ' మిలా ' అంది .
'ఠయిరో నా ' అన్నాడు రమేష్ విసుగ్గా . ఒక సీసా లో జీల కర్ర లాంటి సరకు దొరికింది . 'అమ్మయ్య ' అనుకొని అందులో కొంత కాగితం లో పోసుకొని పొట్లం కట్టుకొంటున్నాడు . అది చూశి నేను
'ఒరేయ్ ! అది జీలకర్ర కాదురా ! వాము ' అన్నా .
'ముఝె క్యా పతా జీలకర్రా క్యా హై? వాము క్యా హై ? ' అన్నాడు రమేష్ . జీలకర్ర బెల్లం వేట
సాగిస్తూ .
'మై ఆవూ ' అంది ఫోన్ లో శ్రీలక్ష్మి .
రమేష్ కి ఓపిక నశించింది . ' తుమ్ ఆకే క్యా కరోగి . జీలకర్ర పైదా కరోగీ క్యా ? అన్నాడు రమేష్ . చివరికి ఒక సీసాలో జీలకర్ర దొరికింది .దానిని కాగితంలోకి ఒంపి వేసుకుంటే చెంచాడు కూడా లేదు .
'మిలా ' అంది శ్రీలక్ష్మి మళ్ళీ ఫోన్ లో .
'హ మిలా . ఆధా చెంచా జీలకర్ర ' అన్నాడు రమేష్ . అని 'బెల్లం కహా పర్ హోగా ? ' అన్నాడు .
'పెద్ద గూట్లో పొడుగు డబ్బాలో ఉంటుంది ' అంది శ్రీలక్ష్మి.
గూట్లో చాలా పొడుగు డబ్బాలే ఉన్నాయి . సరే ఏదో ఒహటి అని ఒక పొడుగు డబ్బా తీసాడు రమేష్. డబ్బా లోనికి చేయి పోనిచ్చాడు . మోచేయి వరకు చెయ్యి డబ్బా లోనికి పోయింది కాని బెల్లం తగల్లేదు .
గూట్లో చాలా పొడుగు డబ్బాలే ఉన్నాయి . సరే ఏదో ఒహటి అని ఒక పొడుగు డబ్బా తీసాడు రమేష్. డబ్బా లోనికి చేయి పోనిచ్చాడు . మోచేయి వరకు చెయ్యి డబ్బా లోనికి పోయింది కాని బెల్లం తగల్లేదు .
'మిలా ' అంది శ్రీలక్ష్మి .
'నహీ'
'మై ఆవూ '
'ఆవూ నహీ దూడా నహీ . తుమ్ వహీ రహో 'అన్నాడు రమేష్ విసుగెత్తి . చివరకు ఒక డబ్బాలో చిన్న గులక రాయి అంత బెల్లం ముక్క దొరికింది . చాల్లే అనుకోని జీలకర్రా , బెల్లం మూట కట్టుకొన్నాడు రమేష్ .
'మిలా ' అంది శ్రీలక్ష్మి . 'హ మిలా ' అని ' వస్తా ' అని బయలుదేరాడు రమేష్ . ఇంత లో కరెంటు వచ్చి దీపాలు వెలిగాయి . రమేష్ హాల్లోకి వచ్చి బయటకు వెళ్ళడానికి తలుపు తీసాడు .
ఆశ్చర్యం ! కటకటాల గేటు అవతల శ్రీలక్ష్మి .
'ఆప్ కబ్ ఆయే ' అన్నాడు రమేష్ శ్రీలక్ష్మిని చూశి . స్వచ్చమైన భోపాల్ హిందీ భాష లో .
' నీ వెనకనే బండి వేసుకొని వచ్చిన ' అంది శ్రీలక్ష్మి .
'ఫిర్ అందర్ క్యూ నహీ ఆయే ? ' అన్నాడు రమేష్ .
'ఇదేంటి మల్ల . నువ్వే కదా ఆవూ లేదు . దూడా లేదు . ఇక్కడే ఉండ మని చెప్త . లొల్లి చేస్తున్న వేంది మరి ' అంది శ్రీలక్ష్మి .
'చలో చలో వహ పరేషాన్ హోతే హోంగే 'అన్నాడు రమేష్ . ఇంతలో బుల్లి కల్పించుకొని 'బయటి నుండి నాకు మాటలు వినిపించాయి . తలుపు కూడా రెండు మూడు సార్లు తట్టడం వినిపించింది . అయితే ఆడ దొంగలు అని తీయలే . హి ... హి ... హి ' అంది .
రమేష్ , శ్రీలక్ష్మి బుల్లి వైపు త్రీవ్రంగా చూసి క్రిందకు దిగి పోయారు .
అప్పుడు టెలిఫోన్ మ్రోగింది . ఈ సారి నిజంగా దొంగల ముఠా అని బుల్లి మొహం మీంచి దుప్పటి లాగేసు కొని మునగదీసుకొని పడుకొంది . ఫోన్ ఎత్తాను . 'హలో ' అంటూ రాధమ్మ .
'రమేష్ , శ్రీలక్ష్మి ఇంకా ఉన్నారా ! ' జీలకర్రా బెల్లం అట్టపెట్టెలు దొరికాయి . వచ్చెయ్యమను ' అంది రాధమ్మ .
అప్పుడు టెలిఫోన్ మ్రోగింది . ఈ సారి నిజంగా దొంగల ముఠా అని బుల్లి మొహం మీంచి దుప్పటి లాగేసు కొని మునగదీసుకొని పడుకొంది . ఫోన్ ఎత్తాను . 'హలో ' అంటూ రాధమ్మ .
'రమేష్ , శ్రీలక్ష్మి ఇంకా ఉన్నారా ! ' జీలకర్రా బెల్లం అట్టపెట్టెలు దొరికాయి . వచ్చెయ్యమను ' అంది రాధమ్మ .
...
సూర్యకుమారి పెళ్లి ఫెళ్ళున జరిగి పోయింది .
రమ కి బిపి తగ్గి పోయింది .
కన్యా దానం చేశిన రామం , రాధమ్మ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు .
బుల్లి టార్చ్ వేసి తిరుగుతూ ఉంది .
పద్మ టీవీ సీరియల్ ' గయ్యాళి అత్త -గోవు లాంటి కోడలు ' మూడు వందల ఎపిసోడ్లు ముగించికొని ఇంకా సాగుతూనే ఉంది జీళ్ళ పాకంలా .
యస్సు మౌన వ్రతం నిరాటంకంగా సాగుతోంది .
రమేష్ , శ్రీలక్ష్మి హిందీ - తెలుగు డైలాగులు మాట్లాడుకుంటున్నారు .
వయసు మీద పడటంతో ఈ మధ్యన రామం గారి ఆరోగ్యం బావుంటం లేదు . రామం , రాధమ్మ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా , ఆనందంగా ఉండాలని ఆ కోదండ రాములవారినీ సీతమ్మ తల్లినీ ప్రార్ధిస్తూ .......
సుందరో సుందరో రామః సుందరే సుందరీ కధాః
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనమ్
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం: కపి :
సుందరే సుందరం మంత్రం సుందరం కిం న సుందరమ్
...
శుభం .
ఆనందో బ్రహ్మః
_____________________________________________________
situation comedy సృష్టించడంలో P.G Wodehouse సిద్ధహస్తులు . వారి జాడలో ఈ ప్రయత్నం .
______________________________________________________
______________________________________________________
No comments:
Post a Comment