నేల రాలిన పారిజాతం .
కధానిక .
(05)
గత వారం :పర్వతాలు నస్రీన్ బ్యూటీ పార్లర్ లో రిసెప్షన్ డెస్క్ అసిస్టెంట్ . పెద్దగా చదువులేని పర్వతాలు బలహీనత మందు .ఎవరైనా కాస్త మందు పోయిస్తే పర్వతాలు అదుపులో ఉండడు . పర్వతాలు బలహీనత తెలిసిన గెరటబాబు పర్వతాలుకి మందు పట్టించి పారిజాతం వివరాలు సేకరిస్తాడు . ఆ తర్వాత ఫేసుబుక్ లో పారిజాతం ఫ్రెండ్ అవుతాడు గెరటబాబు . ఆ స్నేహం అతి కొద్ది కాలంలోనే చిగురించి సన్నిహితంగా మెలిగే స్థితి కి చేరుకుంటుంది . సినిమా ప్రోగ్రాం నెపంతో పారిజాతంతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు గెరటబాబు . గెరటబాబు ప్రవర్తన నచ్చక థియేటర్ నుంచి హటాత్తుగా వెళిపోతుంది పారిజాతం . ఈ ఘటన జరిగాక పారిజాతాన్ని కలుసుకోవటానికి గెరటబాబు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించవు . .... మిగతా భాగం ఇక చదవండి .
తెల్లవారింది . భానుడి లేత కిరణాలు నగరమంతా విస్తరించుకున్నాయి . నగరం నిద్ర లేచింది .
పేపర్ బాయ్ న్యూస్ పేపర్ రబ్బర్ బాండ్ చుట్టి గిరాటేసి రివ్వున వెళిపోయాడు సైకిల్ మీద . దబ్బున వచ్చి పడింది పేపర్ .
పేపర్ తీసి హెడ్ లైన్స్ చూస్తూ ఉండగా పొగలు కక్కుతున్న కాఫీ తెచ్చి ఇచ్చింది శేషమ్మ .
రాత్రి విశ్వనాధం ఫోనులో రాబోయే పుష్కరాల సమయంలో మా సమావేశానికి చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్ల గురించి చెప్పిన విషయం గుర్తుకి వచ్చి షౌకత్అలీ కి ఫోనులో చెప్పాను .
షౌకత్అలీ ఎంతో సంబరపడిపోయాడు .
'జున్ను కూడా పురమాయించమను' అన్నాడు షౌకత్అలీ ముక్తాయింపుగా .
'నాకు చక్కెర బీమారు కదా ' అన్నా .
'పర్లేదు . గలాసుడు కాకరకాయ రసం తాగుదువు గానిలే ! 'అన్నాడు షౌకత్అలీ నా బీమారు సమస్య తేలికగా తీసుకుంటూ .
తెల్లవారింది . భానుడి లేత కిరణాలు నగరమంతా విస్తరించుకున్నాయి . నగరం నిద్ర లేచింది .
పేపర్ బాయ్ న్యూస్ పేపర్ రబ్బర్ బాండ్ చుట్టి గిరాటేసి రివ్వున వెళిపోయాడు సైకిల్ మీద . దబ్బున వచ్చి పడింది పేపర్ .
పేపర్ తీసి హెడ్ లైన్స్ చూస్తూ ఉండగా పొగలు కక్కుతున్న కాఫీ తెచ్చి ఇచ్చింది శేషమ్మ .
రాత్రి విశ్వనాధం ఫోనులో రాబోయే పుష్కరాల సమయంలో మా సమావేశానికి చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్ల గురించి చెప్పిన విషయం గుర్తుకి వచ్చి షౌకత్అలీ కి ఫోనులో చెప్పాను .
షౌకత్అలీ ఎంతో సంబరపడిపోయాడు .
'జున్ను కూడా పురమాయించమను' అన్నాడు షౌకత్అలీ ముక్తాయింపుగా .
'నాకు చక్కెర బీమారు కదా ' అన్నా .
