నమస్సవిత్రే జగదేక చక్షుసే ..
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశ హేతువే
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే
విరంచి నారాయణ శంకరాత్మనే
...
ఆదిత్య హృదయ స్త్రోత్రం లోని ప్రారంభ శ్లోకం ఇది ..
చక్షువు అంటే నేత్రం .
భగవంతుడు సృష్టి లోని సమస్త ప్రాణులకు సృష్టి సౌందర్యాలను దర్శించుటకు ఇచ్చిన అద్భుతమైన అవయవం . జీవరాశులలో ఒక్క జీవికి మాత్రమే ప్రత్యేకమైన వరం ఇచ్చాడు చతుర్ముఖ బ్రహ్మ గారు .
అదే 'మాట ' .
ఆ వరం పొందిన ఏకైక ప్రాణి 'మనిషి '.
భగవంతుడు ఇచ్చిన కనులతో సృష్టి లోని అందాలను , దృశ్యాలను , సప్తవర్ణాలను , ఆత్మ సౌందర్యాన్ని దర్శించుకొని దానిని అందమైన , భావ యుక్తమైన వాక్యాలతో ఇతురులతో పంచుకొని ఆనందించ కలిగే జీవి మనిషి.
' సర్వాంగానాం నయనం ప్రధానం ' అన్నారు పెద్దలు .
మూడు పాతికల వయసు దాటేవరకూ సృష్టిలోని దృశ్యాలను చూశిన మనిషి
పొద్దు పోయే వయసులో కను చూపు హఠాత్తుగా కోల్పోతే ..........

ఇక చదవండి .
...
కుటుంబంలో విషాద సంఘటన జరిగితే కుటుంబ ధర్మాన్ని అనుసరించి హైదరాబాదు వెళ్లాం సీతా, నేనూ .
స్వర్గస్తులైన వ్యక్తి మా బామ్మకి మేనల్లుడూ
నా సోదరి భర్తా .

