ఎరుపు అంచు ....
నీలం రంగు జరీ చీర .
****************
సూర్యోదయం అయి రెండుగంటలు కావస్తోంది .
ఉదయాన్నే ఏదో మీటింగ్ ఉందని హడావుడిగా బయలుదేరి వెళిపోయాడు రఘురాం . భర్తను పంపించి పక్క మీద వాలిపోయిన విశాలాక్షి కి తెలియకుండానే రెప్పలు మూతపడ్డాయి . నిద్ర కమ్ముకొచ్చేసింది . కిటికీ లోంచి పడుతున్న ఉదయపు వేళ ఎండ చురుక్కు అన్పించి నిద్ర తేలి పోయింది విశాలాక్షికి .
ఇంకా బద్దకం వీడలేదు . వంటిల్లు , డైనింగ్ టేబుల్, అంట్ల గిన్నెలు ,ప్లేట్లతో నిండిపోయి ఉన్నాయి . శుభ్రం చేసుకోవాలి అన్న తలంపు రాగానే శరీరమంతా నిస్సత్తువ , నీరసం ఆవహించింది .
'రఘురాం ఎప్పుడూ ఇంతే ! ఏ పనిలోనూ కాస్త సాయం చెయ్యడు . అయినా తనకు ఇదేం కొత్తా ! పెళ్లి అయిన దగ్గిర నుంచీ ఇదే వరస ' అనుకొంది విశాలాక్షి .
వొళ్ళు విరుచుకొని బద్దకాన్ని వదిలించుకొన్న
విశాలాక్షి రోజువారీ ఇంటి పనిలో పడింది .
రఘురాం లంచ్ కి రానని చెప్పి వెళ్ళాడు . ఇక మిగిలింది తను ఒక్కర్తే . వంటకి పెద్ద ప్రయత్నం అక్కరలేదు . రాత్రి మిగిలిన పదార్ధాలు రెఫ్రిజిరేటరు లో ఎలానూ ఉన్నాయి . వాటితో కానిచ్చేయొచ్చు అని మిగతా పనులలో పడిపోయింది . ఇల్లంతా శుభ్రం చేసేసరికి సూరీడు నడి నెత్తి మీద ఉన్నాడు . స్నానం ముగించి తనకి ఇష్టమైన ఎరుపు అంచు ఉన్న నీలం రంగు చీర కట్టుకొని సోఫా లో కూలబడింది .
...
ఈ చీర అంటే తనకి చాలా ఇష్టం . బజారు నుంచి కొనుక్కొని వచ్చీ రాగానే కట్టుకొని కుచ్చిళ్ళు సర్దుకుంటూ ' ఎలా వుంది కట్టుకొంటే ఈ చీర ' అని రఘురాం ని అడిగితే నిరాశే ఎదురయ్యింది . కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకుంటున్న రఘురాం ఒకసారి ఎగా దిగా చూసి తిరిగి పనిలో మునిగి పోయాడు . మెచ్చుకుంటాడని ఆశించిన విశాలాక్షి భర్త స్పందనకి విసురుగా వెళ్లిపోయింది.
...
సోఫాలో కూలబడిన విశాలాక్షి టీవీ రిమోట్ చేతిలోకి తీసుకొని స్విచ్ ఆన్ చేసింది అప్రయత్నంగా . టీవీ లో షాపింగ్ జోన్ ఛానల్ లో అందమయిన అమ్మాయి అదేపనిగా వారి వస్తువుల గురించి అదర గొట్టేస్తోంది . బోర్ అనిపించి టీవీ కట్టేసింది విశాలాక్షి .
...