'పర్లేదు . గలాసుడు కాకరకాయ రసం తాగుదువు గానిలే ! 'అన్నాడు షౌకత్అలీ నా బీమారు సమస్య తేలికగా తీసుకుంటూ .
...
షబ్నం రెండు రోజుల కిందట ప్రాజెక్ట్ పని మీద మూడువారాల పాటు సింగపూర్ వెళ్ళింది . అపార్ట్ మెంట్ లో పారిజాతానికి ఒంటరిగా ఏమీ తోచటంలేదు . బోర్ అనిపించింది షబ్నం తోడు లేక . షాపింగ్ కని బయలుదేరింది పారిజాతం . కాస్త టైం గడుస్తుందని .
...
హైటెక్ సిటీ . ఇన్ఆర్బిట్ మాల్ .
సాయింత్రం ఆరు గంటలు దాటి పోయింది . ఆఫీసు వేళలు ముగియటంతో ఇంటి దారి పట్టే వాహనాలు మెత్తగా దూసుకు పోతున్నాయి నల్లని తారు రోడ్డు మీద . ఆకాశం సప్త వర్ణాల సంధ్య వెలుగులతో రంగులు అద్దిన కాన్వాస్ లా ఉంది . ఇక చీకటి పడబోతోంది అన్న సంకేతంగా . కాస్సేపటికి నగరం అంతటా విద్యుత్ కాంతులు అలుముకున్నాయి .
...
ఇన్ఆర్బిట్ మాల్ లో షాపింగ్ ముగించుకొని టాక్సీ కోసం నిలుచొని ఉంది పారిజాతం. రోడ్డు వారగా ఫుట్ పాత్ మీద. బాణంలా దూసుకుపోతున్న నల్లటి హోండా కారు పారిజాతాన్ని దాటి ఏభై గజాల దూరంలో ఆగింది ..కీచ్ .. మని శబ్దం చేస్తూ . పారిజాతం అన్యమనస్కంగా ఉండటంతో ఇది గమనించలేదు . ఇంతలో ఊహించని విధంగా కాస్త దూరంగా ఆగిన హోండా కారు రివెర్స్ లో వచ్చి పారిజాతం ముందు మెత్తగా ఆగింది . కారు లోంచి ఇద్దరు అగంతకులు కళ్ళు మాత్రమే కనపడేలా ముసుగులేసుకొని దిగారు . ఒకడు చప్పున పారిజాతాన్ని సమీపించి ఆమె ముక్కు కి జేబు రుమాలు లాంటి గుడ్డ అదిమి పెట్టి ఆగి ఉన్న కారు లోకి బలవంతంగా నెట్టి తను కూడా కూర్చొని 'పద'అన్నాడు. డోర్ లాక్ అయింది .ఇది అంతా రెప్పపాటులో జరిగిపోయింది . పారిజాతానికి ఏమి జరుగుతోందో తెలియలేదు . నెమ్మదిగా స్పృహ కోల్పోయింది పారిజాతం .
...
తెల్లవారబోతోంది . రణ గొణ ధ్వనులతో నగరం బద్ధకంగా నిద్ర లేచింది .
స్పృహ లోకి వచ్చిన పారిజాతానికి ఏమి జరిగిందో అర్థం కాలేదు . పరిసరాలను పరికిస్తే తను కొత్తగా నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఉన్నట్లు అర్థమైంది . తన కేసి చూసుకున్న పారిజాతం గుండెల నిండా చేతులు కప్పుకొంది . చుట్టూ చూసింది .
దూరంగా లుంగ చుట్టి పారేసిన తన చీర , లోదుస్తులు కనిపించాయి . ఏమి జరిగిందో అప్పుడు పూర్తిగా అర్థమయింది పారిజాతానికి .
దూరంగా లుంగ చుట్టి పారేసిన తన చీర , లోదుస్తులు కనిపించాయి . ఏమి జరిగిందో అప్పుడు పూర్తిగా అర్థమయింది పారిజాతానికి .
శరీరమంతా తేనెటీగలు కుట్టినట్లుగా బాధ .
