జాతస్య హి ధృవో మృత్యు : ధృవం .
Theme Sketch By Baby Aanya, California, USA.
******************************************************
కామనగరువు అగ్రహారం లోని దీక్షితులు గారంటే పరిసర పాతిక గ్రామాలలో తెలియనివారు ఎవరూ ఉండరు . అగ్రహారం ప్రముఖులలో దీక్షితులు ఒకరు . సంపన్నులు. భూస్వామి .
పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమించిన ఈ కనిపించే అయిదు ఎకరాల కొబ్బరి తోట , సిరుల పంటలు పండించే
పాతిక ఎకరాల మాగాణి భూమి ఆయన సొంతం.
...
దీక్షితులు చిన్నతనంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఇంటి పట్టున ఉండటం అరుదు గా ఉండేది . ఒక్కగా నొక్కడైన సంతానం అలా చెడు సావాసాలు , చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉండటంతో చయనులు గారు ఎంతగానో మధన పడేవారు . తాను అభ్యసించిన వేద శాస్త్రాన్ని వారసత్వంగా కుమారునికి అప్పగించాలని ఆయన కోరిక . అయితే దీక్షితులు ఆ విషయంలో ఎట్టి ఆసక్తి చూపకపోవడంతో నిరాశే ఎదురయ్యింది చయనులు గారికి . ఎంతగా చెప్పి చూసినా దీక్షితులు లో మార్పు రాలేదు . వివాహం జరిపిస్తే కుమారుడు దిశ మార్చుకుంటాడని భావించి దీక్షితులుకి ఇరవై సంవత్సరాలు నిండగానే సలక్షణమైన సంబంధం చూసి వివాహం జరిపించారు చయనులు .
...
దీక్షితులు గారి భార్య మహాలక్ష్మి .
మహాతల్లి .
సంస్కారం , సద్గుణం ఆమె పుట్టింటి నుండి తెచ్చుకొన్న సారె .
నేలతల్లి కి ఉన్నంత ఓర్పు , సహనం , క్షమ మహాలక్ష్మి సంపద .
ఉదయం లేవగానే కాల కృత్యాదులు ముగించు కొని , స్నానమాచరించి , తొమ్మిది గజాల పట్టుచీర కచ్చపోసి మడిగా కట్టుకొని, పెరడులో ఉన్న తులసికోట లోని తులశమ్మకు దీపం వెలిగించి, సూర్య నమస్కారాలు ఆచరించి ఆ తర్వాత ఇంటి పనులలో మునగడం మహాలక్ష్మమ్మ దైనందిన చర్య .
...
మహాలక్ష్మి వచ్చిన వేళా విశేషమో మరి ఏమో గాని దీక్షితులు లో మార్పు వచ్చింది . అది గమనించిన చయనులు గారు చాలా సంతోషించారు . ఒక రోజు చయనులు గారు సాయం సంధ్య వార్చుకుంటూ ఉండగా దీక్షితులు వచ్చి తండ్రి పక్కన కూర్చొని ' నాన్నా ! నేను వేదం అభ్యసిస్తాను .. నేర్పండి ' అన్నాడు .
కుమారుని అభ్యర్ధన విన్న చయనులు గారు ' ఇది కలయా ! నిజమా ! ' అన్న సంభ్రమకు గురి అయ్యారు .
దీక్షితులు కేసి చూసారు చయనులు .
దీక్షితులు మొహంలో పట్టుదల కనిపించింది .
చయనులు గారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఆ రోజున .
తన విద్యను అంది పుచ్చుకొని వేద శాస్త్రాన్ని వారసత్వంగా నలుగురికీ బోధించి , వ్యాపింప చేయడానికి వారసుడి నిర్ణయం ఆరోజు చయనులు గారిని నిద్రకు దూరం చేసింది .
...
మంచి ముహూర్తం నిర్ణయించి చయనులు గారు దీక్షితులుకి అభ్యాసం ప్రారంభించారు .