ఆదివారం .
27 వ తేదీ సెప్టెంబర్ నెల .
2015 సంవత్సరం .
అపర కర్మలు చేయించే బ్రహ్మ గారు సనాతన ధర్మాన్ని అనుసరించి అందరిచే ధర్మోదకాలు కార్యక్రమం జరిపిస్తున్నారు నావంతు వచ్చింది . ధర్మోదకాలు ఇచ్చి స్వర్గస్తుడైన మావయ్యకి తర్పణం వదలి ఈ జన్మ ఋణం తీర్చుకొని శుచి స్నానం ఆచరించి శరీరం శుభ్రపరచుకొని దుస్తులు మార్చుకుందామని అనుకుంటూ ఉండగా జరిగిందీ ఊహించని ఘటన .
ఒక్కసారిగా నా కుడి కంటి నుండి లీలగా వ్యక్తి
రూపంలో వెలుతురు నిష్క్రమిస్తున్న అనుభూతి ..
అంతే . .
లిప్త పాటు సమయంలో కుడి కన్ను
కనిపించటం మానేసింది. కంటి ముందు సాలెగూళ్ళు,
నల్లని మచ్చలు , వివిధ ఆకారాల్లో రూపాలూ
కనిపించాయి కాస్సేపు . ఆ తర్వాత ఏమీ
కనిపించలేదు . మనుసు నిండా భయం , ఆందోళన .
చూపు కోల్పోయిన కంటి నుండి నీటి ధారలు .
సూదులు గుచ్చుకున్నంత బాధ. జరిగిన విషయం
ముందుగా తెలుసుకున్న సీత , రాజప్ప లలో
మాటలలో వర్ణించ లేనంత ఆందోళన నాకు స్పష్టంగా
తెలుస్తోంది . ' మా అందరికీ శ్రీ రామరక్ష లాంటి
నీకు ఇలా జరిగితే ఎలారా ! ' అన్న రాజప్ప
మాటలు నా చెవులలో గింగురుమంటున్నాయి . నైరాశ్యం ముంచుకొస్తోంది .
జరగ వలశిన తంతు జరుగుతోంది.
ఆ రోజు ఆదివారమే కాకుండా అదే రోజు నగరంలో
గణపతి నిమజ్జనం . సుమారు పది లక్షల మంది
జనం వస్తారని అంచనా .
నగరమంతా దారి మళ్లిం పులు , రోడ్డు బ్లాక్స్ హడావుడి .ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కు పోతామేమో అన్న భయం తో గూడు చేరుకున్నాం . చూపు కోల్పోయిన నేనూ , సీతా ,రాజప్ప. ఇంటికి చేరగానే దెయ్యం లాంటి భయంకరమైన సన్ గ్లాసెస్ తెచ్చి నా ముఖానికి తగిలించింది రాజప్ప . నా పరిస్థితి నాకు తెలుస్తూనే ఉంది . మిగిలిన జీవితం మరో మనిషి మీద
ఆధారపడి బతకాలన్న నైరాశ్యం గుండెల నిండా ఆవరించుకుంటోంది . కాస్సేపు విశ్రమించిన
తర్వాత అంతర్జాలంలో నా సమస్య గురించి వెతికితే vitreous haemorrhage అన్న
సమాధానం దొరికింది . దాని గురించి తెలుసుకున్నాక గుండెలు జారిపోయాయి . నా భయం గుండెల్లో నిక్షిప్తం చేసుకోక తప్పలేదు. వెంటనే కజిన్ డా . కృష్ణ కి సమస్య చెప్పి ఎవరైనా
కంటి డాక్టర్ ని సజెస్ట్ చేయమని అడిగితే "దృష్టి
eye సెంటర్ " డా . మధుకర్ రెడ్డి ని కలవమని
సూచించాడు . ఇదే విషయం నాకు రాజమండ్రి లో
ఉన్న కంటి డాక్టర్ గారి తో మాట్లాడి ఆయన సలహా
మీద డా . మధుకర్ రెడ్డి గారిని ఆ మరునాడు
కలవటం జరిగింది.
మరునాడు సోమవారం.
డా . మధుకర్ రెడ్డి గారిని కలిసాం .
నన్ను చేయి పట్టుకొని పసివాడిలా నడిపించి తీసుకొని వెళ్లారు సీతా, రాజప్ప .
డాక్టర్ గారు పరీక్షలు మొదలుపెట్టారు .
మాలో టెన్షన్ మొదలయ్యింది .
సీతా , రాజప్ప ఆత్రుతగా చూస్తున్నారు .
ఫలితం గురించి .
కంటి పరీక్షలు పూర్తి అయ్యాయి .
ఫలితం తేలిపోయింది .
కుడి కన్ను చూపు పూర్తి గా పోయింది .
ఇంకా కంటిలో బ్లీడింగ్ అవుతోంది అనీ రెటినా
స్పెషలిస్ట్ గారిని సంప్రదించమని సలహా ఇచ్చి పంపారు డాక్టర్ గారు.
వెంటనే రాజమండ్రీ లో ఉన్న నా కజిన్ జగన్నాధం
గుర్తుకు వచ్చాడు . జగన్నాధంకి ఫోను చేసి అకీరా కంటి ఆసుపత్రికి కన్సల్టెంట్ రెటీనా స్పెషలిస్ట్
డా. jk . చల్లా గారి వద్ద అప్పాయింట్మెంట్
తీసుకోమని చెప్పా . అలాగే అన్నాడు జగన్నాధం .
సమస్య విని . రాజమండ్రీ ప్రయాణం మంగళవారం రాత్రి గౌతమిలో . రైలుకు బయలు దేరుతూ ఉండగా మా దొడ్డమ్మ కుమార్తె సావిత్రి భావరాజు ఫోను చేసింది . 'ఒరేయ్ తమ్ముడూ ! మాకు పరిచయము ఉన్న ఒకరికి ఇట్లానే జరిగింది . కొన్నాళ్ళకి నయమైంది . అధైర్య పడకు . 'అంది . నాకు
మనో ధైర్యం ,మనోబలం చేకూర్చటానికి సావిత్రి చేశిన
ప్రయత్నం అని నాకు అర్థమైంది . తెల్లారేసరికి రాజమండ్రీ చేరాం . స్నానపానాదులు ముగించుకొని నా కంటి డాక్టర్ , ఫిజిషియన్ , కార్డియాలజిస్ట్ డాక్టర్ల చేత
పరీక్షలు చేయించుకొని మరునాడు జగన్నాధం తో కలిసి Dr. చల్లా గారిని కలిశా . క్షుణ్ణంగా పరీక్షలు చేశిన Dr. చల్లా నా రెండు కళ్ళ రెటీనా లో హోల్స్ ఉన్నాయని ,చూపు రావడానికి 3-4 నెలలు పట్టవచ్చని చెప్పి రెండు కళ్ళకి లేసర్ ట్రీట్మెంట్ చేసారు . ఈ లేసర్ ట్రీట్మెంట్ ఒక గంట సేపు
పట్టింది . చికిత్స కొంత బాధాకరమైనా , భరించక