దేహం మలినమై పోయిందన్న దుఃఖం మనసంతా కమ్మేసింది .
దుండగులు పొంచి ఉన్నారేమో అని భయం భయంగా ఇటూ అటూ చూస్తూ దుస్తులు కట్టుకొంది .
జరిగిన ఘోరం క్షణం క్షణం గుర్తుకు రాసాగింది .
మాను లా ఉండిపోయింది .
ఆ మరుక్షణం ......
ఆ మరుక్షణం ......
భోరున ఏడ్చేసింది పారిజాతం .
మోకాళ్ళ మీద తల ఆన్చుకొని .
మోకాళ్ళ మీద తల ఆన్చుకొని .
దుండగులు లేరని ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకున్నాక బయటికి నడిచింది పారిజాతం
మరబొమ్మలా .
మరబొమ్మలా .
రాక్షసుని కాళ్ళ క్రింద కర్కశంగా నలిగిపోయిన గులాబీలా .
...
అపార్ట్ మెంట్ చేరుకున్న పారిజాతం మామూలు మనిషి కాలేకపోయింది ఓ రెండు రోజుల పాటు . తర్వాత డ్యూటీకి వెళ్ళడం మొదలు పెట్టింది నిస్తేజంగా .
దేని మీదా ఆసక్తి ఉండటంలేదు పారిజాతానికి . అంతా యాంత్రికంగా జరిగిపోతోంది తన ప్రమేయం లేకుండా .
...
షబ్నం సింగపూర్ వెళ్లి వారం గడిచింది . ఇంకా రెండు వారాలు గడవాలి అని ఆలోచనల్లో ఉన్న పారిజాతం మొబైల్ రింగ్ అయితే చూసింది . ఎవరో తెలియని వారి నుంచి కాల్ . మొదట స్పందించలేదు . పదే పదే రింగ్ అవుతూ ఉంటే ఆన్సర్ చేసింది 'హలో ! ఎవరూ ! ' అని .
అవతలి వైపు నుంచి బదులు లేదు . రాంగ్ కాల్ అను కొని ఫోను కట్టేసింది .
రాత్రి డిన్నర్ చేసి షబ్నంకి కాల్ చేద్దామని ఫోను తీస్తే మెసేజ్ ఉంది . మెసేజ్ చూసిన పారిజాతం గుండె అతి వేగంగా కొట్టుకుంది. ఏమి చేయాలో తోచలేదు.
'ఆ రోజు జరిగిన ఘటన పూర్తిగా సెల్ ఫోను లో వీడియో రికార్డింగ్ చేయబడినదనీ మళ్లీ ఆ అనుభవం కావాలనీ అంగీకరించక పొతే వీడియో ఇంటర్నెట్ లో పెడతామనీ ' బెదిరింపు సారాంశం ఆ మెసేజ్ .
అలాటి లైంగిక వేధింపు మెసేజెస్ వస్తూనే వున్నాయి.
తన నిస్సహాయ పరిస్థితి క్షుణ్ణంగా అర్థం చేసుకున్న పారిజాతం ఇక జడత్వంలా ఉంటే లాభం లేదని గ్రహించింది .
వింటి నారి బిగించి సంధించిన రామబాణంలా దూసుకు పోయే తెగింపు వచ్చేసింది .
అంగీకారం తెలుపుతూ మెసేజ్ పెట్టింది అగంతకులకి.
ఆదివారం . రాత్రి తొమ్మిది గంటలు .
అగంతకులకు పారిజాతం మెసేజ్ లో ఇచ్చిన అపాయింట్ మెంట్ సమయం .
అగంతకులకు పారిజాతం మెసేజ్ లో ఇచ్చిన అపాయింట్ మెంట్ సమయం .
గచ్చిబౌలి లోని పారిజాతం సర్వీస్ అపార్ట్ మెంట్ .
కాల్ బెల్ మ్రోగింది .
'కం ఇన్ . డోర్ ఈస్ ఓపెన్ ' అంది పారిజాతం లోపలి నుండి .