ముందుగా స్వరం , పంచాయతనం , స్మార్తం, నేర్పించి తదుపరి వేద శాస్త్రాలు క్రమంలో ఒక్కొక్కటీ నేర్పసాగారు . తండ్రి గారి వద్దనుండి క్షుణ్ణంగా వేదాలు ఆభ్యసించాలన్న పట్టుదలతో ఉన్న దీక్షితులు ఒక్కొక్కటి ఒడిసి పట్టుకుంటున్నాడు . అలా అభ్యాసం నాలుగు సంవత్సరాలు గడిచింది . దీక్షితులుకి ఇరవై నాలుగు సంవత్సరాలు నిండేసరికి అధ్యయనం పూర్తి అయింది . నిష్ణాతుడైన కుమారుడు దీక్షితులుని చూసి
చయనులు గారు గర్వపడ్డారు .
...
కాలం గడిచి పోతోంది . కాల గమనంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి .
వయసు మీద పడటంతో చయనులు గారు కాలం
చేశారు .
ఇప్పుడు దీక్షితులు గారి వృత్తి వ్యవసాయం .
ప్రవృత్తి వేద శాస్త్రాలు అభ్యసించాలన్న అభిలాష గల బ్రహ్మచారులకు ఉచితంగా నేర్పడం .
అప్పట్లో బ్రాహ్మణ కుటుంబాలలో మగ పిల్లలకి ఏడు నుండి పదకొండు సంవత్సరాల వయసు లో ఉపనయనం కావించి బ్రహ్మ చర్యం ఆపాదించే వారు . శాస్త్ర రీత్యా అప్పట్లో అట్టి వారే బ్రహ్మచారులుగా లోకంలో
గుర్తింపు .
...
తండ్రిగారు కాలం చేసిన కొంత కాలానికి ఉచిత వేద పాఠశాల ప్రారంభించారు దీక్షితులు . అగ్రహారం లోని చురుకైన మెరికల్లాంటి పిల్లలని చేరదీసి వారికి ఆయన స్వయంగా ఉపనయనం గావించి , యజ్ఞోపవీత ధారణ చేసి పాఠాలు నేర్పడం మొదలుపెట్టారు . దీక్షితులు గారి ఇంటి ప్రాంగణం ప్రతి నిత్యం బ్రహ్మి ముహూర్తంలో పాఠశాల విద్యార్థులు గురువు తో పఠించే వేద మంత్రాల ఉచ్చారణ తో ఆలోక్యమైన వాతావరణంతో శోభిల్లితోంది .
మహాలక్ష్మమ్మ తన ధర్మం పాటిస్తూ దీక్షితులు గారికి తన వంతు సహాయం అందిస్తోంది .
కర్తవ్య నిర్వ్హణలో భాగంగా .
...
మాధవుడు దీక్షితులు గారి ప్రియ శిష్యుడు . దీక్షితులుగారి ఇల్లే గురుకులంగా మనసా ,వాచా భావించి గురు శుశ్రూషలు చేస్తూ విద్యని అభ్యసిస్తున్న మాధవుడు మీద మహాలక్షమ్మకి కూడా ప్రేమ , అభిమానం .ఆవిధంగా మాధవుడు దీక్షితులు గారి కుటుంబంలో కలసి పోయాడు .
...
దీక్షితులు గారితో వివాహం జరిగిన కొన్నాళ్ళకు ఆయన లో ఒక వింత ప్రవర్తన గమనించింది మహాలక్ష్మి . అది ఆమెకు కొంత ఆశ్చర్యం కలిగించినా ఏనాడూ భర్తని ప్రశ్నించలేదు . దీక్షితులు ప్రతి నిత్యం రాత్రి భోజనానంతరం దుస్తులు వేసుకొని ఉత్తరీయం భుజాన్న వేసుకొని బయటకు వెళ్లిపోయే వాడు . అలా వెళ్లిన ఆయన మూడవ ఝామున తిరిగి వచ్చి తన దైనందిన కార్యక్రమంలో మునిగిపోయేవాడు . ఇక తీరుబడి ఉండేది కాదు . రోజులు గడిచి పోతున్నాయి . మహాలక్ష్మి భర్త ప్రవర్తనకి కొంచెం మొదట్లో ఆశ్చర్య పడినా తర్వాత అలవాటు పడిపోయింది . చయనులు గారు మరణించిన తర్వాత ఈ విషయం ఆమెను మనసులో గుచ్చుకున్న ముల్లు లా బాధపెడుతోంది .
అది ఏమిటో శోధించాలనుకొంది మహాలక్ష్మమ్మ .
ఒకరోజు .