తప్పలేదు . అ రోజంతా జగన్నాధం నాతో పాటు ఉండి చేయి ఆసరా ఇచ్చి నడిపించి చికిత్స చేయించాడు .
ఈ సహాయానికి జగాన్నాధం ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో ?

అగ్రజుడు జగన్నాధుడు
'తమ్ముడా ' అని పిలువ
తపమేమి చేసితినో
తెలియా ...
ఇది తలుచుకున్నప్పుడల్లా నా కళ్ళు చెమరుస్తున్నాయి.
...
రెండు రోజులు పోయిన తర్వాత సూర్యం మావయ్య
ఫోను . విషయం తెలిసింది ఎలా ఉన్నావ్ ? అని .
బానే ఉన్నా మావయ్యా ! చూపు బానే వచ్చింది అని
చెపితే సంతోష పడిపోయాడు . నాకు ప్లాటినం జూబిలీ జన్మదిన శుభా ఆశీస్సులు తెలిపాడు మావయ్య . కొవ్వూరు వచ్చి నీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను మావయ్యా అంటే నవ్వాడు .
అచ్చం సత్తిరాజు లక్ష్మినారాయణ లా ..
...
సాయింత్రం నాలుగు గంటలు .
స్కూలు బస్సు వచ్చి ఇంటి ముందు ఆగింది ..
స్కూలు బస్సు వచ్చి ఇంటి ముందు ఆగింది ..
అందులోంచి దిగి గేటు తీసుకొని బండెడు పుస్తకాల
బరువు మోసుకుంటూ వచ్చాడు మా సంధ్య రామకృష్ణల సుపుత్రుడు రుషి . మా రాజప్ప ఇచ్చిన దెయ్యం సన్ గ్లాసెస్ ముఖానికి తగిలించుకొని లాను లో పచార్లు చేస్తున్న నన్ను చూశి అవాక్కయ్యాడు . అయి నడుం మీద రెండు చేతులు వేసుకొని
'ఇదేంటి మామయ్య తాతా !
ఈ సన్ గ్లాసెస్ ఏంటి ?
ఈ సన్ గ్లాసెస్ ఏంటి ?
నీ స్టైల్ ఏంటి ?ఛండాలంగా
చూడలేక చస్తున్నాం ! '
అని తుర్రున పారిపోయాడు .
...
మొదటిసారిగా అప్పుడు అనిపించింది .
భగవంతుడు కరుణ చూపిస్తే
వృద్ధాప్యం కూడా మధురమైనది అనీ .
...
సర్వ దుఖోపశాంతాయ సర్వ పాప హరాయచ
సర్వ వ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమః .
...
_____________________________________________________
" కను చూపు పోయినదని దిగులు పడవలదు .
నా కనులు నీవిగా చేసికొని చూడు... "
అని అభయం ఇచ్చి నా మనో ధైర్యాన్ని, ఆత్మ బలాన్ని కోల్పోకుండా క్లిష్ట సమయంలో సాంత్వనం చేకూర్చిన

బంధువులు ,ఆత్మీయులు ,హితులు , స్నేహితులు అందరికీ వందనాలు
సమర్పించుకుంటూ ఈ బ్లాగ్ వారికి అంకితం .
సమర్పించుకుంటూ ఈ బ్లాగ్ వారికి అంకితం .
________________________________________________________