డోర్ తెరుచుకొని లోపలి కి వచ్చిన వారిని చూశి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది . వికటంగా నవ్వుతూ వచ్చి సోఫాలో ఒక చివర కూర్చున్నాడు గెరటబాబు. సోఫా రెండవ చివర పర్వతాలు కూర్చున్నాడు వికృతంగా నవ్వుతూ . ఇద్దరి వద్దా విస్కీ వాసన గుప్పుమంటోంది .
డోర్ తెరుచుకొని లోపలి కి వచ్చిన వారిని చూశి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది . వికటంగా నవ్వుతూ వచ్చి సోఫాలో ఒక చివర కూర్చున్నాడు గెరటబాబు. సోఫా రెండవ చివర పర్వతాలు కూర్చున్నాడు వికృతంగా నవ్వుతూ . ఇద్దరి వద్దా విస్కీ వాసన గుప్పుమంటోంది .
గెరటబాబు లేచి పారిజాతం చేయి పట్టుకున్నాడు .
ప్రతిఘటించలేదు పారిజాతం . బెడ్ రూం లోకి దారి తీసింది. డోర్ వేసి రూం లో ఉన్న టీవీ ఆన్ చేసి వాల్యూం పెంచింది .
ఆలశ్యం భరించలేకపోతున్నాడు నిషాలో ఉన్న గెరటబాబు . కోరికతో బెడ్ మీదకు లాగబోయాడు పారిజాతాన్ని . అంతే . అంతా లిప్తపాటు కాలం లో జరిగిపోయింది .
కరాటే విద్యలో స్వీయరక్షణ కోసం నేర్చుకున్న కిక్ ప్రయోగించింది పారిజాతం గెరటబాబు ఆయువు పట్టుమీద . ఆ చావు దెబ్బకి నేల కూలిపోయాడు గెరటబాబు స్పృహ తప్పి . కాస్సేపటికి అతని ప్రాణాలు అనంత వాయువు లో కలిసి పోయాయి.
ముఖంలో ఎటువంటి భావాలు కనపడనీయకుండా డోర్ తెరచి బయటకు వచ్చింది పారిజాతం .
ముఖంలో ఎటువంటి భావాలు కనపడనీయకుండా డోర్ తెరచి బయటకు వచ్చింది పారిజాతం .
సోఫాలో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు పర్వతాలు . హాల్ లోనే పారిజాతాన్ని ఆక్రమించుకోబోయాడు పర్వతాలు .ఊహించని పారిజాతం కరాటే కిక్ కి గిల గిలా మంటూ నేల మీద కూలి పోయాడు పర్వతాలు. అర్భకుడు . కూలిన క్షణమే పర్వతాలు ప్రాణాలు గాలి లో కలిసిపోయాయి .
దుష్ట సంహారం చేశిన అమ్మవారిలా ఉంది
పారిజాతం .
అలాగే అచేతనంగా కూలబడింది సోఫాలో .
పారిజాతం .
అలాగే అచేతనంగా కూలబడింది సోఫాలో .
...
సింగపూర్ ప్రోజెక్ట్ పని త్వరగా ముగియటంతో అనుకున్న దాని కన్నా ముందే వచ్చింది షబ్నం . తిన్నగా ఎయిర్ పోర్ట్ నుండి వచ్చిన షబ్నం అపార్ట్ మెంట్ తలుపు తెరిచి ఉండటంతో లోపలికి వచ్చింది .హాలు లోని దృశ్యం చూసిన షబ్నం నోట మాట రాలేదు .
సోఫా లో ప్రశాంతంగా , నిర్మలంగా పారిజాతం కనిపించింది . ఆమె కళ్ళు పత్తి కాయల్లా ఉన్నాయి . సోఫా పక్కన పర్వతాలు శవం . బెడ్ రూం డోర్ తెరిచి ఉంది . అక్కడ నేల మీద గెరటబాబు శవమై కనిపించాడు . పారిజాతాన్ని భుజాలు పట్టి గట్టిగా ఊపింది షబ్నం . ఆమె నిర్వికారంగా చూస్తోంది శూన్యం లోకి . భయపడిపోయిన షబ్నం కేకలు వేసింది. ఆ కేకలకి జనం గుమికూడారు . పోలీసులకి కబురు చేరింది . సంఘటనా స్థలం చేరిన పోలీసులు పారిజాతాన్ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారు విచారణ కోసం .