దీక్షితులు గారు యధావిధిగా రాత్రి బయటకు వెళ్లగా రహస్యంగా ఆయనను వెనకాలే అనుసరించింది మహాలక్ష్మమ్మ .
అప్పటికి అగ్రహారంలో ఇంకా కరంటు వెలుగులు రాలేదు .
చీకటి రాత్రులు .
కటిక చీకటి .
ఆకాశంలోని నక్షత్రాల వెలుగు తప్ప మరో వెలుగు లేదు .
అంతటా అంధకారం .
అంతటా అంధకారం .
అగ్రహారం పూర్తిగా ఆదమరచి నిద్రలో మునిగిపోయిన వేళ.
అంతటా నిర్మానుష్యంగా ఉంది .
దూరంగా వీధి కుక్కలు అక్కడా అక్కడా మొరుగుతున్నాయి .
ముందుగా దీక్షితులు గారు, ఆ వెనుక మహాలక్ష్మమ్మ సాగిపోతున్నారు . ఒకరికి తెలియకుండా మరి ఒకరు . ఆ చీకటిలో .
అలా సాగిన దీక్షితులు గారు అగ్రహారానికి కాస్త దూరంగా ఉన్న దళితవాడలో ప్రవేశించారు .
వెనకాలే అనుసరిస్తున్న మహాలక్ష్మమ్మ దీక్షితులు గారు దళితవాడలోకి ప్రవేశించగానే చకితురాలైంది .
దళితవాడలో దీక్షితులు గారికి ఈ సమయంలో ఏమి పని అయి ఉంటుంది అని ఆశ్చర్య పోయింది .
దీక్షితులు గారు దళిత వాడలోని ఓ పూరి గుడిసె ముందు ఆగారు.
లోనుండి కోడిగుడ్డు దీపంతో ఓ ప్రౌఢ స్త్రీ వచ్చి దీక్షితులు గారిని సాదరంగా లోనికి తీసుకొని వెళ్ళింది .
చాటు నుండి అంతా గమనించిన మహాలక్ష్మమ్మ తన కళ్ళను నమ్మలేక పోయింది .
ఆ దృశ్యం చూసిన మహాలక్ష్మమ్మ గుండె పగిలిపోయింది .
కీచురాళ్లు శబ్దం చేస్తున్నాయి .
విచలితమైన మనస్సుతో గిర్రున వెనక్కి తిరిగిన మహాలక్ష్మమ్మ నిస్తేజంగా ఇల్లు చేరుకొంది .
...
ఇంటికి చేరిన మహాలక్ష్మమ్మ శరీరానికి పట్టిన స్వేదం తుండుతో తుడుచుకొంది . తుడుచుకొని వాలు కుర్చీలో కూలబడింది . దాహం వేసినట్లనిపిస్తే లేచి కుండలోని నీళ్లు గళాసు లో నింపి త్రాగింది . అప్పటి గాని తేరుకోలేదు మహాలక్ష్మమ్మ . ఆమె లో ఆలోచనలు కందిరీగలలా రొద చేస్తున్నాయి . ఆ సమయంలో ఆమెకు తన వివాహ వేడుకల ఘట్టం గుర్తుకు వచ్చింది .
మాంగల్యం తంతునానేన
మమ జీవన హేతునా
కంఠే బంధనామి శుభాగే త్వం
జీవ శారద శతం .
అన్న మంత్రోచ్చారణతో , మంగళ వాయిద్యాల నేపథ్యంలో తన మెడలో మూడు ముళ్ళు వేసి మాంగళ్య సూత్ర ధారణ చేసిన దీక్షితులు గారు మెదిలారు . మాంగళ్య సూత్ర ధారణ అనంతరం భర్త చిటికెన వేలు పట్టుకొని అగ్నిహోత్రం సాక్షిగా ఏడడుగులు వేసిన సప్తపది " 1. పరస్పరం అండగా నిలబడటానికి 2. జీవితాంతం స్నేహితులుగా మిగిలిపోవటానికి 3. ఇరువురు ఏకమై శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకోవటానికి 4. నిరంతరం సహజీవనం సాగించటానికి 5. . సంపదను పరిరక్షించుకోవడానికి 6. సంతానాన్ని సంరక్షించుకోవడానికి 7. సుఖదుఃఖాలను పంచుకోవటానికి" పరమార్ధం గుర్తుకు రాగా దుఃఖం ముంచుకు వచ్చేసింది . తనవి తీరా ఏడ్చేసింది మహాలక్ష్మమ్మ . అలా ఏడ్చిన తర్వాత ఆమె మనసు కాస్త కుదుట పడింది . ఈ ప్రస్తావన దీక్షితులు గారి ముందు తీసుకు రాకూడదు అన్న ధృడ నిర్ణయానికి వచ్చింది . తన అంతరంగ వ్యక్తులచే వాకబు చేయించి ఆ స్త్రీ " చంద్రావతి " అని తెలుసుకుంది మహాలక్ష్మమ్మ . జీవితంలో మొట్ట మొదటిసారిగా దీక్షితులు గారంటే జుగుప్స కలిగింది మహాలక్షమ్మకి .