సోఫాలో వాలిపోయిన విశాలాక్షి సాలెగూడులా మనసునిండా అల్లుకున్న గత స్మృతులను నెమరు వేసుకుంది . అసంతృప్తి తప్పించి ఏ భావమూ
కలుగలేదు . చిన్నతనంలో భావి జీవితం గురించి తాను ఎన్ని తీపి కలలు కంది . ఆ క్రమంలో బాల్యం గుర్తుకు వచ్చింది . తాను ఒక్కర్తే సంతానం కావటం వల్ల ఎంతో మురిపెంగా పెంచారు తల్లితండ్రులు , తాను ఆడిందే ఆట. పాడిందే పాట . చలాకీగా ఊరంతా తిరిగేది స్నేహితురాళ్ళతో కలిసి . తాను కోరకుండానే ఏ వయసులో కావలసిన సంప్రదాయ వస్త్రాలు , వస్తువులు ఆ వయసుకి తగ్గట్టు అమర్చి పెట్టేవారు తల్లితండ్రులు . ఓణీ లంగాల వయసు వచ్చేక బామ్మ తో కలిసి శ్రావణ , ఆశ్వీయుజ ,కార్తీకమాసాల లో ఊర్లో గుడిలో లో జరిగే కార్యక్రమాలకు విధిగా వెళ్ళేది . గుళ్లో సాయంత్రం వేళ జరిగే పురాణ ప్రవచనాలలో " రుక్మిణీ కళ్యాణం " , "సత్యభామా పరిణయం ", " శ్రీ కృష్ణ తులాభారం " అంటే తనకు చాలా ఇష్టం . అవి వింటూ ఉంటే మనసు పరవశించి పోయేది . ఎదో ఒకనాడు శ్రీ కృష్ణ పరమాత్ముని వంటి వాడు అకస్మాత్తు గా వచ్చి తనను ఎత్తుకొనిపోయి పరిణయమాడుతాడని కలలు కనేది . మనసులో మాట బామ్మకి చెపితే ' నీకేమి తక్కువే ! మేలిమి బంగారం ఛాయ. చిదిమి దీపం పెట్టుకోవచ్చు . ' అని బుగ్గలు పుణికి పుచ్చుకొని నుదిటి మీద ముద్దు పెట్టేది . ఇలా కలలు కంటూ ఉండగానే కాలం తెలియకుండా డిగ్రీ చదువు పూర్తి అయిపొయింది . ఈ మధ్య కాలంలో తన స్నేహితురాళ్లు చాలా మంది వివాహాలు చేసుకొని స్థిర పడిపోయారు . ఒకసారి తన ప్రియ మిత్రురాలు ఉమ కలిస్తే ' ఉమా ! ఎలా వుందే వివాహ జీవితం ? ' అని అడిగింది .
' నువ్వూ త్వరగా మూడు ముళ్ళూ వేయించుకో ! అప్పుడు నీకే తెలుస్తుంది ' అంది ఉమ మహా సిగ్గు పడిపోయి .
' మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా ! ' అడిగింది విశాలాక్షి .
' నన్ను వదిలి ఉండలేడనుకో ! రెండ్రోజులు అయ్యింది అమ్మా వాళ్ళ వద్దకు వచ్చి . అప్పుడే కబురు . తిరిగి రమ్మని .' అంది వయ్యారాలు ఒలికిస్తూ . అలా అని తుర్రుమని పారిపోయింది ఉమ పని ఉందంటూ .
ఉమ తో సంభాషణ అనంతరం విశాలాక్షి మనసు వివాహం మీదికి మళ్లింది . ఊహల్లో మన్మధుడి లాంటి వరుడు మెదిలాడు . ఇంటిలో ఎవ్వరూ పెళ్లి మాట ప్రసక్తి తేవటం లేదు . ఈ మధ్యన ఎల్లప్పుడూ ఆలోచనలతో పరాకుగా ఉన్న మనమరాలిని చూశి ప్రశ్నించించింది బామ్మ .
' ఏమి టే ! అమ్మడూ ! పెళ్లి కొడుకుని చూడమంటావా ! అని .
' ఫో ! బామ్మా ! ' అని తుర్రున పారిపోయింది తను .
లోకాన్ని తరచి చూసిన అనుభవం బామ్మది . మనవరాలి మనసు గ్రహించిన బామ్మ కొడుకు తో అంది ఇలా ' పెళ్లీడు కొచ్చిన కూతురి గురించి ఆలోచించావా ! మంచి సంబంధం చూడు . వివాహం జరిపిద్దాం . '
' అలాగే అమ్మా ! ' అన్న తండ్రి మాట విన్న విశాలాక్షి గదిలో గంతులేసింది .