...
మరుసటి రోజు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఈ వార్త సంచాలనాత్మకంగా హలచల్ చేసింది . టీవీ ప్రతి ఛానల్ లో 'నగరంలో దారుణం ' అంటూ స్క్రోలింగ్ న్యూస్ ప్రచారం అయింది ఆ రోజంతా . మీడియా ద్వారా విషయం తెలుసుకొన్న విశ్వనాధం హుటా హుటిన హైదరాబాద్ వచ్చాడు నా దగ్గరకి . అప్పటికే జరిగిన విషయం షబ్నం ద్వారా తెలుసుకున్న నాకు కాళ్ళూ , చేతులూ ఆడటంలేదు .
...
పోలీసు వారి విచారణలో పారిజాతం నోరు విప్పలేదు . మౌనంగా ఉండిపోయింది వారి ప్రశ్నలకు . హత్యా నేరం అభియోగాలు కింద పారిజాతం అరెస్ట్ అయింది . ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్ట్ లో కేసు విచారణ . జడ్జి గారు శ్రీమతి సౌజన్య .
...
విశ్వనాధం నగరం వచ్చిన సంగతి చెప్పగానే షౌకత్అలీ ఉన్నపళం గా బయలుదేరి వచ్చాడు మా వద్దకు . షౌకత్ ని చూడగానే అతన్ని చుట్టుకుపోయాడు విశ్వనాధం ' మన పుష్కరాల సమావేశం ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదురా 'అంటూ. గొంతుక లోని శోకాన్ని భుజం మీది కండువాతో అదిమిపెట్టి . చలించి పోయాడు షౌకత్అలీ .
తర్వాత స్నేహితులు ముగ్గురం కూర్చొని కేసు లో ఎలా ముందుకు సాగాలో చర్చించుకున్నాం .షౌకత్అలీ తనకు బాగా పరిచయం ఉన్న ప్లీడరు గారిని పెడతానన్నాడు పారిజాతం తరపున కేసు వాదించడానికి . కాస్త తేరు కున్నాడు విశ్వనాధం అది వినగానే .
వెడుతూ వెడుతూ షౌకత్అలీ ఇంకో మాట చెప్పాడు . జడ్జి శ్రీమతి సౌజన్య గారు చాలా మంచి మనిషి అని ఆవిడ ఎన్నో సంచలన తీర్పులు ఇచ్చారని . ఇది అభయమో స్వాంతనమో నాకు విశ్వనాధం కి బోధపడలేదు . అయినా మండే గుండెల మీద చల్లని నీళ్ళు చిలకరించినట్లు ఫీల్ అయ్యాం ఇద్దరమూ .
...
కేసు విచారణ జరుగుతోంది . పారిజాతం ముక్తసరి జవాబులు తప్ప సహకరించటంలేదు డిఫెన్సు లాయరు గారికి . ఈ విషయం తెలిసి నేనూ, విశ్వనాధం వెళ్ళాం పారిజాతం కి నచ్చచెప్పాలని నేరస్తులను ఉంచిన జైలుకి .
పారిజాతం సెల్ లో ఒంటరిగా ఉంది . మమ్మల్ని చూశిన ఆమెలో ఎటువంటి హావభావాలు లేవు . విశ్వనాధం గుడ్ల నీరు పెట్టుకున్నాడు పారిజాతాన్ని అలా చూసి . తండ్రి పరిస్థితి చూశి 'వద్దు నాన్నా! ' అంది .
'నువ్వు చిన్నతనంలో నేర్పించిన చదరంగం , కరాటే విద్యలు ఇలా ఉపయోగపడ్డాయి నాన్నా ! ' అంది పారిజాతం కన్నీరు ఆపుకుంటూ .