...
ఇది జరిగిన తర్వాత జీవితం మామూలుగా సాగిపోతోంది .. దీక్షితులు గారు వ్వ్యవసాయం . వేద పాఠశాల నిర్వహణ కార్య కలాపాలతో అనునిత్యం తీరుబడి లేకుండా ఉన్నారు. మహాలక్ష్మమ్మ సహధర్మ చారిణిగా తన కర్తవ్యం మునుపటిలానే చిరు నవ్వుతో నిర్వహిస్తోంది . మాధవుడు గురువు , గురుపత్ని శుశ్రూషలు చేస్తూ వేదశాస్త్ర అధ్యయనం లో ముందుకు దూసుకు పోతున్నాడు .
..
ఒకనాడు .
రోజువారీ భౌతిక కర్మలు ముగించుకొని అపరాహ్ణ వేళ భోజనానికి కూర్చొని
పరీషం పట్టిన దీక్షితులుగారు హఠాత్తుగా విరుచుకు నేలమీద పడిపోయారు గుండె నొప్పి రావటంతో . ఈ పరిణామానికి కంగారు పడిన మహాలక్ష్మమ్మ అగ్రహారంలో ఆయుర్వేద వైద్యులు ఆచారి గారిని పిలిపించి తక్షణ వైద్యం చేయించి ఆ తర్వాత పట్టణంలో వైద్యం చేయించింది . అనారోగ్యం పాలైన దీక్షితులు గారు ఇదివరలా మసల లేకపోవటం జరిగింది . ఆ తరవాత రోజు రోజు కీ దీక్షితులు గారి ఆరోగ్యం క్షీణించ సాగింది . ఈ భూమి పై తనకి అట్టే రోజులు లేవన్న విషయం దీక్షితులు గారికి తెలిసిపోయింది .
...
మంచం మీద అవసాన స్థితి లో ఉన్న దీక్షితులు గారు ఒక సాయింత్రం ' మహాలక్ష్మీ ' అని భార్యను పిలిచి ఒక దస్త్రం ఆమె చేతికి ఇచ్చారు .అది ఆయన స్వంత దస్తూరీ తో భార్యకు వ్రాసిన లేఖ. లేఖ భార్యకి ఇచ్చిన తర్వాత దీక్షితులు గారు వేద మంత్రాలు ఆశువుగా పఠించ సాగారు . ఆయన నోటి నుండి శ్రీ రుద్ర నమకం అలవోకగా వెలువడుతోంది . బలహీనంగా ఉన్నా ఆయన కంఠం నుండి వెలువడుతున్న స్వరం గంభీరంగా కంచు గంటలా మ్రోగుతోంది .
నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే ఆస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః
యా త ఇషుశివతమా శివం బభూవ తే ధను :
శివా శరవ్యాయా తవ త యా నో రుద్ర మృడయ
ఇలా జాలువారుతోంది శ్రీ రుద్ర పారాయణం .
...
