శ్రీ వేంకటాచల వైభవం .
ద్వితీయ భాగం -02
ద్వితీయ భాగం -02
జరిగిన కధ : వంటిమామిడి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వర స్వామి వారల కళ్యాణ ఉత్సవాలు తిలకించడానికి భార్య బిడ్డ తో వస్తాడు పవన్ . పవన్ చిన కృష్ణమూర్తి గారి మనవడు . కళ్యాణ ఉత్సవాలకి వచ్చిన బంధు మిత్రులు చంద్రుడుగారి యింట్లో చిన్న నాటి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా యర్రమిల్లి వంశ మూల పురుషులు శ్రీ వేంకటాచలం గారి గురించీ ,శివాలయ చరిత్ర గురించీ వాళ్ళ తరానికి చెప్పమని చంద్రుడుగారి అబ్బాయిని అడుగుతాడు . అందరి కోరిక మేరకు చెప్పడం ప్రారంభిస్తాడు చంద్రుడుగారి అబ్బాయి . .........
ఇక చదవండి .
పాశర్లపూడి లంక .
గోదారి అలల్లో వజ్రపు మెరుపులా తళుక్కు మంటున్న నీరెండ . అద్భుతమైన వాతావరణం .
చుట్టూ గలగలా గోదారి . లంక గ్రామాలు . పల్లె ప్రజలు . గోదాట్లో ఇసక మేటలు . గోదారి మీంచి వచ్చే గాలికి ఉత్సాహంగా తలలు ఊపుతున్నకొబ్బరిచెట్లు . అంతా పచ్చదనం . ప్రకృతి తివాచీ పరచినట్లు .
గోదావరిలో తెరచాప నావల కదలికలు .జాలర్ల వేట.
ప్రకృతి అందాన్ని కాస్సేపు ఆస్వాదించిన యర్రమిల్లి
వేంకటాచలం గారు గోదాట్లోకి దిగి సాయంసంధ్య ఆచరించి నది నుండి గట్టు మీదకు వచ్చి దర్భాసనం వేసుకొని వేదం వల్లె వేసుకుంటున్నారు . ఆయన నిత్యం ఉదయం ,సాయింత్రం క్రమం తప్పకుండా ఆచరించే కార్యక్రమం ఇది.
యర్రమిల్లి వేంకటాచలం గారి పూర్వీకులది పాసర్లపూడి లంక . తరతరాలుగా గ్రామ కరణీకం యర్రమిల్లి వంశస్తులదే . కుటుంబానికి చెందిన పూర్వార్జిత స్థిరాస్తులు పాసర్లపూడి లంక చుట్టు ప్రక్కల ఉన్నాయి .
అప్పటికి గోదావరి నది మీద ఆనకట్ట కట్టబడలేదు . వరద వచ్చినప్పుడు గోదారి గంగ ఉగ్ర రూపం దాల్చి లంక గ్రామాలన్నీ ముంచెత్తేసేది . వరద తగ్గిన తర్వాత అందంగా హొయలు పోతూ ప్రశాంతంగా ప్రవహించేది . వరద నియంత్రణ లేక పోవటంతో పంట రాబడి అంతంత మాత్రమే . కాటన్ దొరగారు వేల మైళ్ళు సర్వే చేసి గోదావరికి అడ్డుగా ఆనకట్ట నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్న రోజులు అవి.
...
"కాఫీ టిపిన్లకి రమ్మంటున్నారు పెదనాన్నా "అంటూ వచ్చింది యర్రమిల్లి ప్రకాశరావు గారి అమ్మాయి రాజా . "సరేనమ్మా !" అని బదులు యిచ్చి "పదండిరా .
తిరిగి వచ్చాక చెప్పుకుందాం ."అన్నాడు చంద్రుడుగారి అబ్బాయి . కాఫీ టిఫిన్లు ముగుంచుకొని వచ్చాక తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు చంద్రుడుగారి అబ్బాయి .
...
వేంకటాచలం గారిది సనాతన సాంప్రదాయ కుటుంబం . వేదం లో చెప్పబడినది ప్రామాణికంగా నమ్మి తు . చ . ఆచరించే జీవనం ఆయనది . అప్పటికి ఆయన వయసు పాతిక ఏళ్ళ ఫై మాటే . వేదశాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యాసించి ,వేదాలని అనుష్టించి సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించి జీవిస్తున్న వ్యక్తీ . వేద శాస్త్రాల్లో నిష్ణాతుడు . కంచు కంఠం లాంటి స్వరం . ఆయన వేదపఠనం చేస్తూ ఉంటే ఆయన కంఠం నుండి వెలువడే వేద ప్రకంపనలకి ముక్కోటి దేవతలు ఆశ్వీరదిస్తున్నారా అన్నట్లు ఉండేది వాతావరణం . వేంకటాచలంగారు రుద్రం పారాయణ చేస్తే సాక్షాత్ పరమశివుడు కైలాసంలో తాండవం చేస్తున్నాడా అన్నట్లు అనిపించేది . అటువంటి అనుభవం చాలా మందికి కలిగేది అప్పట్లో .
నిత్యం వేద పారాయణం ,గోదారి ఒడ్డున సంధ్యావందనం ,ఈశ్వర భక్తితో గడిచి పోతున్న జీవితం వేంకటాచలం గారిది . అందుకు తగ్గట్టు అనుకూలవతి ,సనాతన ధర్మాన్ని గౌరవించే భార్య సహకారంతో ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిచిపోతున్న సమయంలో వచ్చి పడింది ఓ పిడుగు లాటి తాఖీదు .
(ఇంకా ఉంది . తరువాయి తృతీయ భాగం లో . వచ్చే వారం .వేచి చూడండి . )

1 comment:
It is so exciting to learn about our illustrious ancestor. Thank you for taking the trouble to detail his story for our benefit.
Post a Comment