అటుగా పని మీద వచ్చిన తల్లి ' దీనికి ఇంకా అల్లరీ , చిన్నతనం పోలేదు ' అనుకొంది మనసులో
బామ్మ పట్టుదలో లేక తండ్రి ప్రయత్నాలో తెలియదు గాని త్వరగానే మంచి సంభంధం కుదిరింది విశాలాక్షికి .బాగా ఆస్తిపాస్తులు పెద్ద చదువు , ఉద్యోగం ఉన్న సంబంధం నిశ్చయమైంది . వరుడు రఘురాం రంగు కాస్త నలుపు అయినా మంచి కళ గల మొహం , నిండైన విగ్రహం . అట్టహాసంగా వివాహం జరిగింది . తల వంచి మూడు ముళ్ళు వేయించుకున్న విశాలాక్షి గెండెల మీద గిలిగింతలుపెడుతున్న మంగళ సూత్రాలు చూసి మురిసిపోయింది .
బామ్మ ' అదేమిటే ! అమ్మడూ .. మీ ఆయన మరీ ఛాయ తక్కువగా ఉన్నాడు ' అంది చిలిపిగా .
' నీలి మేఘ శ్యాముడు ' అంది తను గర్వంగా .
' అలాగా ' అంది బామ్మ .
' అవును . వెంకట రమణ మూర్తి . వేంకటేశ్వరస్వామి విగ్రహం నలుపు అయినా చూడు ఎంత కళ కళ లాడిపోతూ వుంటాడో స్వామీ ' అంది తను సమర్ధించుకొంటూ .
'ఆసి భడవా ! మాడు ముళ్ళూ పడగానే ఎంత ఎదిగిపోయావే ' అంది బామ్మ .
...
అందరిలానే తనూ కాపురానికి వెళ్ళింది . అందరికీ వివాహ జీవితం స్వర్గం లా అనిపిస్తే తనకు కొన్ని రోజుల తర్వాత ఎందుకో భిన్నంగా అనిపించింది . ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా త్రుళ్ళి పడే తన మనస్తత్వానికి పూర్తిగా భిన్నం రఘురాం .
రఘురాం మిత భాషి . అందరితో కలిసిపోయే తత్త్వం కాదు . ఎప్పుడూ తన లోకంలో ఉంటాడు . అలాగని చెడ్డవాడేమీ కాదు . తను ఏది కోరితే అది సమకూర్చేవాడు . సంపదకు లోటు లేదు . సౌకర్యాలకు కొదవ లేదు . లేనిదల్లా కలివిడి . కొంతకాలానికి విశాలాక్షి కి తామిద్దరం విభిన్న ధృవాలమని అర్థమైపోయింది . ఉత్తర ధృవం , దక్షిణ ధృవం కలవడం అసాధ్యమని తేలిపోయింది . జీవితంలో చాలా మాధుర్యాన్ని ఊహించుకున్న విశాలాక్షి కి అది ఎండమావిలా అనిపించ సాగింది .
ఒకసారి పుట్టింటికి వెళ్ళినపుడు కళ కోల్పోయిన తనని చూసి బామ్మ అడిగింది . ' అమ్మడూ ! ఏమంటాడే మీ ఆయన . బాగా చూసుకుంటాడా !'. అని .
' బాగానే చూసుకుంటాడు బామ్మా ! ' అంది తను నిర్లిప్తంగా.
'మరి ' అంది బామ్మ .
' ఓ సరదా లేదూ ! పాడూ లేదూ ! బంధువుల ఇళ్లకు గాని స్నేహితులను కలుద్దామని గాని , పెళ్లిళ్లకు ,రిసెప్షన్ లకు గాని వెళ్లి వద్దామంటే " నువ్వు వెళ్లి వచ్చ్చేయ్యి . డ్రైవర్ తో చెప్తాను కారులో తీసుకువెళ్లి రమ్మని " అంటాడు . ఎప్పుడైనా బలవంతం చేస్తే కూడా వచ్చి ఓమూలన చింతపండు మూట లా కూర్చుండి పోతాడు . ఎవరైనా పలకరిస్తే క్లుప్త సరి జవాబు చెప్పి అసౌకర్యంగా ఫీల్ అవుతాడు . అలాటి సందర్భాలలో ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంటుంది నాకు.మన ఇంటిలో అటక మీద మూలన నువ్వు పారేసిన మొద్దు రాచ్చిప్ప గుర్తుకు వస్తుంది . ' అంది విశాలాక్షి .
' నలుగురిలో మొహమాటం ఏమోనే! ' అని సమర్ధించింది బామ్మ .
...