దీక్షితులు గారు ఇచ్చిన లేఖ తీసుకొని వసారాలో కూర్చొని
చదువుకొంది మహాలక్ష్మి . ఆసాంతం చదివాక ఆమె నిగ్రహించుకోలేక పోయింది . వేదాన్ని ప్రామాణికం గా భావించిన తన భర్తనా అనుమానించింది అన్న భావన ఆమెను నిలువెల్లా దహించినట్లు అనిపించింది . వెంటనే నూతి వద్దకు వెళ్లి నాలుగు చేదలు తలారా పోసుకుంది. తనువూ ,మనసూ శుద్ధి చేసుకున్నట్లు అనిపించింది ఆమెకు . భర్త పడుకున్న మంచం వద్దకు వచ్చింది మహాలక్ష్మమ్మ . దీక్షితులు గారి రుద్ర స్తుతి అనర్గళంగా సాగిపోతోంది . భర్త వంక చూసింది మహాలక్ష్మమ్మ . ఆయన మొహం లో అనిర్వచనీయమైన ప్రశాంతత . కాస్సేపటికి దీక్షితులు గారి స్వరం బలహీనపడింది .
కొన్ని ఘడియలు గడిచాక దీక్షితులు గారి స్వరం మూగపోయింది .
ఆయన శరీరంలోంచి చిలక ఎగిరిపోయింది అన్న విషయాన్ని గ్రహించింది మహాలక్ష్మమ్మ .
దీక్షితులు గారు నిశ్చలం గా పడి ఉన్నారు మంచం మీద.
ఆయన కళ్ళు పత్తి కాయల్లా విచ్చుకొని ఉన్నాయి .
అలా విచ్చుకొని ఉన్న కళ్ళను అరచేతితో సున్నితంగా మూసింది మహాలక్ష్మమ్మ .
ఆ తర్వాత ఏమి చేయాలో ఆమెకు తోచడంలేదు .
దీక్షితులు గారి పార్థివ శరీరానికి ఉత్తర క్రియలు ఎలా చేయాలో అన్న ఆలోచనలో పడింది .
అప్పటికి రెండు ఝాముల రాత్రి గడిచిపోయింది .
దీక్షితులు గారు ఇచ్చిన దస్త్రం మరోసారి చదువు కొంది మహాలక్ష్మమ్మ .
దాని సారాంశం ఇది .
మహాలక్ష్మి తో వివాహం జరగక పూర్వం యవ్వనంలో చెడు సావాసాలతో రికామీగా తిరిగిన దీక్షితులుకి కామనగరువు అగ్రహారానికి అరవై మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూరిలో ఉంటున్న చంద్రావతితో పరిచయం ఏర్పడింది . ఆ పరిచయం శారీరిక సంబంధానికి దారి తీసింది . కొన్నాళ్ళు చంద్రావతి తో వాంఛలు తీర్చుకున్నాక మోజు తీరి ఆమెను మరచి పోయాడు దీక్షితులు . ఒకరోజు రాత్రి పట్నం నుండి చంద్రావతి నివసిస్తున్న పల్లెటూరు మీదగా తిరిగి వస్తూ ఉండగా ఊర చెరువు వద్ద ఉన్న మర్రి చెట్టు క్రింద ఒక ఆడ మనిషి లీలగా కనిపించింది . దగ్గరసా వెళ్లి చూసిన దీక్షితులుకి ఆమె చెట్టుకి ఉరి వేసుకొని ప్రాణం తీసుకొనే ప్రయత్నంలో కనిపించింది .
' ఏంటమ్మా! ఎందుకమ్మా ! ఈ అఘాయిత్యం ' అని ప్రశ్నించిన దీక్షితులు వైపు చూసింది ఆమె .
ఆమెను చూసిన దీక్షితులు నిర్ఘాంతపోయాడు .
ఆమె చంద్రావతి .
బలవన్మరణ ప్రయత్నానికి కారణం ఆడిగితే అప్పుడు చెప్పింది చంద్రావతి .
తాను గర్భవతిని అని . పెళ్లి కాకుండా గర్భవతి అని వాడలో తెలిస్తే పెద్దలు పంచాయతీ పెట్టి తనను , దానికి కారకులైన దీక్షితులునీ దారుణంగా శిక్షిస్తారని , ఈ విషయం వాడలో పొక్కక ముందే దీక్షితులు పరువు కాపాడటానికి గర్భంలో ఉన్న పసి బిడ్డతో సహా ఆత్మహత్యే శరణ్యం అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది . అది విన్న దీక్షితులు ఆలోచనలో పడ్డాడు . దీక్షితులు లో మానవత్వం మేలుకొంది . తన మూలంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం ధర్మం కాదనిపించింది . చంద్రావతిని అక్కున చేర్చుకొని 'నీకు అన్యాయం జరగదు' అని అభయమిచ్చాడు . తర్వాత చంద్రావతి మెడలో పసుపు కొమ్ము కట్టాడు . కొన్ని నెలల తర్వాత చంద్రావతి కి మగ బిడ్డ జన్మించాడు . అతడే మాధవుడు . మాధువుడిని దీక్షితులు గారు ప్రారంభించిన ఉచిత వేద పాఠశాల లో చేర్పించి అగ్రహారం లోని దళిత వాడ లో స్థిర పడిపోయింది చంద్రావతి . ప్రతీ రోజు రాత్రి తాను బయటికి వెళ్లడం చంద్రావతి రక్షణ కోసమే గాని కామానురక్తి కోసం కాదని వేదం సాక్షిగా చెప్పబడింది ఆ లేఖలో .