విశ్వనాధం ఏడుపు ఆపుకోలేక పోయాడు . భోరున ఏడ్చేశాడు. 'ఇలా అని అనుకోలేదు అమ్మా ' అన్నాడు రుద్ధ కంఠంతో .
నా వైపు చూశి 'మేస్టారూ ' అంది .
'ఎందుకు తల్లీ ! చట్టాన్ని నీ చేతుల లోకి తీసుకున్నావ్ ? దుండగులను శిక్షించే వ్యవస్థలు వేరే ఉన్నాయి కదా ! ' అన్నా .
నిర్వికారంగా నవ్వింది పారిజాతం నా మాటలకి .
'మేస్టారూ మీకూ తెలుసు . ఈ దేశంలో చట్టాల కి కోరలు లేవని. ఎంతటి దుర్మార్గం చేసినా నేరస్తుడు చట్టాల లోని లొసుగుల వల్ల తప్పించుకుంటున్నాడు . నిర్భయ చట్టాలు కామాంధులని ఏ మాత్రమైనా నిలువరించగలిగాయా ?
అసలు నేరస్తులకు ఎప్పుడైనా శిక్ష పడిందా ?
ఏనాడైనా న్యాయం సకాలంలో అందించ గలిగిందా మన న్యాయ వ్యవస్థ ?
మనకి స్వాతంత్రం వచ్చి ఈ నాటికి అరవై ఆరేళ్ళు . పూజ్య బాపూజీ ఆ నాడు ఏమన్నారు ?
ఏనాడైతే ఈ దేశంలో అర్థరాత్రి మహిళ నిర్భయంగా బయట తిరగ గలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం .
ఆ స్వాతంత్రం మనకి ఇంకా రాలేదు మేస్టారూ ' అంది పారిజాతం .
పారిజాతం సంధించిన ప్రశ్నలకు నా వద్ద మౌనం తప్ప మరొక జవాబు లేదు . 'ఎంత ఎత్తుకు ఎదిగి పోయావు తల్లీ ! ' అనుకున్నా మనసులో .
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న శ్రీ కృష్ణ పరమాత్మునిలా గోచరించింది పారిజాతం నా కంటికి .
టైం అయిపోయింది అంటూ వచ్చాడు సెంట్రీ .
...
కేసు నడుస్తోంది . వాయిదాలు పడుతున్నాయి . కొన్నాళ్ళు ఉండి విశ్వనాధం మళ్ళీ వస్తానని రాజమండ్రి వెళ్ళాడు . వెళ్తూ 'పారిజాతాన్ని చూసుకోరా ' అన్నాడు కంట నీరు పెట్టుకుంటూ .
...
ఉదయమే లేచిన విశ్వనాధం ఆరు బయట పచార్లు చేస్తూ ఉండగా ఏదో మార్పు జరిగినట్లు గ్రహించాడు . అదేమిటో స్పష్టంగా తెలియటం లేదు . గేటు తీసి చూస్తే ఎవరో దుండగులు మట్టానికి నరికివేసిన పారిజాతం మొక్క కనిపించింది .
నేల రాలి పోయింది పారిజాతం .
రాత్రి కురిసిన మంచు నీటి బొట్లు గా మారి నేల రాలిన పారిజాతాల మీద పరచుకుంది .
ప్రకృతి విలపిస్తున్నట్లుగా వుంది ఆ దృశ్యం .
రేపే పారిజాతం కేసు తీర్పు .
ఈ కధకి ముగింపు లేదు .
...............................................................................
ఈ రచన లోని పాత్రలు , ఘటనలు ,సంఘటనలు ,సన్నివేశాలూ కేవలం కల్పన.. .. ఊహా జనితం . ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాశినవి కావు . ఇది ఒక ప్రయోగం మాత్రమే .
పాఠకుల ' తీర్పు ' ఏ విధంగా ఉంటుందోనని నా గుండెలు లబ్ ... డబ్ ... లబ్ ... డబ్ మని కొట్టుకొంటున్నాయి .
...................................................................................................................................................................................................