శ్రీ వేంకటాచల వైభవం
ప్రధమ భాగం -01
మాఘమాసం .... చలి కొంచం తగ్గుముఖం పడుతున్న రొజులు.
అప్పటివరకూ నిస్తేజంగా మత్తులో జోగుతున్న వంటిమామిడి అగ్రహారం ఒక్కసారిగా నిద్ర లేచింది . సింహం జూలు విదిల్చినట్లుగా . కారణం . ప్రతి సంవత్సరం మాఘ శుద్ధః ఏకాదశి నుండి మాఘ శుద్ధః పౌర్ణమి వరకూ అగ్రహారంలో వేంచేసి ఉన్న
శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వర స్వామి వారల కళ్యాణ ఉత్సవాలు .
బ్రాహ్మణ వీధి . శివాలయానికి దారి . అంతా బంధు మిత్రుల సందడి . కోలాహలం . అగ్రహారం అంతటా పండగ వాతావరణం .
చంద్రుడు గారి ఇల్లు కళ్యాణ ఉత్సవాలకి వచ్చిన బంధుమిత్రులతో నిండిపోయి పూర్ణ గర్భిణిలా నిండు గోదారిలా ఉంది . చాన్నాళ్ళ తర్వాత కలుసుకున్న కుటుంబ పరివారం పలకరింతలు ,చిన్ననాటి ముచ్చట్లు ,అలనాటి వైభావాలు గుర్తు చేసుకుంటున్న వేళ .....
"ప్రతిష్ట బ్యాచీ వేరూ ! కల్యాణం బ్యాచీ వేరూ అన్న మాట " అంది మాగాపు కామేశ్వరి యాదాలాపంగా. ఇంటికి వచ్చిన చుట్టాలకి కాఫీ ,పలహారాలు "శివాలిక్ హోం " నుండి అటుగా తీసుకొని వెడుతూ .
హైదరాబాదు నుండి వచ్చిన చిన కృష్ణమూర్తి గారి అమ్మాయి మహాలక్ష్మి మరుసటిరోజు అమ్మవారికి జరిగే లక్ష కుంకుమార్చన కోసం పట్నం నుండి తెచ్చిన బంతి ,చామంతి పూలు దారంతో గుచ్చుతూ పూల మాలలు చేస్తున్నదల్లా మాగాపు కామేశ్వరి అన్న మాట విని "అదేంటిరా ! తమ్ముడూ !అలా అంటుంది కామేశ్వరీ "అంది చంద్రుడుగారి అబ్బాయితో తెగ బాధపడిపోతూ .
"పోనీ లెద్దూ "అన్న చంద్రుడు గారి అబ్బాయి సమాధానం విన్న తర్వాత మాలలు
గుచ్చటంలో మునిగిపోయింది మహాలక్ష్మి .
......
ఈ మధ్యనే వివాహం చేసుకొని బిడ్డకు తండ్రి అయిన చిన కృష్ణమూర్తి గారి మనవడు పవన్ దేవుని కళ్యాణ వైభోగం చూపించడానికి భార్య బిడ్డతో వచ్చాడు ఈసారి .
చంద్రుడుగారింట్లో ఆరుబయట వాకలి . అందరూ వాకిట్లో కూర్చొని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ....
"మన వంశ కూటస్థులు వేంకటాచలం గారి గురించీ , మన శివాలయం చరిత్ర గురించీ నీకు బాగా తెలుసు అని వీరంతా అంటున్నారు . మాకు కూడా తెలుసుకోవాలని ఉంది . చెబుతావా పెదనాన్నా "అన్నాడు పవన్ చంద్రుడుగారి అబ్బాయితో .
"అలాగే !తప్పకుండా !. ఇది తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్ని రెండు వందల సంవత్సరాలు వెనక్కి తిరగ వెయ్యాలి .ఆసక్తిగా వింటారా మరి" అన్నాడుచంద్రుడుగారి అబ్బాయి .
"భేషుగ్గా వింటాం " అన్నారు అందరూ ముక్త కంఠంతో .
అమ్మవారినీ , స్వామివారిని , పిత్రుదేవతలని మనస్సులో తలచుకొని చెప్పడం ప్రారంభించాడు చంద్రుడుగారి అబ్బాయి .
( ఇంకా ఉంది .తరువాయి ద్వితీయ భాగంలో. వచ్చే వారం )
శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వర స్వామి వారల కళ్యాణ ఉత్సవాలు .
బ్రాహ్మణ వీధి . శివాలయానికి దారి . అంతా బంధు మిత్రుల సందడి . కోలాహలం . అగ్రహారం అంతటా పండగ వాతావరణం .
"ప్రతిష్ట బ్యాచీ వేరూ ! కల్యాణం బ్యాచీ వేరూ అన్న మాట " అంది మాగాపు కామేశ్వరి యాదాలాపంగా. ఇంటికి వచ్చిన చుట్టాలకి కాఫీ ,పలహారాలు "శివాలిక్ హోం " నుండి అటుగా తీసుకొని వెడుతూ .
హైదరాబాదు నుండి వచ్చిన చిన కృష్ణమూర్తి గారి అమ్మాయి మహాలక్ష్మి మరుసటిరోజు అమ్మవారికి జరిగే లక్ష కుంకుమార్చన కోసం పట్నం నుండి తెచ్చిన బంతి ,చామంతి పూలు దారంతో గుచ్చుతూ పూల మాలలు చేస్తున్నదల్లా మాగాపు కామేశ్వరి అన్న మాట విని "అదేంటిరా ! తమ్ముడూ !అలా అంటుంది కామేశ్వరీ "అంది చంద్రుడుగారి అబ్బాయితో తెగ బాధపడిపోతూ .
"పోనీ లెద్దూ "అన్న చంద్రుడు గారి అబ్బాయి సమాధానం విన్న తర్వాత మాలలు
గుచ్చటంలో మునిగిపోయింది మహాలక్ష్మి .
......
ఈ మధ్యనే వివాహం చేసుకొని బిడ్డకు తండ్రి అయిన చిన కృష్ణమూర్తి గారి మనవడు పవన్ దేవుని కళ్యాణ వైభోగం చూపించడానికి భార్య బిడ్డతో వచ్చాడు ఈసారి .
చంద్రుడుగారింట్లో ఆరుబయట వాకలి . అందరూ వాకిట్లో కూర్చొని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ....
"మన వంశ కూటస్థులు వేంకటాచలం గారి గురించీ , మన శివాలయం చరిత్ర గురించీ నీకు బాగా తెలుసు అని వీరంతా అంటున్నారు . మాకు కూడా తెలుసుకోవాలని ఉంది . చెబుతావా పెదనాన్నా "అన్నాడు పవన్ చంద్రుడుగారి అబ్బాయితో .
"అలాగే !తప్పకుండా !. ఇది తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్ని రెండు వందల సంవత్సరాలు వెనక్కి తిరగ వెయ్యాలి .ఆసక్తిగా వింటారా మరి" అన్నాడుచంద్రుడుగారి అబ్బాయి .
"భేషుగ్గా వింటాం " అన్నారు అందరూ ముక్త కంఠంతో .
అమ్మవారినీ , స్వామివారిని , పిత్రుదేవతలని మనస్సులో తలచుకొని చెప్పడం ప్రారంభించాడు చంద్రుడుగారి అబ్బాయి .
( ఇంకా ఉంది .తరువాయి ద్వితీయ భాగంలో. వచ్చే వారం )
1 comment:
Beautiful intro, Jagatpatigaru!
Post a Comment