చివర గా ' నన్ను క్షమించు మహాలక్ష్మీ' అని వేడుకోలు . "
మహాలక్ష్మి తో వివాహం జరగక పూర్వం యవ్వనంలో చెడు సావాసాలతో రికామీగా తిరిగిన దీక్షితులుకి కామనగరువు అగ్రహారానికి అరవై మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూరిలో ఉంటున్న చంద్రావతితో పరిచయం ఏర్పడింది . ఆ పరిచయం శారీరిక సంబంధానికి దారి తీసింది . కొన్నాళ్ళు చంద్రావతి తో వాంఛలు తీర్చుకున్నాక మోజు తీరి ఆమెను మరచి పోయాడు దీక్షితులు . ఒకరోజు రాత్రి పట్నం నుండి చంద్రావతి నివసిస్తున్న పల్లెటూరు మీదగా తిరిగి వస్తూ ఉండగా ఊర చెరువు వద్ద ఉన్న మర్రి చెట్టు క్రింద ఒక ఆడ మనిషి లీలగా కనిపించింది . దగ్గరసా వెళ్లి చూసిన దీక్షితులుకి ఆమె చెట్టుకి ఉరి వేసుకొని ప్రాణం తీసుకొనే ప్రయత్నంలో కనిపించింది .
' ఏంటమ్మా! ఎందుకమ్మా ! ఈ అఘాయిత్యం ' అని ప్రశ్నించిన దీక్షితులు వైపు చూసింది ఆమె .
ఆమెను చూసిన దీక్షితులు నిర్ఘాంతపోయాడు .
ఆమె చంద్రావతి .
బలవన్మరణ ప్రయత్నానికి కారణం ఆడిగితే అప్పుడు చెప్పింది చంద్రావతి .
తాను గర్భవతిని అని . పెళ్లి కాకుండా గర్భవతి అని వాడలో తెలిస్తే పెద్దలు పంచాయతీ పెట్టి తనను , దానికి కారకులైన దీక్షితులునీ దారుణంగా శిక్షిస్తారని , ఈ విషయం వాడలో పొక్కక ముందే దీక్షితులు పరువు కాపాడటానికి గర్భంలో ఉన్న పసి బిడ్డతో సహా ఆత్మహత్యే శరణ్యం అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది . అది విన్న దీక్షితులు ఆలోచనలో పడ్డాడు . దీక్షితులు లో మానవత్వం మేలుకొంది . తన మూలంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం ధర్మం కాదనిపించింది . చంద్రావతిని అక్కున చేర్చుకొని 'నీకు అన్యాయం జరగదు' అని అభయమిచ్చాడు . తర్వాత చంద్రావతి మెడలో పసుపు కొమ్ము కట్టాడు . కొన్ని నెలల తర్వాత చంద్రావతి కి మగ బిడ్డ జన్మించాడు . అతడే మాధవుడు . మాధువుడిని దీక్షితులు గారు ప్రారంభించిన ఉచిత వేద పాఠశాల లో చేర్పించి అగ్రహారం లోని దళిత వాడ లో స్థిర పడిపోయింది చంద్రావతి . ప్రతీ రోజు రాత్రి తాను బయటికి వెళ్లడం చంద్రావతి రక్షణ కోసమే గాని కామానురక్తి కోసం కాదని వేదం సాక్షిగా చెప్పబడింది ఆ లేఖలో .
చివర గా ' నన్ను క్షమించు మహాలక్ష్మీ' అని వేడుకోలు . "
...