నిస్సారంగా కాలం గడిచిపోతోంది . యాంత్రికంగా జరిగిపోతోంది . ఇద్దరు ఆడ పిల్లలు కలిగారు . వారి పాలన , పెంపకం, చదువులు అన్నే తన మీదే వేసుకొంది విశాలాక్షి . రఘురాం ఏ నాడు కలుగచేసుకోలేదు . పిల్లలు పెరిగి పెళ్లి ఈడు రాగానే వారి వివాహాలు కూడా తానే జరిపించి అత్తవారింటికి పంపింది విశాలాక్షి . భార్యా భర్తల మధ్య బాధ్యతల సంయమన లోపం ఎంత అసంతృప్తికి గురి చేస్తుందో అనుభవం లోకి వచ్చింది విశాలాక్షికి .
...
పిల్లలు వెళ్లిపోయిన తర్వాత ' ఇద్దరమే మిగిలాం శొంఠి కొమ్ముల్లా " అనుకొంది విశాలాక్షి .
ఒక రోజు నిలువు టద్దంలో చూసుకుంటే తల ముగ్గు బుట్టలా కనిపించింది .
'అబ్బా ! ఎంత కాలం గడిచి పోయింది . ఏ అనుభూతులు లేకుండా ! ' అనిపించింది . బాధ్యతలు తీరిన తర్వాత తన జీవితంలో ఇన్నాళ్లూ కోల్పోయిన సంతోషాన్ని పాత స్నేహాలని పునరుద్ధరించుకొని వెదుక్కోవాలనుకొంది విశాలాక్షి . ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే చిన్నతనం కాలం నాటి స్నేహితురాళ్ళు కొంతమంది దొరికారు .
ఇప్పుడు విశాలాక్షి కి రెక్కలు వచ్చినట్లు అనిపించింది . వారితో కాలక్షేపం బాగానే జరిగిపోతోంది . రఘురాం కి లంచ్ అమర్చి టేబుల్ మీద పెట్టి నెల నెలా స్నేహితురాళ్ళతో కలిసి కిట్టీ పార్టీలకు వెడుతోంది . రఘురాం ఎటువంటి అభ్యంతరమూ చెప్పలేదు . ఎప్పిటి లాగానే . అలా కాలక్షేపం జరిగిపోతోంది .
...
గత స్మృతుల నుండి బయటపడిన విశాలాక్షి దృష్టి ఎదర గోడమీద ఉన్న గడియారం మీద పడింది . టైం రెండు గంటలు చూపిస్తోంది గడియారం . ' ఆమ్మో ' అని లేచిన విశాలాక్షి లంచ్ చేసి కాస్త కునుకు తీద్దామని పడక గదిలోకి వెళుతూ ఉండగా సెల్ ఫోన్ మ్రోగింది .
ఎవరూ ! ఈ టైం లో అని చూస్తే రఘురాం .
' హలొ ' అంది విశాలాక్షి .
'నేనే ' అన్నాడు రఘురాం అటువైపునుండి .
' పొద్దున్న హడావుడిలో ముఖ్యమైన ఫైల్ మర్చిపోయాను.ఆఫీస్ బాయ్ వస్తాడు . ఇచ్చి పంపించు ' అని గోడతో మాట్లాడినట్లు మాట్లాడి ఫోన్ పెట్టేసాడు రఘురాం .
కాసేపట్లో ఆఫీస్ బాయ్ వస్తే ఫైల్ ఇచ్చి పంపించింది విశాలాక్షి . అప్పుడు ఫైల్ తీస్తూ ఉండగా రఘురాం డైరీ జారి క్రింద నేల మీద పడింది . ఆ డైరీ తాను ఎప్పుడూ చూడలేదు . తిరిగి అల్మారాలో పెడదామని నేల మీద నుండి డైరీ తీస్తూ ఉండగా డైరీ లోని కొన్ని పేజీలు దృష్టి లో పడ్డాయి అసంకల్పితంగా . అందులో కొన్ని చోట్ల తన పేరు చూసి విస్మయం చెందింది విశాలాక్షి . ఎంత భర్త అయినా పర్సనల్ డైరీ చదవడం సంస్కారం కాదని అనిపించినా ఉత్కంఠ ఆపుకోలేక పోయింది విశాలాక్షి .
పక్క మీద వాలి రఘురాం డైరీ చదవటం మొదలుపెట్టింది.