ఆలోచనలలో మునిగిపోయిన మహాలక్ష్మమ్మ తూర్పున వెలుగు రేఖలు చూసి కార్య రంగంలోకి దిగింది . బ్రాహ్మణులను పిలిపించి దీక్షితులుగారికి కర్మ కాండలు జరిపే కార్యక్రమం ఏర్పాట్లు చేసింది .
అగ్రహారం దీక్షితులు గారి గారి ఆకస్మిక మరణ వార్తను జీర్ణించుకోలేక పోయింది . తండోప తండాలుగా వచ్చి ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు .
మాధవుడుచే మహాలక్ష్మమ్మ దీక్షితులు గారి పార్థివ శరీరానికి ఉత్తర క్రియలు జరిపించింది .
కైలాస వాటికలో దీక్షితులు గారి ఉత్తరక్రియలు భక్తి శ్రద్దలతో చేస్తున్న మాధవుడిని దూరంగా చెట్టు నీడలో నిలబడి ఓ వ్యకి చూస్తోంది.
ఆమె కళ్ళు నదీ ప్రవాహంలా వర్షిస్తున్నాయి .
ఆమే చంద్రావతి .
ఈ ఘటన తర్వాత చంద్రావతి అగ్రహారంలో మరి కనిపించలేదు .
ఇప్పుడు దీక్షితులు గారు ప్రారంభించిన వేద పాఠశాల ని మాధవుడు నిర్వహిస్తున్నాడు
********************************************************
జాతస్య హి ధ్రువో మృత్యు : ధృవం మృతస్య చ
తస్మాద పరిహార్యే ర్థే న త్వం శోచితుమర్హసి
భగవద్గీత ( అధ్యాయం -2 27 వ శ్లోకం )
పుట్టిన వానికి మరణం తప్పదు మరియు మరణం పిదప జన్మము తప్పదు . కావున అనివార్యమైన నీ విధ్యుక్త ధర్మ నిర్వాహణము నందు నీవు శోకింపతగదు .
Death ends a life not a relationship. So many people walk around with a meaningless life . They seem half asleep ,even when they are busy doing things they think are important . This is because they are chasing wrong things. The way you get meaning into your life is to devout yourself to loving others. The truth is ,once you learn how to die , you learn how to live. Love Wins. Love always Wins.
చంద్రుడు గారి అబ్బాయి .
********************************************************
5 comments:
సూటిగా సాగిపోయింది కధ.దళిత కుటుంబంలో పుట్టిన అబ్బాయి తండ్రి ఉత్తరక్రియలు నిర్వహించడం విప్లవాత్మకం.
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు .
My dear Jagatpati:
Thanks for sharing your latest short story with me.
What struck me most on my first reading of the story is how you have evoked the long cherished Brahmin traditions with the slokas, customs and other vagaries in an authentic manner in your story. I am familiar with the slokam:
మాంగల్యం తంతునానేన
మమ జీవన హేతునా
కంఠే బంధనామి శుభాగే త్వం
జీవ శారద శతం
but it has been a long time since I have read and enjoyed the classical Telugu terms like మాగాణి, ఘనాపాటి, అధ్యయనం, యజ్ఞోపవీతం, I appreciate and applaud your generous use of such expressions in a story that has an agraharam setting to begin with. They have a ring of the Brahmin life unfolding before us.
Some four years ago I translated a Tamil story into Telugu - it is more than a story, really novella and posted it on my website as స్పటికం with. Its author a pen name Maharishi is in his late eighties and still around in Salem. I had read his story in India in 1969 and had to wait until 2011 to personally approach him through a friend and get his verbal permission to translate. I have translated into English as well as in Telugu. You can read it here:
http://kurinjipubs.com/MAHARISHI_TELUGU.pdf
I am eagerly looking forward to seeing you during my visit to Vizag next month.
Please convey my regards to your wife and others.
Regards, Rangan
P.S. I would also like to include this story in my website. What do you say?
The above is the communication I received from my school and college mate Shri Rangan who is now settled in US.
Dear Rangan ,
I felt elated on your reaction to my story. It is a wonderful feeling.
Thank you so much.
Rajappa comment pasted below:
" Blog is very interesting
I say this way...
Once We know how to live,...Death comes beautifully...like Deekshitulu Garu.
"We dropping the body is Meditation..
Body dropping us is Death."
Raja.
Post a Comment