ఆసాంతం డైరీ చదివాక విశాలాక్షి కి కన్నీరు ఆగలేదు . గుండెల మీద ఆచ్చాదనగా పరుచుకున్న చీర కన్నీటికి తడిసి ముద్దయి పోయింది . రఘురాం తన మీద హృదయంలో పదిలపరచుకొన్న ప్రేమ , అనురాగం, తెలుసుకొన్న విశాలాక్షి విస్తుపోయింది . ఇన్నాళ్లూ ఈ విషయం ఎలా గుర్తించలేకపోయిందో అర్థం కాలేదు .
లోపం ఎక్కడ ఉందొ తెలుసుందామని గతం తరచి స్మరించుకుంటే అప్పుడు స్ఫురించింది .
అహం ,మనసులు విప్పి మాట్లాడుకోకపోవడమే
కారణం అని .
పొద్దు పోయింది ' రఘురాం ఇంకా ఇంటికి రాలేదేమిటీ ' అని కంగారు పడుతూ ఉండగా డోర్ బెల్ మ్రోగింది .
తలుపు తెరిచి చూస్తే రఘురాం .
ఇంట్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు రఘురాం అలసిపోయినట్లుగా .
ఇన్నాళ్లూ ' కాఫీ కలిపి టేబుల్ మీద పెట్టాను ' అని తన గదిలోకి వెళ్లిపోయే విశాలాక్షి ఈసారి అలా చేయలేదు .
కాఫీ కప్పు రఘురాం చేతికి అందించింది ఆప్యాయంగా .
భార్య కళ్ళలోకి చూసాడు రఘురాం .
'ఆలస్యమయింది దేనికి' అంది విశాలాక్షి .
' ఆఫీస్ పని ముగిశాక రవీంద్ర భారతి లో " భారతీయ వివాహ సంస్కృతీ - సీతా రాముల దాంపత్యం " గురించి ప్రవచనం ఉందని స్నేహితులు బలవంతం చేస్తే వెళ్లాను . ప్రవచనం విన్నాక ఇన్నాళ్లూ ఏమి కోల్పోయానో తెలిసింది . నన్ను క్షమించు విశాలీ . నీ మనసు తెలిసికోలేక పోయినందుకు . ' అని బ్రీఫ్ కేసు నుండి ఒక గిఫ్ట్ ప్యాక్ చేసిన అట్ట పెట్టి అందించాడు రఘురాం విశాలాక్షికి .
భర్త చర్యకి ఆశ్చర్యపోయింది విశాలాక్షి .
ఆతృతగా విప్పి చూసింది .
ఎరుపు అంచు నీలం రంగు జరీ చీర .
అందలం ఎక్కినంత సంబరం కలిగింది విశాలాక్షికి .
క్షణంలో చీర మార్చుకొని వచ్చింది విశాలాక్షి .
ఎరుపు అంచు నీలం రంగు జరీ చీరలో దేవతలా కనిపించింది విశాలాక్షి రఘురాం కళ్ళకి .
ఆప్యాయంగా భుజాల మీద చేయి వేసి హత్తుకున్నాడు విశాలాక్షిని .
హఠాత్తుగా ఉమ గుర్తుకొచ్చింది విశాలాక్షి కి .
వివాహబంధం లోని మాధుర్యం తెలిసి వస్తోంది నెమ్మదిగా .
ఆ రాత్రి విశాలాక్షి జీవితంలో అమృతం కురిసిన రాత్రి .
...
మనుషుల లోని అహం , ద్వేషం , అసూయ అనే గుణాలే అసురులు .
ఈ రోజు నరక చతుర్దశి .
నరకాసురుడు వధింపబడిన రోజు .
అందరి లోగిళ్ళలో దీపాలు, దివ్వెల కాంతులు వెలిగే దీపావళి మరుసటి రోజే మరి.
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు .
...
*******************************************
ఎన్నోరోజులుగా మదిలో మెదులుతున్న ఈ కధ అంశానికి అక్షర రూపం ఇన్నాళ్ళకి సాధ్యపడింది .
చంద్రుడు గారి అబ్బాయి .
29 th october 2016.

5 comments:
చంద్రుడు గారి అబ్బాయి కథ వెన్నెల లా ఆహ్లాదంగా ఉంది.సుఖాంతంగా ముగిసింది.చాలా బాగుందండీ.
Thanks Sir. I feel glad you liked the story .
Chaala bagundi mavayya.
you are my ardent fan . Good you liked . Wishes and Blessings.
Post a Comment